Vijay Deverakonda Interview
ఎంటర్‌టైన్మెంట్

Vijay Deverakonda: ‘కింగ్‌డమ్’ చూసి సుకుమార్ ఫోన్ చేశారు.. అప్పుడు సంతోషించా!

Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘కింగ్‌డమ్’ (Kingdom) చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న విషయం తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్ ఇతర ప్రధాన పాత్రలలో నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు వస్తున్న విశేష స్పందన నేపథ్యంలో.. తాజాగా హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) మీడియాతో తన ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

‘‘కింగ్‌డమ్ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కేవలం తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా.. ఇతర రాష్ట్రాలలో, ఓవర్సీస్‌లో కూడా చాలా బాగా ఈ సినిమాను ఆదరిస్తున్నారు. ముఖ్యంగా మలయాళంలో ఇలాంటి స్పందనను అసలు ఊహించలేదు. మలయాళ వెర్షన్ విడుదల చేయకపోయినా, అక్కడి ప్రేక్షకులు ఇంతటి ప్రేమను చూపించడం చాలా ఆనందంగా ఉంది. కెరీర్ మొదట్లో సినిమా హిట్ అయితే సెలబ్రేట్ చేసుకోవాలని ఉండదు. ఎందుకంటే ఒక సినిమా హిట్ అయితే.. ఇంకో సినిమా చేసే అవకాశం వస్తుందనే ఆశ ఉంటుంది. ‘పెళ్లి చూపులు’ హిట్ అయినప్పుడు నేను సెలబ్రేట్ చేసుకోలేదు.. ఇంకొన్ని అవకాశాలు వస్తాయని ఆనందపడ్డాను. కానీ, ఇప్పుడు పరిస్థితి వేరు. సినిమా హిట్ అయితే ఆనందం కంటే కూడా.. మరిన్ని మంచి సినిమాలు చేయాలనే బాధ్యత ఎక్కువగా ఉంటుంది. అలా ఫ్యాన్స్ మార్చేశారు. ప్రతి ఒక్కరికీ సినిమా విడుదలకు ముందు ఒత్తిడి ఉంటుంది. ‘కింగ్‌డమ్’ సినిమా విడుదలకు ముందు నాకు కూడా అలాంటి ఒత్తిడే ఉంది. ఎప్పుడైతే మొదటి షో పడి, పాజిటివ్ టాక్ వచ్చిందో.. అప్పుడు సంతోషించాను.

Also Read- Kangana Ranaut: విదేశీయుడ్ని చూసి నేర్చుకోండి.. చాలా సిగ్గుచేటు.. నటి కంగనా!

గౌతమ్ తిన్ననూరి (Gautham Tinnanuri) కుటుంబ బంధాలను, ఎమోషన్స్‌ని డీల్ చేసే విధానం నాకు చాలా ఇష్టం. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామా అని గౌతమ్ కథ చెప్పినప్పుడు నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ‘జెర్సీ’ వంటి ఎమోషనల్ జర్నీలో కూడా మనకు హై ఇచ్చే మూమెంట్స్ ఇచ్చాడు. గౌతమ్‌కి ప్రతి విషయంపై మంచి పట్టుంది. హీరో పాత్ర, షాట్ కంపోజిషన్, మ్యూజిక్ ఇలా ప్రతీ క్రాఫ్ట్‌పై శ్రద్ధ తీసుకుంటాడు. ఈ సినిమా కోసం కూడా ఆసక్తికర కథనం రాశాడు. ఇందులో ఏదో యాక్షన్ సన్నివేశం రావాలన్నట్లుగా ఎక్కడా ఉండదు. ఒక బలమైన ఎమోషన్ ఉండేలా ప్రతి సన్నివేశం రాసుకున్నాడు. ఈ కథలో చాలా లేయర్స్ ఉన్నాయ్. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ప్రధానంగా కథ సాగినప్పటికీ, ఇందులో దేశభక్తికి సంబంధించిన అంశముంది. ఇంకా ఒక తెగకు చెందిన నాయకుడి గురించి ఉంటుంది. ఇలా ఇన్ని అంశాలను ఒకే పార్ట్‌లో చెప్పడం సాధ్యంకాదు. అందుకే రెండు పార్ట్‌లుగా చెప్పాలని నిర్ణయించుకున్నాం. మొదటి పార్ట్‌తో పోలిస్తే రెండవ పార్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది.

Also Read- Pawan Kalyan: విజేతలకు పవన్ కళ్యాణ్ అభినందనలు వచ్చేశాయ్..

గౌతమ్ ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఓటింగ్ వేసే సన్నివేశాల గురించి చెప్పాడు కానీ, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది చెప్పలేదు. ఆ తర్వాత ఇలా గన్‌లు, కత్తుల వంటి ఆయుధాలతో ఓటింగ్ ఉంటుందని చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఆ కొత్తదనమే ప్రేక్షకుల మెప్పు పొందడానికి కారణమైంది అనిపిస్తుంది. ఈ కథ విన్న తర్వాత అసలు ఆ కాలంలో ఎలా మాట్లాడేవారు, ఎలాంటి దుస్తులు ధరించేవారు? అనే విషయాలు తెలుసుకోవడం మొదలుపెట్టాను. రిఫరెన్స్ కోసం పలు వెబ్ సిరీస్‌లు కూడా చూశా. ఒక నటుడిగా ఎప్పుడూ ఫిట్‌గా ఉండటానికే ప్రయత్నిస్తుంటాను. అయితే ఇందులో అన్నయ్యని తిరిగి తీసుకురావడం కోసం ఆ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టే సమయంలో ధృడంగా కనిపించాలనే ఉద్దేశంతో సుమారు ఆరు నెలలు ప్రత్యేక కసరత్తులు చేశాను. ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమాపై కురిపిస్తున్న ప్రేమే నా దృష్టిలో బెస్ట్ కాంప్లిమెంట్‌గా భావిస్తున్నాను. చాలా రోజుల తర్వాత అభిమానుల కళ్ళల్లో ఆనందం చూశాను. మొదటి ఆట పడగానే చాలా మంది ఫోన్లు చేసి ‘మనం హిట్ కొట్టినం’ అని చెప్తుంటే.. మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగింది. సినిమా చూసి డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ఫోన్ చేశారు. సినిమా తనకు ఎంతో నచ్చిందని చెప్పారు. నాకు ఆయనంటే ఎంతో ఇష్టం. ఆయన నుంచి ప్రశంస రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. భవిష్యత్‌లో మా ఇద్దరి కలయికలో సినిమా వస్తుందని ఆశిస్తున్నాను.

నేను ఏ సినిమా చేసినా ప్రేక్షకులకు ఓ మంచి సినిమా ఇవ్వాలనే లక్ష్యంతోనే చేస్తాను. నా తర్వాత సినిమా రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో చేస్తున్నాను. నా సినీ జీవితంలో ఫస్ట్ టైమ్ రాయలసీమ నేపథ్యంలో సినిమా చేస్తున్నాను. సీమ యాస అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాతో పాటు రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాను. ఆంధ్రా నేపథ్యంలో ఉండే సరికొత్త కథ అది. రాహుల్, రవి ఇద్దరూ ఎంతో ప్రతిభగల డైరెక్టర్స్. ఇద్దరూ అద్భుతమైన కథలను సిద్ధం చేశారు. త్వరలోనే వాటి అప్డేట్స్ వస్తాయి..’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్