Gold Rate Today: అమ్మబాబోయ్.. భారీగా పెరిగిన పసిడి ధరలు!
Gold Rate Today (Image Source: twitter)
బిజినెస్

Gold Rate Today: అమ్మబాబోయ్.. భారీగా పెరిగిన పసిడి ధరలు.. అందరి ఆశలు గల్లంతు!

Gold Rate Today: దేశంలో బంగారానికి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే ముందుగా పసిడే అందరికీ గుర్తుకు వస్తుంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో పసిడి ఒక తిరుగులేని వస్తువుగా స్థానం సంపాదించింది. పసిడిని ధరించడం ద్వారా సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తుందని చాలా మంది నమ్మకం. పెట్టుబడి మార్గానికి సైతం బెస్ట్ ఛాయిస్ కావడంతో పసిడికి డిమాండ్ ఎప్పటికీ ఉంటూనే వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా పసిడి ధరలు మరోమారు భారీగా పెరిగాయి. ఆ వివరాలంటే ఇప్పుడు చూద్దాం.

ఎంత పెరిగిందంటే?
దేశంలో పసిడి ధరలు శనివారం (2 ఆగస్టు, 2025) భారీగా పెరిగాయి. శుక్రవారంతో పోలిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పై రూ.1,400 పెరిగిపోయింది. అటు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి.. రూ.1,530 పెరిగింది. ఫలితంగా ప్రస్తుతం దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్.. రూ. 92,900 కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ను రూ. 1,01,350 విక్రయిస్తున్నారు. అయితే వెండి ధరల్లో ఎలాంటి వ్యత్యాసం చోటుచేసుకోలేదు. దేశంలో కిలో వెండి రూ.1,23,000 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు)

❄️ హైదరాబాద్: రూ.1,01,350

❄️ విజయవాడ: రూ.1,01,350

❄️ విశాఖపట్టణం: రూ.1,01,350

❄️ వరంగల్: రూ.1,01,350

22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు)

❄️ హైదరాబాద్: రూ.92,900

❄️ విజయవాడ: రూ.92,900

❄️ విశాఖపట్టణం: రూ.92,900

❄️ వరంగల్: రూ.92,900

Also Read: Shah Rukh Khan: ఉత్తమ నటుడిగా తొలి నేషనల్ అవార్డ్.. షారుక్ ఫస్ట్ రియాక్షన్ ఇదే!

వెండి (1 కిలో)

❄️ హైదరాబాద్: రూ.1,23,000

❄️ విజయవాడ: రూ.1,23,000

❄️ విశాఖపట్టణం: రూ.1,23,000

❄️ వరంగల్: రూ.1,23,000

Also Read This: Donald Trump: రష్యాతో చమురు దోస్తీ కట్.. మోదీ చెప్పకముందే ట్రంప్ ప్రకటన!

Just In

01

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం

Revanth Reddy – Messi: మెస్సీతో ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్