Hyd Collector: యూపీ బాలుడికి కలెక్టర్ హరిచందన రెస్పాన్స్
Hyd Collector (imagecredit:swetcha)
హైదరాబాద్

Hyd Collector: యూపీ బాలుడి అభ్యర్థనకు కలెక్టర్ హరిచందన రెస్పాన్స్

Hyd Collector: మేడం నన్ను మా ఇంటికి పంపించిండి అంటూ జువైనల్ హొమ్ లో ఉంటున్న ఉత్తర్ ప్రదేశ్(UP) కు చెందిన ఓ బాలుడు జిల్లా కలెక్టర్ హరిచందన దాసరిని కోరారు. తక్షణమే స్పందించిన ఆమె బాలుడ్ని తన ఇంటికి పంపేలా వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటన శుక్రవారం కలెక్టర్ మలక్ పేటలోని జువైనల్ హోమ్ను సందర్శించినపుడు చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కలెక్టర్ పిల్లల సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆపరేషన్ ముస్కాన్‌(Operation Muskan)లో భాగంగా తప్పి పోయిన పిల్లలు, వీధి బాలలు, అనాధలు, బాలకార్మికులు ఎక్కువగా తరలించడం జరుగుతుందని, అంతేగాక, ఇతర జిల్లాల నుండి పిల్లలను కూడా ఈ హోమ్ కు తీసుకువస్తుంటారని ఆమె పేర్కొన్నారు.

వైద్య నిపుణులతో అవగాహన
ఈ హోమ్ లో పిల్లల సంఖ్య, అందుతున్న సదుపాయాలు, విద్యాబోధన, మెడికల్(Medical) సేవలు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో అడిగి తెలుసుకున్నారు. వారిలో పరివర్తన మార్పుకై మానసిక వైద్య నిపుణులతో అవగాహన కల్పించాలని సూచించారు. ఇక్కడి పిల్లలు వివిధ తరగతుల్లో చక్కగా చదువుతున్నందున మెరుగైన విద్య బోధన అందేలా చూడాలని, ఇంటర్ చదువుతున్న పిల్లలను ఈ సందర్భంగా అభినందించారు. పిల్లల్లో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కాకుండా వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. పిల్లలకు అందుతున్న విద్యా బోధనతో పాటు, వారు బస చేసే గదులు, వంటగది, డైనింగ్ హాల్, పరిసర ప్రాంతాలను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.

Also Read: Nagarkurnool district: నాగర్‌కర్నూల్ జిల్లాలో నయా మోసం.. అధికారులపై వేటు!

మెనూలో భాగంగా
ఉత్తరప్రదేశ్‌(UP)కు చెందిన ఒక అనాధ బాలుడు తన స్వగ్రామానికి పంపాలని తెలుపగా కలెక్టర్ సత్వరమే స్పందించి సీడబ్ల్యూసీ(CWC) చర్యలతో పాటు నివేదిక అందించి తదుపరి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మెనూలో భాగంగా నాణ్యమైన ఆహారం అందించాలని, వంటగదిలో సిద్దం చేసిన వంటకాలను రుచి చూసిన కలెక్టర్ ఆ తర్వాత విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఆ తర్వాత ఆమె అబ్జర్వేషన్ హోమ్‌ను సందర్శించి నేరారోపణ నిందితులకు కల్పిస్తున్న సదుపాయాలను పరిశీలించారు. ఇటీవల హోమ్ నుంచి పారిపోయిన సంఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకుని, చేపట్టిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా భద్రతను బలోపేతం చేయాలని ఆమె ఆదేశించారు. ఈ తనిఖీలో డిప్యూటీ డైరెక్టర్ చార్వాక్, ఏడి రాజేందర్, సూపరింటెండెంట్ అఫ్జల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Also Read: CM Revanth Reddy: కేసీఆర్ చేసిన అభివృద్ధికి గజ్వేల్ అస్తవ్యస్తం: నర్సారెడ్డి

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..