Toddy: సేదతీర్చుకోవడానికి గ్రామాల్లో వ్యవసాయ కూలీలు తాగే కల్లులో మత్తు కోసం ఆలోజోలం, డైజోఫాం, క్లోరో హైడ్రెడ్ తదితర నిషేధిత మత్తు రసాయనాలు కలుపుతున్నారు. దీంతో కల్లు ప్రియులు బానిసలుగా మారి చివరకు తమ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. ఇంత జరుగుతున్న అబ్కారీ శాఖ(Excise Department) కేవలం మొక్కుబడిగా దాడులు నిర్వహించి గుట్టుగా మాముళ్లు అందుకుని చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. గ్రామాల్లో రెండు, మూడు రకాల మందు కల్లు దొరుకుతుందని కల్లు ప్రియులు ఉదయం నుంచి రాత్రివరకు బారులు తీరి కల్తీ కల్లులో మునిగి తేలుతున్నారు. ఈ కల్లు వరుసగా నాలుగైదు రోజులు తాగితే మరుసటి రోజు పక్కా సేవించాల్సిందే. లేదంటే మతిభ్రమించి వింతచేష్టలు చేస్తారు. మండల పరిధిలోగల కొన్ని గ్రామాల్లో యువతకు అనువుగా దూరంగా దుకాణాలు ఉండటంతోపాటు కల్లులో కిక్కు ఎక్కువ ఉంటుందని కల్తీ కల్లుకు బానిసలైపోయారు.
లిక్కర్ కిక్కు ఎక్కకపోవడంతో
ముఖ్యంగా యువతనే(Youth) టార్గెట్ చేసి కల్తీ కల్లుకు బానిసలుగా మార్చి కొందరు దళారులు మత్తు పదార్థాలతో తయారు చేసిన కల్తీ కల్లు విక్రయాలు జోరుగా కొనసాగిస్తున్నారు. గతంలో వ్యవసాయ కూలీలతోపాటు ఇతర పనులు చేసుకునే కూలీలు పని దిగగానే కేవలం సేదతీర్చుకునేందుకు కల్లు తాగడం ఆనవాయితీగా ఉండేది. కానీ వారిలో చాలామంది లిక్కర్ వైపు వెళ్లి పోయారు. లిక్కర్ కిక్కు ఎక్కకపోవడంతో అల్ఫోజోం, గుల్ఫారం, డైజోఫామ్, క్లోరోహైడ్రెడ్ తదితర నిషేద మత్తు రసాయనాలతోపాటు అమ్మోనియం, సోడాయాష్, కుంకుడుకాయ రసంతో తయారవుతున్న కల్తీ కల్లుకు అలవాటుపడ్డారు. ఉదయం నుంచే కల్లు దుకాణాలలో కల్లు ప్రియులతో కళకళలాడటంతో కల్తీ కల్లు(Adulterated toffee) విక్రయదారుల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. నిత్యం కాసులు కురిపించే కల్తీ దందాను వ్యాపారులు ఎందుకు వదులుకుంటారు? ఎవరికి ప్రాణనష్టం జరిగితే మాకేంటి మా కల్తీ కల్లు వ్యాపారం నడిస్తే చాలు అంటున్నారు కొందరు అక్రమవ్యాపారులు.
Also Read: Gurukul kitchens: పుడ్ పాయిజన్లపై సర్కార్ సీరియస్.. త్వరలో మార్గదర్శకాలు
శాఖ మాత్రం ఇంకా మొద్దు నిద్ర
ముఖ్యంగా పక్క గ్రామాల్లో కల్తీ కల్లు తాగి ఇంటికి చేరతున్న తరుణంలో తరుచూ ఎన్నో రోడ్డు ప్రమాదాలు(Road Accidents) తలెత్తి కొంతమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. కల్లు బానిసలు ప్రతి రోజు ఏ గ్రామంలో మత్తెక్కించే కల్లు దొరుకుతుందా అంటూ ఫోన్లలో వాట్సాప్(WhatsApp) చాటింగ్లు చేసుకుని కల్లు దుకాణాలను ఎంచుకొని గుంపులుగా వెళ్తున్నారు. సంబందిత శాఖ మాత్రం ఇంకా మొద్దు నిద్రలోనే ఉండటం వెనుక పలు అనుమానాలకు తావిస్తుంది. కేవలం ఆడపదడపా సోదాలు నిర్వహిస్తూ ప్రజలను, ప్రభుత్వాన్ని మభ్యపెట్టి దండిగా నెలసరి మాముళ్లు దండుకుంటున్నారు. ఈ అల్ఫోజోం, గుల్పారం దందా రాయుల్లు ముఠాలాగా మారి తమ పని తాము కానిస్తున్నారు. ఇకనైనా ఈ కల్తీ కల్లు వ్యాపారాలను, మత్తు పదార్థాల రవాణాకు అధికారులు అడ్డుకట్ట వేసి ప్రజల, యువత భవిష్యత్తును ఆదుకొని అక్రమార్కుల ఆటకట్టించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
నాడీ వ్యవస్థకు దెబ్బ
డైజోఫాం ఇతర రసాయనాలతో తయారు చేసిన కృత్రిమ కల్లును సేవించిన వారిలో నాడీ వ్యవస్థ(Nervous system) దెబ్బతింటుంది. నీరసం, ఒంటి నొప్పులతో పాటు కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. మానసిక విక్షణ కోల్పోయి పిచ్చగా ప్రవర్తిస్తుంటారు. ఈ సమయంలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ప్రాణాలకే ప్రమాదం. ఈ క్షతగాత్రులకు సర్జరీల సమయంలో నొప్పి నివారణ కోసం ఇచ్చే మత్తు ఇంజక్షన్లు సైతం పని చేయవు. మోతాదుకు మించిన డోసు ఇంజక్షన్లు ఇవ్వాల్సి వస్తుంది. సాధ్యమైనంత వరకు ఈ కల్లును సేవించక పోవడమే ఉత్తమం అని దౌల్తాబాద్ మెడికల్ ఆఫీసర్ నాగరాజు(Nagaraju) తెలిపారు.
Also Read: Indira Mahila Shakti: మహిళా శక్తిని గుర్తించింది కాంగ్రేస్ ప్రభుత్వమే