Fat Burn Tips: ప్రస్తుత రోజుల్లో కొందరు బరువు తగ్గేందుకు ఫ్యాట్ లాస్ ఇంజెక్షన్లు (ఉదా: Ozempic) చేయించుకుంటున్నారు. దీని వల్ల ప్రయోజనాలు పక్కన పడితే కొన్నిసార్లు అనారోగ్య సమస్యలు వస్తున్న నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పోషకాహార నిపుణురాలు సాక్షి లాల్వాని (Nutritionist Sakshi Lalwani) జూన్ 6న తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా కీలక సూచనలే చేశారు. శరీరంలో కొవ్వును కరిగించి.. వేగంగా బరువు తగ్గించే మూడు శక్తివంతమైన డ్రింక్స్ గురించి అందులో పంచుకున్నారు. ఈ డ్రింక్స్ ఫ్యాట్ బర్న్ వేగాన్ని పెంచడమే కాకుండా మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుందని ఆమె చెప్పారు. ఇంతకీ డాక్టర్ సూచించిన మూడు డ్రింక్స్ ఏంటి? వాటిని ఎలా తయారు చేయాలి? అవి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటీ? అప్పుడు పరిశీలిద్దాం.
1. మునగ – పుదీనా డీటాక్స్ వాటర్ (Moringa and mint detox water)
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో 1 టీస్పూన్ మునగ పొడి, కొన్ని మెత్తగా నలిపిన పుదీనా ఆకులు వేసి 5 నిమిషాలు నానపెట్టి తాగాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. కార్టిసోల్ (బెల్లీ ఫ్యాట్ హార్మోన్) తగ్గిస్తుంది. లివర్ డీటాక్స్‌కు సహాయపడుతుంది. (దీని వల్ల హార్డ్ ఫ్యాట్ కరిగించబడుతుంది). మధ్యాహ్నం లేదా భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగవచ్చు. ఈ డ్రింక్ బరువు తగ్గించడంతోపాటు ఐరన్ స్థాయిలను, శక్తిని సైతం పెంచుతుంది
2. బ్లాక్ జీలకర్ర నీరు (Black jeera water)
అర టీ స్పూన్ కళా జీరా (బ్లాక్ క్యూమిన్)ను ఒకటిన్నర కప్పుల నీటిలో 5 నిమిషాలు మరిగించాలి. అనంతరం వడకట్టి వేడిగా ఆ నీటిని తాగేయాలి. ఇలా చేయడం వల్ల.. శరీరంలో థర్మోజెనెసిస్ పెరుగుతుంది. ఫలితంగా శరీరంలో వేడి ఉత్పత్తి పెరిగి ఫ్యాట్ బర్న్ అవుతుంది. ఈ డ్రింక్ బ్రౌన్ ఫ్యాట్ యాక్టివేట్ చేస్తుంది (ఇది స్టోర్డ్ వైట్ ఫ్యాట్ కరిగించడంలో సహాయం చేస్తుంది). థైరాయిడ్ ఫంక్షన్ ను మెరుగుపరుస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఈ డ్రింక్ తీసుకుంటే ఫలితం ఉంటుంది. దీనివల్ల మెటబాలిజం పెరగడంతో పాటు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
Also Read: Gold Rate Today: అమ్మబాబోయ్.. భారీగా పెరిగిన పసిడి ధరలు.. అందరి ఆశలు గల్లంతు!
3. బేల్ ఆకులు – అల్లం కషాయం (Bael leaf and ginger infusion)
4-5 బేల్ ఆకులు, ½ అంగుళం తురిమిన అల్లం, 2 కప్పుల నీటిలో మరిగించి 1 కప్పు వచ్చే వరకు ఉంచాలి. అనంతరం దానిని వడకట్టి తాగాలి. ఇది శరీరంలోని లైనింగ్ రిపేర్ చేసి ఫ్యాట్ డైజెషన్ సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుంది. అలాగే శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను నియంత్రిస్తుంది. PCOS లేదా IBS సమస్యలతో బాధపడేవారికి ఈ డ్రింక్ ఎంతో ప్రయోజనకరం. మధ్యాహ్నం భోజనం తర్వాత లేదా సాయంత్రం వేళ ఈ డ్రింక్ ను తాగాల్సి ఉంటుంది. ఇది జీర్ణ క్రియను మెరుగుపరచడంతో పాటు లివర్ ఫంక్షనింగ్ ను సైతం బలోపేతం చేస్తుంది.
Also Read This: Jasprit Bumrah: టీమిండియాకు బిగ్ షాక్.. ఆసియా కప్‌కు బుమ్రా దూరం!
గమనిక: ఈ సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.