Indira Mahila Shakti (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Indira Mahila Shakti: మహిళా శక్తిని గుర్తించింది కాంగ్రేస్‌ ప్రభుత్వమే

Indira Mahila Shakti: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల పాటు మహిళా సంఘాలను నిర్లక్ష్యం చేసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సి.దామోదర రాజనర్సింహ(Minister Damodara Rajanarsimha) ఆరోపించారు. సంగారెడ్డి(Sanga Reddy)జిల్లా ఆందోల్‌ నియోజకవర్గంలోని సుల్తాప్‌పూర్‌ వద్ద నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాలకు రాష్ట్ర మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి ప్రసంగిస్తూ కాంగ్రేస్‌(Congress) ప్రభుత్వ హాయాంలోనే మహిళా సంఘాలు ఏర్పడ్డాయని, రాష్ట్రంలో వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి(YS Rajashekar Reddy) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మహిళలకు ఉపయోగపడే భీమా, పావలా వడ్డీ, స్త్రీ నిధి, అభయ హస్తం వంటి పథకాలను ప్రవేపెట్టి అమలు పరచారన్నారు. గత ప్రభుత్వ హయాంలో సంఘాలకు వడ్డీ పైసలు రాక ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారని ఆయన గుర్తు చేసారు.

ఈ పథకానికి రూ.6680 కోట్లు
2023 డిసెంబర్‌లో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడమే కాకుండా మొట్టమొదటగా రాష్ట్రంలో ఎక్కడికి ప్రయాణించినా ఉచితంగా ప్రయాణించేలా మహలక్ష్మి పథకాన్ని(Mahalakshmi Scheme) తీసుకువచ్చిందన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ పథకానికి రూ.6680 కోట్లు ఆర్టీసీ(RTC) చెల్లించిందన్నారు. ఇందిరా మహిళా శక్తి, స్వయం సహాయక సంఘాల మహిళలు తమ కలలను సాకారం చేసుకోవాలన్నారు. ప్రతి మండలంలో సమైఖ్య భవనాలు అందోలు నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ప్రభుత్వ స్థలంలో మహిళా సమైఖ్య భవనాలను నిర్మించి అందులో అవసరమైన ఫర్నీచర్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి హమీ ఇచ్చారు.

Also Read: Dhankhar: ధన్‌ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం.. మోదీ ఏమన్నారంటే

మహిళా శక్తిని గుర్తించడమే లక్ష్యం
మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలన్నారు. అందుకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందన్నారు. మహిళా శక్తిని గుర్తించడమే లక్ష్యంగా ఈ విజయోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు.33 జిల్లాల్లో మొట్టమొదటి పెట్రోల్‌ బంక్‌ సంగారెడ్డి(Sanga Reddy) జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగిందన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddu) ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్, డీఆర్‌డీఏ పీడీ జ్యోతి, డీపీఎం డాక్టర్‌ మల్లేశంలతో పాటు పలువురు పాల్గొన్నారు.

Also Read: Nithya Menen: అలాంటి తోడు లేకపోతేనే స్వేచ్ఛగా జీవించవచ్చు.. నిత్యామేనన్

 

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ