Madhu Priya at Her Sister Marrage
ఎంటర్‌టైన్మెంట్

Singer Madhu Priya: చెల్లెలి పెళ్లి వేడుకల్లో సింగర్ మధుప్రియ.. ఫ్యామిలీ అంతా కలిసిపోయారా?

Singer Madhu Priya: తన వ్యక్తిగత జీవితంలో సవాళ్లు ఎదురైనప్పటికీ సింగర్ మధుప్రియ వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళుతోంది. వృత్తి పరంగా ప్రస్తుతం ఆమె విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని ‘గోదారి గట్టుపైన రామ చిలకవే’ పాటని రమణ గోగులతో కలిసి ఆమె పాడిన విషయం తెలిసిందే. ఆ పాట చార్ట్ ‌బస్టర్ హిట్ అయింది. ఇప్పటికీ మారుమోగుతూనే ఉంది. ఆ పాట తర్వాత సింగర్ మధుప్రియకు వరుస ఆపర్లు వస్తుండటం విశేషం. వృత్తి పరంగా ఇలా ఉంటే.. వ్యక్తిగతంగా మాత్రం ఆమె జీవితంలో, అందునా చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు అనుభవించాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్నాళ్లుగా ఆమె జీవితంలో రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటన్నింటినీ తెరపడిందనేలా.. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు కొన్ని తెలియజేస్తున్నాయి. అదే నిజమైతే.. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ఆమె సంతోషంగా ఉన్నట్టే భావించవచ్చు. ఇంతకీ ఆమె షేర్ చేసిన ఫొటోల సంగతి ఏంటి? అని అనుకుంటున్నారా..

Also Read- Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’ హీరోయిన్ ఫస్ట్ లుక్ విడుదల.. సప్తమి గౌడ కాదండోయ్!

సింగర్ మధుప్రియ (Singer Madhu Priya) తన చెల్లెలు శృతి ప్రియ పెళ్లి వేడుకల్లో సందడి చేస్తున్న ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో తన ఫ్యామిలీతో కలిసి ఆమె హ్యాపీగానే ఉన్నట్లుగా కనిపిస్తుంది. శృతి ప్రియ హల్దీ ఫంక్షన్‌కి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ వీడియోలలో ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి డ్యాన్స్ కూడా చేస్తుంది. ప్రస్తుతం చెల్లెలి పెళ్లి వేడుకలు ముగిసినట్లుగా తెలుస్తోంది. శృతి ప్రియ పెళ్లి కార్యక్రమాలు పూర్తయ్యాయి. చాలా గ్రాండ్‌గా ఈ పెళ్లి జరిగింది. ఈ పెళ్లి చూసిన మధుప్రియ.. తను ఏం కోల్పోయిందో అర్థమై ఉంటుందని అంతా అనుకుంటూ ఉండటం విశేషం. అయితేనేం, చెల్లి పెళ్లిలో మాత్రం చాలా హ్యాపీగా, ఎనర్జిటిక్‌గా కనిపించింది మధుప్రియ. ఆ విషయం ఆమె చేస్తున్న డ్యాన్స్ చూస్తుంటేనే తెలిసిపోతుంది. ప్రస్తుతం మధుప్రియ చెల్లెల్లు శృతి ప్రియ వెడ్డింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను చూసిన వారంతా మధుప్రియ తన ఫ్యామిలీతో కలిసిపోయారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read- The Paradise Film: ‘ది ప్యారడైజ్‌’లో రెండు జడలతో నేచురల్ స్టార్.. నెటిజన్లు ఏమంటున్నారంటే?

మధుప్రియ జీవితంలో ఏం జరిగిందంటే..
మధు ప్రియ 2015లో శ్రీకాంత్ అనే వ్యక్తిని ప్రేమించి, తన కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకుంది. ఆమె వివాహం చేసుకున్నప్పుడు ఆమె వయసు 18 సంవత్సరాలు. ఆమె వివాహం జరిగిన కొన్ని నెలల తర్వాత, మధు ప్రియ తన భర్త శ్రీకాంత్ తనను వరకట్నం కోసం వేధిస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాకపోతే, వెంటనే ఆ ఫిర్యాదును ఆమె వెనక్కి తీసుకున్నారు. ఆ సమయంలో ఆమె, ఆమె భర్త మధ్య జరిగిన గొడవలు మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. గత కొన్నేళ్లుగా మధు ప్రియ ఒంటరిగానే ఉంటున్నట్లుగా వార్తలు నడుస్తున్నాయి. ఆమె భర్తతో విడిపోయారని మీడియాలో సైతం కథనాలు వచ్చాయి. కాకపోతే ఆమె అధికారికంగా విడాకులు తీసుకున్నారా? లేదా? అనే విషయం స్పష్టంగా తెలియలేదు. అంతకంటే ముందు ఆమె పాడిన ‘ఆడపిల్లనమ్మా’ అనే పాట ఆమెను ఫేమస్ చేసింది. ఆ పాటతో ఆమె రాత మారిపోయింది. ప్రస్తుతం సినిమాలలో నేపథ్య గాయనిగా ఉంటూనే, కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్‌ని మధుప్రియ చేస్తున్నారు.

">

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది