Kantara Chapter 1: వరమహాలక్ష్మి పండుగ శుభ సందర్భంగా శుక్రవారం సినిమాటిక్ ఎపిక్ ‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్‌ని రివీల్ చేశారు. వాస్తవానికి ఇప్పటి వరకు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఎక్కడా రివీల్ చేయలేదు. దీంతో అందరూ ఈ పార్ట్‌లో కూడా సప్తమి గౌడ (Sapthami Gowda)నే హీరోయిన్ అని అనుకున్నారు. కానీ, తాజాగా మేకర్స్ రివీల్ చేసిన పేరుతో అంతా షాక్ అవుతున్నారు. ‘కాంతార’ సినిమాలో సప్తమి గౌడ పాత్రకు చాలా మంచి పేరు వచ్చింది. నేచురల్ బ్యూటీగా ఆమెపై ప్రశంసలు పడ్డాయి. ఆ తర్వాత టాలీవుడ్‌లోనూ ఆమెకు అవకాశాలు వరిస్తున్నాయి. రీసెంట్‌గా వచ్చిన నితిన్ ‘తమ్ముడు’ సినిమాలో సప్తమి గౌడ చాలా కీలక పాత్రలో నటించి, మెప్పించిన విషయం తెలిసిందే. ఆ సినిమా సక్సెస్ అవలేదు కానీ, లేదంటే, ఆమె పాత్రకు ఇంకా మంచి గుర్తింపు లభించేది. సరే విషయంలోకి వస్తే..
‘కాంతార’తో పాన్ ఇండియా హీరో స్థాయి గుర్తింపు సొంతం చేసుకున్న రిషబ్ శెట్టి (Rishab Shetty) రచన, దర్శకత్వంలో, బ్లాక్ బస్టర్ ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘కాంతార చాప్టర్ 1’. రీసెంట్‌గానే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కన్నడ సినీ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాణ సంస్థగా పేరున్న హోంబాలే ఫిల్మ్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో, గ్రాండ్‌గా నిర్మిస్తోంది. ఇటీవల రిషబ్ శెట్టి పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేసిన ఫస్ట్ లుక్ మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా వరమహాలక్ష్మి పండుగను పురస్కరించుకుని ఇందులో ‘కనకావతి’గా చేస్తున్న హీరోయిన్ ఫస్ట్ లుక్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ కనకావతి ఎవరో కాదు.. ‘రుక్మిణి వసంత్’ (Rukmini Vasanth). తెలుగు ప్రేక్షకులకు కూడా రుక్మిణి వసంత్ పరిచయమే. ఆమె చేసిన సినిమాలు తెలుగులోనూ విడుదలయ్యాయి. తెలుగు హీరోలతోనూ ఆమె నటించింది. ఇప్పుడు టాలీవుడ్‌లోని స్టార్ హీరోల సినిమాలలో ఆమె నటిస్తున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.
ఈ ఫస్ట్ లుక్‌లో రుక్మిణి వసంత్ నిండైన చీరకట్టులో, నవ్వుతూ కనిపించారు. ఆమె లుక్ చూస్తుంటే మహారాణిగా ఆమె ఇందులో కనిపించనుందనే ఫీల్‌ని కలిగిస్తోంది. ఆమె లుక్ సినిమాపై మరింత ఉత్సాహాన్ని, క్యూరియాసిటీని కలిగించేదిగా ఉంది. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రం కాంతార యూనివర్స్‌లో మరో అద్భుతమైన అధ్యాయం అవుతుందని, అర్వింద్ ఎస్. కాశ్యప్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ, బి. అజనీష్ లోకనాథ్ అందించే సంగీతం, హోంబలే ఫిలిమ్స్ విజయ్ కిరగందూర్ వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ వేల్యూస్.. అన్నీ కలగలిపి ఈ సినిమా విజువల్ వండర్‌గా ఉండబోతుందని చిత్రబృందం తెలుపుతోంది. ‘కాంతార చాప్టర్ 1’ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 2 అక్టోబర్, 2025న కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషలలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Introducing @rukminitweets as ‘KANAKAVATHI’ from the world of #KantaraChapter1.
ಕನಕವತಿಯ ಪರಿಚಯ ನಿಮ್ಮ ಮುಂದೆ.
कनकवती का परिचय आपके लिए.
కనకవతి ని మీకు పరిచయం చేస్తున్నాం.
கனகாவதியை பற்றிய அறிமுகம் உங்கள் முன் உள்ளது.
കനകാവതിയുടെ ആമുഖം നിങ്ങൾക്കുമുമ്പിൽ.
আপনাদের সামনে কনকবতীকে… pic.twitter.com/4JmMy901un— Hombale Films (@hombalefilms) August 8, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు