CM Revanth Reddy( IMAGE credit: TWITTER)
హైదరాబాద్

CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవనం ఎంతో అవసరం.. అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: హైదరాబాద్‌లో వర్షాలతో తలెత్తే ఇబ్బందులు, వరద సమస్య పరిష్కారంపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఇందుకు సంబంధించి అన్ని విభాగాల అధికారుల అభిప్రాయాలు తీసుకున్నారు. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్( Hyderabad) నగరం అతలాకుతలమైన పరిస్థితులను అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. వరద నీటి ప్రవాహానికి అడ్డంకులు ఉండడం వల్లే నగరంలో ఈ దుస్థితి తలెత్తుతోందన్న అధికారులు వివరించగా, ఔటర్ రింగ్ రోడ్డు(, Outer Ring Road) లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్‌లోని వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Also Read: KTR Vs Bandi Sanjay: బండి సంజయ్‌ 48 గంటల్లో క్షమాపణ చెప్పాలి: కేటీఆర్ సీరియస్

వరద నీరు మూసీ వైపు..

నగరంలోని వరద నీరు మూసీని చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం స్పష్టం చేశారు. ప్రతీ చెరువు, నాలా, ఇతర కాలువలను మూసీకి అనుసంధానం చేయాలని సూచించారు. చెరువుల పునరుద్ధరణ, నాలాల వెడల్పు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ఎక్కడ వర్షం పడినా నీరు చెరువుల్లోకి, నాలాల్లోకి, అటు నుంచి మూసీలోకి చేరేలా చర్యలు చేపట్టాలని చెప్పారు.

మూసీ పునరుజ్జీవనం ముఖ్యం

భవిష్యత్‌లో నగరంలో ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా ఉండాలంటే మూసీ పునరుజ్జీవనం అవసరమని రేవంత్ రెడ్డి(Revanth Reddy) గుర్తు చేశారు. వరద సమస్యకు మూసీ పునరుజ్జీవనమే శాశ్వత పరిష్కారమని ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల వర్షాకాలంలో నీటి ప్రవాహం, ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టొచ్చని చెప్పారు.

 Also Read: Singer Madhu Priya: చెల్లెలి పెళ్లి వేడుకల్లో సింగర్ మధుప్రియ.. ఫ్యామిలీ అంతా కలిసిపోయారా?

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!