Anasuya Comments: యాంకర్ కమ్ నటి అనసూయలో సహనం నశించింది. తాజాగా ఆమె ఓ షాపింగ్ మాల్ లాంచ్‌కు వెళ్లగా, అక్కడ కొందరు ఆకతాయిలు చేసిన కామెంట్స్‌తో విసిగిపోయింది. అందుకే తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక, ఆ ఆకతాయిలకు ఇచ్చి పడేసింది. అనసూయ అనగానే ఫైర్ బ్రాండ్ అనే పేరు గుర్తుకు వస్తుంది కానీ, ఆమెలోని అసలు సిసలు ఫైర్ మాత్రం ఈ షాపింగ్ మాల్ లాంచ్ వేడుకలోనే బయటపడింది. అంతే ఒక్కసారిగా అంతా షాక్ అవుతున్నారు. అనసూయలో ఇంత ఫైర్ ఉందా? అని అవాక్కవుతున్నారు. మాములుగా సోషల్ మీడియాలో ఎవరైనా యాంటీ ఫ్యాన్స్ తనపై కామెంట్స్ చేస్తే.. వాళ్లని రెండు మాటలు అనేసి, రెండు మూడు రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది అనసూయ. కానీ, పబ్లిగ్గా ఒక సెలబ్రిటీ అయిన అనసూయ ‘చెప్పు తెగుద్ది’ అని అనడం మాత్రం ఇప్పుడు హైలైట్ అవుతోంది. ఆమె ఈ మాటలు అంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. అసలేం జరిగిందంటే..
Also Read- Vijay Deverakonda: ‘కింగ్‌డమ్’ చూసి సుకుమార్ ఫోన్ చేశారు.. అప్పుడు సంతోషించా!
ఆంధ్రప్రదేశ్, మార్కాపురంలోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు అనసూయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సెలబ్రిటీలు షాపింగ్ మాల్ ఓపెనింగ్స్‌కు రావడమనేది కొత్త విషయం ఏమీ కాదు. ఇప్పటి వరకు ఎందరో సెలబ్రిటీలు ఇలాంటి వాటికి హాజరయ్యారు. అంతెందుకు, అనసూయ కూడా ఇప్పటికే చాలా సార్లు షాపింగ్ మాల్స్ లాంచ్ వేడుకకు హాజరయ్యారు. కానీ ఎప్పుడూ ఆమెలో ఇంత ఫైర్ చూడలేదు. మార్కాపురం షాపింగ్ మాల్ ఓపెన్‌లో అనసూయ మైక్ అందుకుని మాట్లాడుతుండగా, ఎదురుగా ఉన్న కొందరు ఆకతాయిలు ఆమెపై అసభ్యకరంగా కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తోంది. అవి ఆమెకు వినిపించడంతో.. ‘చెప్పుతెగుద్ది.. చెప్పుతెగుద్ది.. ఇక్కడి నుంచి కిందకు వచ్చైనా సరే చెప్పు తెగే వరకు కొడతాను. మీరంతా చిన్నపిల్లలు. ఇంట్లో మీ అమ్మని కూడా అదే అడుగుతారా? వెరీ బ్యాడ్.. వెరీ వెరీ బ్యాడ్. మీ ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉంటారు. ఇంట్లో మీ అమ్మ, అక్క, చెల్లి, పెళ్లాన్ని ఎవరినైనా ఇలాగే ఏడిపిస్తే మీకు బావుంటుందా? మీ ఇంట్లో వాళ్లపై కూడా ఇలాగే కామెంట్స్ చేస్తే ఊరుకుంటారా? పెద్దవాళ్లకి మర్యాద ఇవ్వడం మీ ఇంట్లో నేర్పించలేదా? మీ ఇంట్లో ఆడవాళ్లను ఎవరైనా అంటే మీకు నచ్చుతుందా? మీ కోసం చాలా దూరం నుంచి దాదాపు 7 గంటల పాటు జర్నీ చేసి, రెడీ అయి వస్తే.. మీరు ఇదేనా చేసేది? మీ ఇళ్లలో ఇవే నేర్పించారా? పెద్దా, చిన్నా అనే గౌరవం నేర్పించలేదా?’’ అంటూ వేలు చూపిస్తూ అనసూయ వార్నింగ్ ఇచ్చింది.
Also Read- Tribanadhari Barbarik: ‘త్రిబాణధారి బార్బరిక్’ నుంచి ఉదయ భాను ఊర మాస్ సాంగ్
అంతే, ఒక్కసారిగా అంతా ఆశ్చర్యపోయారు. వెంటనే మరో సైడ్‌కి వెళ్లిపోయిన అనసూయ మళ్లీ నార్మల్‌గానే నవ్వుతూ మాట్లాడారు. అయితే అసలు అక్కడు ఆకతాయిలు అనసూయను ఏమన్నారనేది? మాత్రం తెలియరాలేదు. వీడియో చూస్తుంటే మాత్రం.. ఏదో అనకూడని మాటే వాళ్లు అన్నట్లుగా అయితే అర్థమవుతోంది. అందుకే అనసూయ.. పబ్లిక్ అని కూడా చూడకుండా, మళ్లీ జన్మలో వేరే ఆడవాళ్లని కామెంట్ చేయడానికి భయపడేలా వార్నింగ్ ఇచ్చింది. ఇక ఈ వీడియోకు కొందరు నెటిజన్లు అనసూయకు సపోర్ట్‌గా నిలుస్తుంటే.. మరికొందరు మాత్రం సిల్లీ కామెంట్స్ చేస్తూ.. వారి బుద్ధిని ప్రదర్శిస్తున్నారు. ఏదిఏమైనా, శనివారం సోషల్ మీడియాలో అనసూయ వీడియోనే హాట్ టాపిక్ అయిందంటే.. అనసూయ వార్నింగ్ పవర్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
చెప్పుతో కొడతానంటూ యువకులకు వార్నింగ్ ఇచ్చిన యాంకర్ అనసూయ
ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అసభ్యకర కామెంట్స్ చేశారని యువకులకు వార్నింగ్ ఇచ్చిన అనసూయ#anasuyabharadwaj #AnchorAnasuya pic.twitter.com/fVf8Xp4nbd
— BIG TV Breaking News (@bigtvtelugu) August 2, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు