Kangana Ranaut: దేశంలో పరిశుభ్రత అంశం ఎప్పుడు చర్చకు వస్తూనే ఉంటుంది. కొందరు చేసే అనాలోచిత చర్యల కారణంగా రోడ్లు, పర్యాటక ప్రాంతాలు.. చెత్త డబ్బాలుగా మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే భారత పర్యటనకు వచ్చిన ఓ విదేశీయుడు.. అహ్లాదకరమైన ప్రాంతంలో చెత్త పడి ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. స్వయంగా ఆ చెత్తను తీసి.. డస్ట్ బిన్ లో పడేస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. దీనిపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కంగనా ఏమన్నారంటే?
హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోని ఓ జలపాతం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పర్యాటకుడు చెత్తను ఏరుతున్న వీడియోను ప్రముఖ నటి కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేశారు. ‘సిగ్గుచేటు’ అంటూ పరోక్షంగా అక్కడి వారిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. కాగా కంగనా ప్రస్తుతం మాండీ నుంచి ఎంపీగా ఉన్నారు.
విదేశీయుడి స్పందన
చెత్త ఏరుతున్న క్రమంలో ఓ వ్యక్తి వీడియో తీస్తుండగా అతడితో విదేశీ పర్యటకుడు మాట్లాడాడు. ‘ఒకవేళ నాకు ఖాళీ రోజు దొరికితే ఇక్కడే కూర్చుండిపోతాను. వాటిని (చెత్త) తీసేయాలని ప్రజలకు చెబుతాను. అలా చెప్పడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు’ అంటూ విదేశీయుడు చెత్తను డస్ట్ బిన్ లో పడేశాడు.
నెటిజన్ల రియాక్షన్
విదేశీయుడి వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో పర్యాటక ప్రాంతాన్ని అపరిశుభ్రంగా మార్చిన వారిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘మన ఆలోచన ధోరణిలో మార్పు అవసరం. ఎక్కడపడితే అక్కడ చెత్తవేయడం తప్పు అని పిల్లలకు నేర్పించండి’ అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. ‘భారతీయులను ఎందుకు విమర్శిస్తారో ఒక కారణం ఉంది. అది కేవలం రేసిజం వల్ల కాదు. మన దారుణమైన ప్రవర్తన, ఆలోచన దృక్పథం వల్ల కూడా’ అని మరో నెటిజన్ రాసుకొచ్చారు. ‘ప్రాథమిక పరిశుభ్రత నియమం పాటించమని కూడా ఎవరైనా గుర్తు చేయాల్సిన పరిస్థితి నమ్మలేకపోతున్నాను’ అంటూ ఇంకొకరు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
Shameful a foreign tourist is more concerned about nature’s beauty while local tourists keep shamelessly littering such stunning places. No govt or administration is to be blamed — it’s the people who need to change if we ever want a clean country. Video from Kangra, Himachal. pic.twitter.com/AbZfcG28G8
— Nikhil saini (@iNikhilsaini) July 24, 2025
Also Read: Fat Burn Tips: కష్టపడకుండానే బరువు తగ్గాలా? ఈ పవర్ ఫుల్ డ్రింక్స్ తాగేయండి!
కంగనా సినిమాల గురించి..
కంగనా సినిమాల విషయానికి వస్తే ఆమె చివరిసారిగా ‘ఎమర్జెన్సీ’ (Emergency) చిత్రంలో నటించారు. అందులో మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ (Indira Gandhi) పాత్రలో కనిపించారు. ఈ ఏడాది జనవరి 17న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఇదిలా ఉంటే కంగనా తొలిసారి హాలీవుడ్ లో అడుగుబెట్టబోతున్నారు. ‘బ్లెస్డ్ బి ది ఇవిల్’ (Blessed be the Evil) అనే హారర్ మూవీలో ఆమె.. టైలర్ పోసే, స్కార్లెట్ రోజ్ స్టాలోన్‌లతో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణం ఈ వేసవిలో న్యూయార్క్‌లో ప్రారంభమైంది. అనురాగ్ రుద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.