The Actress Hema Feels That She Is Being Poisoned
Cinema

Actress Hema: నాపై విషప్రచారం జరుగుతోందని నటి ఆవేదన

The Actress Hema Feels That She Is Being Poisoned: బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్‌ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని టాలీవుడ్‌ సినీ నటి హేమ క్లారిటీ ఇచ్చారు. ఆదివారం అర్థరాత్రి బెంగుళూరు శివారులో ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్‌ హౌస్‌లో నిర్వహించిన రేవ్‌ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు పోలీసులకు పట్టుబడ్డారు.దాదాపు 100 మందికి పైగా పార్టీకి హాజరయ్యారు. పార్టీలో పలురకాల డ్రగ్స్‌ వాడినట్లు పోలీసులు గుర్తించారు.

అయితే ఆ పార్టీలో నటి హేమ కూడా ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో … ఈ విషయంపై ఆమె ప్రత్యేక వీడియోని విడుదల చేసింది. నేను ఎక్కడకు వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే ఉన్నాను. ఇక్కడ ఫామ్‌హౌస్‌లో ఎంజాయ్‌ చేస్తున్నాను. నాపై వస్తోన్న అసత్య ప్రచారాలను అస్సలు నమ్మకండి. అవి ఫేక్‌ న్యూస్‌. అక్కడ ఎవరు ఉన్నారో నాకు తెలియదు. దయచేసి మీడియాలో నాపై వచ్చే కన్నడ మీడియా, సోషల్‌ మీడియా వార్తలను అస్సలు నమ్మకండని నటి హేమ విజ్ఞప్తి చేశారు.