Fat Loss Tips: ప్రస్తుత రోజుల్లో మహిళలను బరువు సమస్య బాగా వెంటాడుతోంది. శరీరం ఎప్పటికప్పుడు కొవ్వును నిల్వ చేస్తుండటంతో వారు అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే రోజు రోజుకు పెరిగిపోతున్న కొవ్వును చాలా ఈజీగా తగ్గించే చిట్కాలను నిపుణులు సూచిస్తున్నారు. ‘మీరు ఇలా చేయడం ప్రారంభించే వరకూ మీ శరీరం.. నడుము, తుంటి చుట్టూ కొవ్వును నిల్వ చేస్తూనే ఉంటుంది’ అంటూ హెచ్చరిస్తున్నారు. ఇంతకీ డైట్ కోచ్ లు చెప్పే చిట్కాలు ఏంటీ? వాటి వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు ఎలా కరిగిపోతుంది? ఇప్పుడు చూద్దాం.
తక్కువ కేలరీలు తీసుకోండి
సాధారణంగా మనం తీసుకునే అవసరానికి మించిన కేలరీలే శరీరంలో కొవ్వుగా రూపాంతరం చెందుతాయి. కాబట్టి అధిక కేలరీలను నివారించడం ద్వారా.. కొవ్వును కంట్రోల్ లో ఉంచవచ్చు. ఇందుకోసం కేలరీలపై మానిటరింగ్ అవసరం. ఆన్ లైన్ కేలరీ కాలిక్యులేటర్ ను ఉపయోగించి మీ రోజు వారి కేలరీల అవసరాలను గుర్తించండి. ‘మై ఫిట్ నెస్ పాల్’ (MyFitnessPal) వంటి యాప్ ల ద్వారా రోజుకు ఎంత కేలరీలు తీసుకుంటున్నారో ట్రాక్ చేయండి. తద్వారా అసరానికి మించి తీసుకుంటున్న కేలరీలను నియంత్రించండి.
ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోండి
రోజుకు 1.5-2 గ్రాముల ప్రొటీన్‌ను మీ శరీర బరువు కిలోకు అనుగుణంగా తీసుకోవాలని డైట్ కోచ్ లు తెలియజేస్తున్నారు. ప్రొటీన్ అధిక మెుత్తంలో తీసుకోవడం వల్ల అది ఆకలిని తగ్గిస్తుంది. జీర్ణక్రియలో ఎక్కువ కేలరీల ఖర్చును తగ్గించి.. కండరాలను బలోపేతం చేస్తుంది. ప్రోటీన్ కోసం చికెన్, చేపలు, బీన్స్, సోయా చంక్స్ వంటివి ఎంచుకోండి.
ఫైబర్ రిచ్ ఆహారాలు
రోజుకు 25-30 గ్రాముల ఫైబర్ తీసుకోండి. ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. అదే విధంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కూరగాయలు, గోధుమలు, లెంటిల్స్, నట్స్ వంటివి ఫైబర్ కోసం ఎంచుకోవచ్చు.
ఆరోగ్యకరమైన కొవ్వులు
గింజలు, అవకాడో, ఆముదం నూనె, నెయ్యి వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను ఆహారంలో చేర్చండి. ఇవి జీవక్రియను పెంచుతాయి. అలాగే ఆకలిని నియంత్రిస్తాయి. శుద్ధి చేసిన నూనెలకు బదులుగా ఈ ఆరోగ్యకరమైన కొవ్వులను ఎంచుకోవడం మంచిది.
నీరు ఎక్కువగా తాగండి
రోజుకు 3-4 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగండి. నీరు జీవ క్రియను పెంచడంతో పాటు శరీరంలో కొవ్వును కరిగించడానికి సాయపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. భోజనానికి ముందు నీరు తాగడం వల్ల ఆకలి తగ్గుతుందని చెబుతున్నారు.
నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి
ప్రతీ ఒక్కరికీ రాత్రి 7-9 గంటల నిద్ర తప్పనిసరి. నిద్ర లేమి కార్టిసాల్ హార్మోన్ (Cortisol Hormone)ను పెంచుతుంది. ఇది కొవ్వు నిల్వకు కారణమవుతుంది. మంచి నిద్ర ఆకలిని నియంత్రించి జీవక్రియను మెరుగుపరుస్తుంది.
Also Read: Shubham Gill: గిల్ పక్కదారి పట్టాడు.. అతడో విలన్.. మాజీలు ఫైర్!
వాటిపై శ్రద్ధ పెట్టండి
హర్మోన్లు (Hormone), జీవ క్రియ ఆరోగ్యంతో (Metabolic health) ముడిపడి ఉన్న మెగ్నిషియం (Magnesium), విటమిన్ డి (vitamin D), జింక్, ఓమెగా 3ఎస్ (Omega-3s) వంటి సూక్ష్మ పోషకాలు శరీరంలో తగినంత ఉండేలా జాగ్రత్త వహించండి.
Also Read This: Rajeev Kanakala: చిక్కుల్లో నటుడు రాజీవ్ కనకాల.. పోలీసుల నోటీసులు.. మ్యాటర్ ఏంటంటే?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.