KTR-Vs-Bandi-Sanjay
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

KTR Vs Bandi Sanjay: బండి సంజయ్‌ 48 గంటల్లో క్షమాపణ చెప్పాలి: కేటీఆర్ సీరియస్

KTR Vs Bandi Sanjay:

చెప్పకుంటే కోర్టుకు ఈడుస్తానంటూ హెచ్చరిక

KTR Vs Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ అంశంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా , వాస్తవాలు తెలుసుకోకుండా, అసంబద్ధమైన, దిగజారుడు, థర్డ్‌క్లాస్ స్థాయి ఆరోపణలు చేయడం బండి సంజయ్ అలవాటుగా మార్చుకున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో చవకబారు పబ్లిసిటీ కోసం, మీడియా దృష్టిని ఆకర్షించడానికే ఈ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు.

కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్‌కు నిఘా వ్యవస్థల పనితీరు, విధానాలపై కనీస అవగాహన, పరిజ్ఞానం, ఇంగిత జ్ఞానం కూడా లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. బాధ్యత గల పదవిలో ఉండి ఇంత నిరాధార ఆరోపణలు చేయడం ఆయన అజ్ఞానం, నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. “కేంద్ర మంత్రిగా పనిచేయడం అంటే ఢిల్లీ బాసులకు చెప్పులు మోసినంత ఈజీ కాదని బండి సంజయ్ ఇప్పటికైనా గ్రహించాలి” అని కేటీఆర్ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై మాట్లాడిన ప్రతిసారీ బండి సంజయ్ మరింత దిగజారుతున్నారని, తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. “రాజకీయాల్లో పెద్ద జోకర్‌గా మారిన బండి సంజయ్ మీడియా హెడ్‌లైన్స్ కోసం, చీప్ పబ్లిసిటీ కోసం, వీధి నాటకాలు ఆడుతున్నాడు’’ అని ఘాటుగా మండిపడ్డారు.

Read Also- Modi-Putin: ట్రంప్ టారీఫ్‌ల వేళ… మోదీ, పుతిన్ ఫోన్ సంభాషణలు

48 గంటల గడువు
బండి సంజయ్ ఆరోపణల్లో ఒక్క శాతం నిజం ఉన్నా నిరూపించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. లేదంటే, తక్షణమే ఆ ఆరోపణలను ఉపసంహరించుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ చేసిన ఆరోపణలపై లీగల్ నోటీసు పంపిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ డిమాండ్‌ను పట్టించుకోకపోతే, 48 గంటల గడువు తర్వాత కోర్టుకు ఈడుస్తానని ఆయన హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ అంశం ఎంత సున్నితమైనదో, చట్టపరంగా ఎంత కఠినమైనదో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు తెలియకుండానే , కావాలనే వాస్తవాలను వక్రీకరిస్తూ, సాక్ష్యం లేకుండా ఆరోపణలు చేయడం ఆయన రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం ఆగ్రహం వ్యక్తం చేశారు. “తప్పుడు ఆరోపణలు, బజారు స్థాయి మాటలు, చవకబారు పబ్లిసిటీ కోసం చెప్పే అబద్ధాలు.. ఇవన్నీ బండి సంజయ్‌కు అలవాటు అయిన రాజకీయాలని, ఇకపై ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తే సహించేది లేదని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.

Read Also- PM Modi China Tour: కీలక పరిణామం.. షాంఘై సదస్సుకు మోదీని ఆహ్వానించిన చైనా

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?