Teachers Unions (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Teachers Unions: అర్హత లేని డీఈఓ లను తొలగించాలని ఉపాద్యాయులు డిమాండ్

Teachers Unions: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరిగే మూడు దశల పోరాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యూఎస్బీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు నన్నెబోయిన తిరుపతి(Thirupathi), పిలుపునిచ్చారు. హనుమకొండ(Hanumakonda) స్థానిక సుబేదారి ఉన్నత పాఠశాలలో జరిగిన యూఎస్పిసి(USPC) హనుమకొండ మరియు వరంగల్(Warangal) జిల్లాల స్టీరింగ్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (USPC) ఆధ్వర్యంలో నిర్వహించే దశలవారి ఉద్యమంలో భాగంగా ఆగస్టు 1న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తామని, ఆగస్టు 23న హైదరాబాద్ లో‌ రాష్ట్రస్థాయి మహాధర్నా నిర్వహిస్తామన్నారు.

నూతన మండలాలకు యంఈఓ
ఉపాధ్యాయుల ప్రమోషన్లు బదిలీల షెడ్యూల్‌ను తక్షణమే విడుదల చేసి, ఈనెలాఖరులోగా ప్రక్రియను పూర్తి చేయాలని, అర్హత లేని డీఈఓ లను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఏ శ్రీనివాస్(Srinivas) రెడ్డి మాట్లాడుతూ నూతన జిల్లాలకు డిఈఓ పోస్టులను, ప్రతి రెవెన్యూ డివిజన్‌కు డిప్యూటీ ఈఓ, నూతన మండలాలకు యంఈఓ పోస్టులను మంజూరు చేసి, ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్‌ను రూపొందించి, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు.

Also Read: CM Revanth Reddy: సీఎం సంతకం తర్వాత.. అన్ని కేటగిరీల వారికి పదోన్నతులు

యుటిఎఫ్(UTF) రాష్ట్ర బాధ్యులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల పెన్షనర్ల, వివిధ రకాల బిల్లులను వెంటనే విడుదల చేయాలని, ప్రాథమిక పాఠశాలలకు 5571 పియస్‌ హెచ్‌యం పోస్టులను మంజూరు చేయాలని, పండిట్, పిఈటిల అప్ గ్రేడేషన్ ప్రక్రియ పూర్తి అయినందున జిఒ 2,3,9,10 లను రద్దు చేసి జిఒ 11,12 ల ప్రకారం పదోన్నతులు కల్పించాలని, ఉపాధ్యాయుల సర్దుబాటు మార్గదర్శకాలను సవరించాలని కోరారు. టిపిటిఎఫ్ పూర్వ కార్యదర్శి కే. భోగేశ్వర్ మాట్లాడుతూ వివిధ జిల్లాల్లో జరిగిన పైరవీ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని, గురుకుల టైం టేబుల్ సవరించాలని, కెజిబివి, మోడల్‌ స్కూల్స్‌ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని అన్నారు.

పర్యవేక్షణ అధికారులుగా
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కాలపు జీతాన్ని వెంటనే చెల్లించాలని, కే జి బి వి(KGBV), యూఆర్ఎస్(URS), సమగ్ర శిక్ష, కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయాలని, మోడల్ స్కూల్, గురుకుల సిబ్బందికి 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని, గిరిజన సంక్షేమ, ఆశ్రమ పాఠశాలలోని పండిట్, పిఇటి పోస్టులను అప్ గ్రేడ్ చేసి వెంటనే పదోన్నతులు ఇవ్వాలని, ఉపాధ్యాయులను పర్యవేక్షణ అధికారులుగా నియమించాలనే ఉత్తర్వులను ఉపసంహారించాలని, విద్యారంగంలో ఎన్ జి ఓ జోక్యాన్ని నివరించాలని, అన్ని జిల్లాలకు శానిటేషన్ గ్రాంట్స్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో నాయకులు ఏ శ్రీనివాసరెడ్డి, కడారి భోగేశ్వర్, పెండం రాజు, సుజన్ ప్రసాదరావు, కట్కూరి శ్రీనివాస్ ఊటుకూరి అశోక్, జి. ఉప్పలయ్య, ఆకుల గోవిందరావు, గోడిశాల సత్యనారాయణ, వెంకటేశ్వర్లు రాజయ్య, డి మహేందర్ రెడ్డి, గోవర్ధన్, జగన్మోహన్, మహేందర్ రావు, ఏ మల్లయ్య, బి. మహేందర్ రావు పాల్గొన్నారు.

Also Read: Maoist banners: చర్ల మండలంలో మావోయిస్టుల బ్యానర్లు కలకలం

Just In

01

Bigg Boss Telugu 9: మొదటి వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీరే..

Telangana: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కొత్త జోష్.. ఎందుకంటే?

Hyderabad Collector: చాకలి ఐలమ్మ వర్శిటీ పనులపై.. కలెక్టర్ హరిచందన కీలక ఆదేశం

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేది అప్పుడేనా?

Summit of Fire: ఖతార్‌లో ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు.. మరో కొత్త ఆపరేషన్