Devara Movie | దేవర ఫియర్‌ సాంగ్, ఫ్యాన్స్‌కి పూనకాలే..!
Junior NTR Devara Movie Fear Song, Poonakale For Fans
Cinema

Devara Movie: దేవర ఫియర్‌ సాంగ్, ఫ్యాన్స్‌కి పూనకాలే..!

Junior NTR Devara Movie Fear Song, Poonakale For Fans: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా సంచలన దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న మూవీ దేవర. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంతం నేపథ్యంలో సాగే స్టోరీతో రూపొందుతోన్న మూవీ ఇది. అక్కడ ఉండే భయం తెలియని మృగాళ్లకు భయాన్ని పరిచయం చేసే శక్తిమంతమైన రోల్‌లో తారక్‌ సందడి చేయనున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ ఈ మూవీపై ఆసక్తి రేకెత్తిస్తూ, అంచనాలను పెంచుతోంది.

సోమవారం తారక్‌ పుట్టినరోజు సందర్భంగా మూవీ యూనిట్ ఫ్యాన్స్‌కు ట్రీట్‌ ఇచ్చారు. ఈ మూవీ నుంచి ఫియర్‌ సాంగ్‌ను ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగా ఆదివారం సాయంత్రం రిలీజ్‌ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట హల్‌చల్‌ అవుతోంది. ఆ గట్టునుంది సంద్రం, భగ్గున మండే ఆకశం అంటూ సాగే ఈ ఫియర్‌ సాంగ్‌ కూడా విపరీతంగా వైరల్‌ అవుతూ ఇంటర్‌నెట్‌ను షేక్‌ చేస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఈ మూవీలో జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

Also Read: నాపై విషప్రచారం జరుగుతోందని నటి ఆవేదన

ఇక ఈ మూవీని రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు మూవీ యూనిట్‌. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్‌, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. మొదటి పార్ట్‌ను అక్టోబర్‌ 14న రిలీజ్‌ చేయనున్నారు. ఈ మూవీకి అనిరుధ్‌ బాణీలు అందిస్తున్నారు. ఇక ఈ మూవీ రిలీజ్‌కి 4 నెలలే ఉండటంతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి పూనకాలనే చెప్పాలి. ఏదేమైనా ఎన్టీఆర్ మూవీ అంటే మినిమం ఉంటుందని ఎన్టీఆర్‌ ప్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

 

Just In

01

Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!