CM Revanth Reddy (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

CM Revanth Reddy: కేసీఆర్ చేసిన అభివృద్ధికి గజ్వేల్ అస్తవ్యస్తం: నర్సారెడ్డి

CM Revanth Reddy: గజ్వేల్ అభివృద్ధి చేశామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) చెప్పుకోవడంలో అర్థం లేదని స్థానికంగా అనేక సమస్యలు పట్టణ ప్రజలను వెంటాడుతున్నాయని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి(Narsa Reddy) ఆరోపించారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో సీసీ రోడ్ల పనులకు ప్రారంభోత్సవం చేస్తూ మాట్లాడారు. గజ్వేల్(Gajwel) పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అసంపూర్తిగా మిగిలిందని, సీసీ రోడ్లు వేయవలసి ఉందని ఇంకా పలు సమస్యలు పరిష్కారం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దృష్టికి తీసుకువెళ్లి నిధుల మంజూరు చేయిస్తామని పేర్కొన్నారు.

పర్యటన ఉంటుందని స్పష్టం
స్థానిక సంస్థల లోపు ముఖ్యమంత్రి గజ్వేల్ పర్యటన ఉంటుందని స్పష్టం చేశారు. స్థానిక పట్టణ సమస్యలతో పాటు ఆర్ అండ్ ఆర్ కాలనీ, ఇతర గ్రామాల సమస్యల గురించి ముఖ్యమంత్రి(CM) దృష్టికి తీసుకువెళ్తామని గజ్వేల్ అభివృద్ధికి సీఎం సహాయం కోరుతామని పేర్కొన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పరిధిలో నిర్మి స్తున్న రెండు బస్టాండ్లను త్వరలో ప్రారంభిస్తామని పనులు పూర్తికావస్తున్నాయని తెలిపారు. గజ్వేల్ అభివృద్ధి కోసం కాంగ్రెస్(Congrees) పార్టీ పూర్తిగా కంకణబద్ధంగా పనిచేస్తుందని స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.

Also Read: Tiger Attack: పొలానికి వెళ్లిన యువకుడిపై పెద్దపులి దాడి.. ఆపై!

త్వరలో జరగనున్న ఎన్నికలు
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకుల సమావేశం ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో నిర్వహించగా త్వరలో జరగనున్న ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని నర్సారెడ్డి సూచించారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అందరు ఐక్యంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమాల్లో ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి(Narender Reddy), వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, పట్టణ పార్టీ అధ్యక్షులు మొనగారి రాజు, ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్, సారిక శ్రీనివాస్ రెడ్డి(Srinivass Reddy) తదితరులు పాల్గొన్నారు.

Also Read: Minister Ponnam Prabhakar: నియోజకవర్గాల వారీగా కొత్త రేషన్ కార్డుల జారీ

 

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు