Ahuja Raj Kasireddy
లేటెస్ట్ న్యూస్, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Sunil Ahuja: బయటపడుతున్న హవాలా అహుజా బాగోతం

  • ఏపీ లిక్కర్ స్కాంలో హవాలా నగదు
  • కీ రోల్ పోషించిన సునీల్ అహుజా, ఆశీష్ అహుజా
  • ఇద్దరి కోసం సిట్ అధికారుల గాలింపు
  • అక్రమ ఫైనాన్స్ రిజిస్ట్రేషన్స్‌తో ఇప్పటికే కొల్లగొట్టిన వేల కోట్ల ఆస్తులు
  • అన్నింటినీ నోట్లుగా మార్చి హవాలా దందా
  • రోడ్డున పడ్డ రియల్టర్స్.. వందల మంది బాధితులు
  • అహుజా అక్రమ ఫైనాన్స్ దందాపై ముందే చెప్పిన ‘స్వేచ్ఛ’
  • వైట్ మనీ ఇచ్చి బ్లాక్ తీసుకునేది హవాలా కోసమే?
  • పలు పోలీస్ స్టేషన్స్‌లో కేసుల నమోదు
  • రిమోట్ రీబూట్‌తో క్లౌడ్‌లో డేటాను భద్రపర్చిన వైనం
  • ఐటీకి, ఈడీకి దొరకకుండా ఎత్తుగడలు
  • హైదరాబాద్ టు అమెరికా వరకు బ్లాక్ మనీ మార్కెట్
  • వయా దుబాయి మీదుగా యూఎస్‌లో డీటీ కాయిన్స్?

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
స్వేచ్ఛ ఎడిటర్


Sunil Ahuja: హైదరాబాద్‌లో ఎందరో రియల్టర్లను ముంచేసిన హవాలా కింగ్‌ పిన్ సునీల్ అహుజా వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఫోకస్ చేశారు. లిక్కర్ స్కాంలో వచ్చిన డబ్బులను హవాలా రూపంలో మార్చింది ఆహుజా కుటుంబమేనని గుర్తించారు. దీంతో హైదరాబాద్‌లో పట్టుపడ్డ నగదును ఏపీలో కోర్టుకు సమర్పించిన పోలీసులు ఆ నగదు లింకులపై ఆరా తీయగా సునీల్ కుమార్ అహుజా పేరు బయటకొచ్చింది. ఏపీతో పాటు మరిన్ని రాష్ట్రాలకు నగదు బదిలీ చేశారని అనుమానిస్తున్నారు. సునీల్ కుమార్‌తో పాటు అతని కుమారుడు అశీష్ కుమార్ ఆహుజాపై కూడా ఫోకస్ ఉంచారు. వీరు ఇక్కడి డబ్బులను దుబాయికి అటు నుంచి అమెరికాకు క్రిప్టో కాయిన్స్ రూపంలో సేఫ్‌గా బదలాయించారనే ఆరోపణలు ఉన్నాయి. డాక్యుమెంట్లు దొరకకుండా తన కుమారుడు రిమోట్ బూట్‌తో క్లౌడ్‌లో అహుజా దాచి పెట్టాడని సమాచారం. ఇదంతా తాను ఫోరెన్సిక్‌లో నైపుణ్యం సాధించడంతో ఏ సెంట్రల్ ఏజెన్సీకి కూడా పట్టుపడకుండా అంతా బాగానే ఉన్నట్లు కలరింగ్ ఇస్తున్నట్లు తెలుస్తున్నది.

హైదరాబాద్ టు అమెరికా లింకులు


తాజా పరిణామాలు చూస్తుంటే ఎంతోమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఫైనాన్స్ పేరుతో కుచ్చుటోపీ పెట్టిన సునీల్, అశీష్ ఆహుజాల పాపం పండుతున్నట్టు ఉన్నది. ఆస్తిని 30 శాతానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవడమే కాకుండా వీరి వడ్డీ వేధింపుల కారణంగా చాలామంది చనిపోయారు. అనుకున్నట్లు మొత్తం చెల్లించినా, అధిక వడ్డీలు వేసి 100 శాతం మార్కెట్ ప్రైస్‌కి డబ్బుల రూపంలో ఇస్తేనే డ్యాకుమెంట్ రిటర్న్ చేయడం అలవాటు చేసుకున్నారు. దీంతో ఆ డబ్బు అంతా హవాలా రూపంలో ఎక్కడికైనా అంగోటి కమిషన్స్‌తో మార్చేసేంత నెట్ వర్క్ పెంచుకున్నారు. పొలిటకల్ పార్టీలకు, నేతలకు, బిజినెస్‌మెన్స్‌కు ఇదంతా తెలిసిందే. అందుకే ఏపీలో డబ్బులు ఇక్కడకి చేరకుండానే హైదరాబాద్‌లో 10 కోట్ల నుంచి 100 కోట్ల వరకు అరేంజ్ చేయగలరనే ఆరోపణలు ఉన్నాయి. అందుకు అక్కడ నగదు తీసుకుని ఎక్కడైనా వైట్ అమౌంట్ ట్రాన్సఫర్ చేయగలరు. పెద్ద ఎత్తున దుబాయికి డబ్బులు తరలించి, అక్కడ వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించి, అక్కడి నుంచి అమెరికాలో యూఎస్ డీటీ రూపంలో అరేంజ్ చేయగలరని సన్నిహితులు చెబుతూ ఉంటారు.

లిక్కర్ స్కాంలో ఇరుక్కున్నట్లేనా?

ఆహుజా కుటుంబంపై ఎప్పటి నుంచో హవాలా ఆరోపణలు ఉన్నాయి. అయితే, అందరికీ అవసరానికి పనికొచ్చే సరికి ఎవరూ ఇన్నాళ్లూ ఈ వ్యవహారంపై ఫోకస్ చేయలేదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లేకపోవడం, మార్కెట్‌లో నగదు దొరకకపోవడంతో అరాచకాలు పెరిగాయి. దీంతో బాధితుల సంఖ్య పెరగడమే కాకుండా గతంలో అతను చేసిన వ్యవహారాలు బయటకు పొక్కుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ లిక్కర్ స్కాం కేసు స్వింగ్‌లో దర్యాప్తు చేస్తున్నందున వందల కోట్ల డబ్బులు ప్రైవేట్ సంస్థలకు వెళ్లడం, అక్కడ నుంచి వేరేచోట నగదుగా మారడం, పెద్ద మొత్తంలో విదేశాల్లో చేతులు మారాయని అనుమానాలు రావడంతో ఇదంతా చేసింది ఎవరని పోలీసులు ఆరా తీస్తే హవాలా బిజినెస్ బయటపడింది. లిక్కర్ స్కాం నిందితుడు రాజ్ కసిరెడ్డితో అహుజా తరచూ భేటీ అయినట్టు తెలుస్తున్నది. అయితే, ఎంతటి వారినైనా అరెస్ట్ చేస్తున్న ఏపీ పోలీసులు సునీల్, ఆశీష్ అహుజాని కూడా నిందితులుగా చేర్చుతారా? అరెస్ట్ చేస్తారా? ఒకవేళ చేస్తే పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌లో ఉన్న కేసులకు తీసుకొస్తారా? విచారణ జరిపితే ఎన్నో ఆర్థిక వ్యవహారాలు బయటపడనున్నట్లు తెలుస్తున్నది. ఇదే క్రమంలో బాధితులు ఆస్తుల రిజిస్ట్రేషన్స్, వడ్డీ అరాచకాలపై బయటకు వచ్చి ఫిర్యాదులు చేసేందుకు ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి.

Read Also- TS Politics: గ్రేటర్ గులాబీ బాధ్యతలు.. ఆ ఇద్దరిలో ఎవరికి?

రోడ్డెక్కిన అహుజా బాధితులు

మరోవైపు, హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర అహుజా బాధితులు ఆందోళనకు దిగారు. భూములు ఇవ్వకుండా బెదిరిస్తున్నారని ఆరోపించారు. సునీల్, ఆశిష్ అహుజాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. హవాలా మాఫియా, రియల్ ఎస్టేట్ గూండాల నుంచి తమను కాపాడాలని బ్యానర్లు ప్రదర్శించారు. ఐదేళ్ల నుంచి 700 కుటుంబాలు న్యాయం కోసం చూస్తున్నాయని, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని విన్నవించారు. భారతి బిల్డర్స్‌కు రుణాలు ఇచ్చి స్థలాన్ని తాకట్టు పెట్టుకున్న అహుజా, తర్వాత దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దీంతో వందల మంది బాధితులు రోడ్డునపడ్డారు. దీనిపై బాధితులను అడుగగా, సునీల్ కుమార్ అహుజా అనే వ్యక్తి ప్రీలాంచ్ సమయంలో తాము డబ్బులు ఇచ్చినప్పుడు లేడని చెప్పారు. రెండేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని భారతి బిల్డర్స్ వారు చెప్పారని తర్వాత వారు మాట మార్చారని అన్నారు. ఎక్కడ పని అక్కడే ఆగిపోయిందని తెలిపారు. దీనిపై నిలదీయగా సునీల్ కుమార్ అహుజాకు భూమి బదలాయింపు జరిగినట్టు తెలిసిందని చెప్పారు. తాము రూ.70 కోట్లు కట్టామని వాపోయారు. ఇప్పుడు లిక్కర్ స్కాంలో సునీల్ అహుజా కీలక పాత్ర పోషించినట్టు తేలడంతో తమకు కూడా న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

Read Also- Anasuya Comments: ‘చెప్పు తెగుద్ది’.. ఆకతాయిలకు పబ్లిగ్గా అనసూయ వార్నింగ్!

Just In

01

Bigg Boss 9 Telugu Promo: తనూజ మూతిపై దాడి.. హోస్‌లో మళ్లీ రచ్చ రచ్చ.. ప్రోమో చూస్తే గూస్ బంప్సే!

ibomma Warning: టాలీవుడ్‌కు ఐబొమ్మ బిగ్ వార్నింగ్.. స్టార్ హీరోలపై సంచలన ఆరోపణలు

Kadiyam Srihari: ఘనపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి 50కోట్లు.. కడియం శ్రీహరి కీలక వాఖ్యలు

Nagarjuna: కింగ్ నాగార్జునకు బిగ్ రిలీఫ్.. రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

Bank Holidays 2025: బిగ్ అలెర్ట్.. అక్టోబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు.. ఈ తేదీల్లో అస్సలు వెళ్లొద్దు!