Fish Venkat: ప్రముఖ తెలుగు నటుడు ఫిష్ వెంకట్ ఇటీవల కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో కన్నుమూశారు. ఆయన రెండు కిడ్నీలు పాడవడంతో ఎన్నో రోజులుగా డయాలసిస్ చేయించుకుంటూ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయినప్పటికీ, ఆరోగ్యం క్షీణించి తుదిశ్వాస విడిచారు. ఈ ఆకస్మిక మరణం సెలబ్రిటీలను మాత్రమే కాకుండా అందర్ని షాక్‌కు గురిచేసింది. కిడ్నీ సమస్యను నివారించడం సాధ్యం కాదా? అనే ప్రశ్నలు జనాల మదిలో తిరుగుతున్నాయి.
కిడ్నీల సమస్యలు సైలెంట్ గా బాధిస్తాయి. అయితే, ప్రారంభంలో ఎలాంటి సంకేతాలూ కనిపించవు, అందుకే వీటిని ‘సైలెంట్ కిల్లర్స్’ అంటారు. ఫిష్ వెంకట్ మరణం తర్వాత, “మాకూ ఇలాంటి సమస్య వస్తుందేమో” అనే భయం మొదలైంది. ఫిష్ వెంకట్ సన్నిహితుడు ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఫిష్ వెంకట్ అతిగా మద్యం సేవించడం వల్లే ఈ సమస్య వచ్చిందని చెప్పడంతో, మద్యం తాగే వారిలో ఒక రకమైన టెన్షన్ పెరిగింది. అయితే, కిడ్నీ సమస్యల నుంచి తప్పించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read: R.Madhavan: సల్మాన్, మాధవన్ ని రిజెక్ట్ చేసి.. ఆ బిలీనియర్ ని పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్?
ఆహారం
ఈ రోజుల్లో ఫుడ్ కుక్ చేసుకోవడానికి కూడా టైం లేక ఎంతో మంది బయట ఫుడ్స్ తింటున్నారు. కానీ, ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. పండ్లు, కూరగాయలు, కొవ్వు పదార్థాలను తగ్గించి, ధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలి. పరిశుభ్రత లేకపోతే ఇన్ఫెక్షన్లు కిడ్నీలను దెబ్బతీస్తాయి, కాబట్టి శుభ్రత పాటించడం చాలా ముఖ్యం.
వ్యాయామం
రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఇది కిడ్నీలపై ఒత్తిడిని తగ్గిస్తుంది.
Also Read: Meenakshi Seshadri: స్లీవ్‌లెస్ గౌనులో.. ‘ఆపద్భాంధవుడు’ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా?
మద్యం
మద్యం కిడ్నీలను పూర్తిగా దెబ్బ తినేలా చేస్తుంది. కాబట్టి, దీనికి పూర్తిగా దూరంగా ఉండటమే మంచిది.
నీరు
రోజూ తగినంత నీరు తీసుకోవడం వలన కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే, శరీరంలోని వ్యర్థాలు కూడా బయటకు పోతాయి.
Also Read: Chetebadi: అమావాస్య రోజు మట్టిలో బతికున్న నల్లకోడిని పెట్టి.. రియల్ ఇన్సిడెంట్స్‌తో ‘చేతబడి’!
మందులతో జాగ్రత్త
డాక్టర్ ను సంప్రదించకుండా నొప్పి నివారణ లేదా ఇతర మందులు వాడితే కిడ్నీలు దెబ్బతింటాయి. మెడికల్ షాపులో సొంత తెలివితో మందులు కొని వాడటం చాలా ప్రమాదకరం.
రెగ్యులర్ చెకప్‌లు
మధుమేహం, రక్తపోటు ఉన్నవారు హాస్పిటల్ కి వెళ్ళి కిడ్నీ పనితీరును ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలతో కిడ్నీ వ్యాధుల నుంచి బయటపడొచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.