12 Year-Old Girl Assaulted (Image Source: AI)
జాతీయం

12 Year-Old Girl Assaulted: దేశంలో అత్యంత ఘోరం.. 12 ఏళ్ల బాలికపై.. 200 మంది అత్యాచారం!

12 Year-Old Girl Assaulted: ముంబయిలోని వసాయి నాయ్ గావ్ ప్రాంతంలో బయటపడిన వ్యభిచార ముఠా కేసులో సంచలన విషయం వెలుగుచూసింది. వారి ఉచ్చు నుంచి బయటపడిన 12 ఏళ్ల బంగ్లాదేశ్ బాలిక (Bangladeshi girl) .. తాను 3 నెలల వ్యవధిలో 200 మందికి పైగా వ్యక్తుల చేతిలో లైంగిక దాడికి గురైనట్లు వెల్లడించింది. ఈ బాలికను జూలై 26న ఎగ్జోడస్ రోడ్ ఇండియా ఫౌండేషన్ (Exodus Road India Foundation), హార్మనీ ఫౌండేషన్ (Harmony Foundation) అనే రెండు స్వచ్ఛంద సంస్థలు.. పోలీసుల సాయంతో రక్షించాయి. ఈ కేసులో ఇప్పటివరకూ 10 మందిని ముంబయి యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ పోలీసు యూనిట్ అరెస్ట్ చేసింది. .

టీనేజ్‌లోకి చేరుకోకముందే..
హార్మనీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అబ్రహం మాథై (Abraham Mathai) మాట్లాడుతూ ‘ఆ బాలికను మొదట గుజరాత్‌లోని నడియాద్‌కు తీసుకెళ్లి మూడు నెలల్లో 200 మందికి పైగా వ్యక్తుల చేత లైంగిక దాడి చేయించారు. ఈ అమ్మాయి ఇంకా టీనేజ్‌కి చేరుకోకముందే వ్యభిచార వ్యాపారంలో ఉన్న రాక్షసులు ఆమె చిన్ననాటి జీవితాన్ని దోచేశారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

బాలిక.. ఆ ఊబిలో ఎలా చిక్కిందంటే?
అసలు బాలిక.. వ్యభిచార ముఠా ఉచ్చులో ఎలా చిక్కిందన్న విషయాన్ని అబ్రహం మాథై తెలియజేశారు. ‘పాఠశాలలో ఓ విషయంలో ఫెయిల్ అయినందున బాలికను ఆమె తల్లిదండ్రులు మందలించారు. దీంతో పరిచయస్తురాలితో కలిసి బాధిత బాలిక.. బంగ్లాదేశ్ లోని ఇంటి నుండి పారిపోయింది. పరిచయస్తురాలు ఆ బాలికను భారత్ లోకి అక్రమంగా తీసుకొచ్చి వ్యభిచారంలోకి నెట్టేసింది’ అని వివరించారు. అలాగే ఆ బాలికపై దాడి చేసిన 200 మందిని కూడా అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

బాలికకు పోలీసుల హామీ
పోలీస్ కమిషనర్ నికేట్ కౌశిక్ (Police commissioner Niket Kaushik) మాట్లాడుతూ.. “హ్యుమన్ ట్రాఫికింగ్ నెట్వర్క్‌ను బయటపెట్టడానికి మా శక్తినంతా ఉపయోగిస్తున్నాం. ఈ ముఠా ఉచ్చులో చిక్కుకున్న బాలికలకు సురక్షిత వాతావరణం కల్పించడానికి ప్రయత్నిస్తున్నాం’ అని హామీ ఇచ్చారు. మరింత లోతుగా కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు కమిషనర్ చెప్పుకొచ్చారు.

Also Read: Plane Crash: ఓరి దేవుడా.. విమానాన్ని ఢీకొట్టిన మరో విమానం.. క్షణాల్లో పెను విధ్వంసం!

త్వరగా ఎదిగేందుకు హార్మోన్ ఇంజెక్షన్లు
బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటనను ముంబయిలోని ప్రముఖ సామాజిక కార్యకర్త మధు శంకర్ (Activist Madhu Shankar) తీవ్రంగా ఖండించారు. ‘నగరంలోని వాషి, బేలాపూర్ ప్రాంతాల్లో చిన్నారులు భిక్షాటన చేస్తూ తరచుగా కనిపిస్తారు. వీరిలో చాలామందిని చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే గ్రామాల నుండి దొంగిలించి నగరాలకు తీసుకువచ్చి దోపిడీ చేయిస్తున్నారు. ఒకరు లేదా ఇద్దరు వృద్ధ మహిళలు కొద్దికాలం వారిని చూసుకుంటారు. కొంచెం పెద్దయ్యాక ఆ ముఠా బాలికలను వ్యభిచారంలోకి నెట్టేస్తోంది. బాలికలు త్వరగా యవ్వనానికి చేరుకోవాలని హోర్మోన్ ఇంజెక్షన్లు సైతం ఇస్తున్నారు’ అంటూ మధు శంకర్ వివరించారు.

Also Read This: Gurukulam: సవాళ్ల నడుమ నడుస్తున్న గురుకులాలు.. సమస్యలు సృష్టిస్తున్న పాత కాంట్రాక్టర్లు 

Also Read This: Anupama Parameswaran: రోడ్డుపై పరదాలు అమ్ముతున్న అనుపమ.. ఇనుప సామాన్లు కూడా అమ్ము అంటూ నెటిజన్ కామెంట్

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ