GHMC (imagecredit:swetcha)
హైదరాబాద్

GHMC: జీహెచ్ఎంసీ సరికొత్త ప్రయోగం.. విదేశీ తరహాలో ప్లాన్!

GHMC: గ్రేటర్ హైదరాబాద్ మహానగరాన్ని బహిరంగ మూత్ర విసర్జన రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ(GHMC) మరో వినూత్న ప్రయోగాన్ని చేపట్టేందుకు సిద్దమైంది. ఇటీవలే ఢిల్లీలో కేంద్ర గృహా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ ప్రధానం చేసిన స్వచ్ఛ్ సర్వేక్షణ్- 2024 లో ఓడీఆఎఫ్ ఫ్రీ సిటీ అవార్డు(ODAF Free City Award)తో పాటు మరి కొన్ని అవార్డును చేజిక్కించుకున్న జీహెచ్ఎంసీ(GHMC) సిటీలో బహిరంగ మూత్ర విసర్జన లేని నగరంగా తీర్చిదిద్దేందుకు విదేశాల విధానాన్ని అనుసరించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. మూడేళ్ల క్రితం జీహెచ్ఎంసీ నగరంలో స్వచ్ఛ టాయిలెట్లను అందుబాటులోకి తేగా, నిర్వహణ వ్యయాన్ని జీహెచ్ఎంసీయే భరించినా, ఆశించిన ఫలితం దక్కకపోవటంతో ఇపుడు బిల్డ్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ ఫర్(BOT) కింద పే అండ్ యూజ్ టాయిలెట్లను అందుబాటులోకి తీసుకురావాలని జీహెచ్ఎంసీ భావిస్తుంది.

జీహెచ్ఎంసీపై ఆర్థిక భారం పడకుండా
వీటి ఏర్పాటు ఆపరేటింగ్‌కు ఆసక్తి గల సంస్థలు ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (EOI) బిడ్లను జీహెచ్ఎంసీ(GHMC) మంగళవారం నుంచి ఆహ్వానిస్తుంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా లేనందున, జీహెచ్ఎంసీపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా బీఓటీ ప్రాతిపదికన ఈ టాయిలెట్లను నగరవాసులకు అందుబాటులోకి తేవాలని జీహెచ్ఎంసీ భావిస్తుంది. ఈ బిడ్లను గురువారం మధ్యాహ్నాం ఒంటి గంట వరకు స్వీకరించనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లిడించారు. తొలి దశగా ఈ పే అండ్ యూజ్ టాయిలెట్లను సికింద్రాబాద్(Secunderabad) జోన్ లో అందుబాటులోకి తీసుకువచ్చి, వాటి వినియోగం, నిర్వహణను బట్టి మిగిలిన అయిదు జోన్లలోనూ ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (EOE) బిడ్లను ఆహ్వానించి, ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ(GHMC) భావిస్తుంది, ముఖ్యంగా సికిందరాబాద్ జోన్ లోని సికిందరాబాద్ రైల్వే స్టేషన్ తో పాటు జూబ్లీ బస్ స్టేషన్ కు ప్రతి రోజు యాత్రికులు వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నందున ప్రయోగాత్మకంగా ఈ జోన్ లో ఈ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ భావిస్తుంది.

Also Read: Patny Drainage Expansion: నాలా విస్త‌ర‌ణ‌తో ప‌లు కాల‌నీల‌కు త‌ప్పిన వ‌ర‌ద ముప్పు

కేటాయింపుల్లో రిజర్వేషన్ల అమలు
పే అండ్ యూజ్ గా వినియోగించే ఈ-టాయిలెట్లు(E-toilets), బయో టాయిలెట్ల(bio-toilets) కేటాయింపుల్లో రిజర్వేషషన్లను అమలు చేయాలని జీహెచ్ఎంసీ(GHMC) భావిస్తుంది. ఒక జోన్ లోని మొత్తం ఈ-టాయిలెట్లు, బయో టాయిలెట్ల ను ఛార్జీలు చెల్లించి వినియోగించేందుకు వీలుగా సంస్థలు ఏర్పాటు, నిర్వహణ, బదలాయింపు బాధ్యతలను రిజర్వేషన్ల ప్రకారం అప్పగించాలని జీహెచ్ఎంసీ భావిస్తుంది. ముఖ్యంగా సఫాయి కర్మచారిలకు 25 శాతం, వికలాంగులకు మరో పది శాతం కేటాయించి, మిగిలిన 65 శాతం జనరల్ కోటా కింద వివిధ సంస్థలకు కేటాయించేందుకు జీహెచ్ఎంసీ సిద్దమైంది.

మెరుగైన నిర్వహణ జవాబుదారి తనం కోసమే
ఇప్పటి వరకు రోడ్లపై ఎక్కడబడితే అక్కడ బహిరంగ మూత్ర విసర్జన కాకుండా జీహెచ్ఎంసీ(GHMC) అనేక చర్యలు చేపట్టింది. సిటీ గ్రేటర్ కాకముందు 2007లో ఫ్రీ టాయిలెట్లను అందుబాటులోకి తేగా, వాటి నిర్వహణ సక్రమంగా లేకపోవటం, దాదాపు అవన్నీ మెయిన్ రోడ్లపైనే ఉండటంతో వాటిని ఆక్రమించటంతో పాటు రోడ్డు విస్తరణలో కొన్ని కనుమరుగైపోయాయి. ఆ తర్వాత ఇంటి నుంచి వివిధ పనుల మీద బయటకు వచ్చే వారి సౌకర్యార్థం జీహెచ్ఎంసీ కోట్లాది రూపాయలను వచ్చించి, మూడేళ్ల క్రితం ఆరు జోన్లలో సుమారు 7 వేల పై చిలుకు స్వచ్ఛ టాయిలెట్లను ఏర్పాటు చేసింది. వీటిని నిర్వహణ కోసం పలు ప్రైవేటు వ్యక్తులు, సంస్థలతో పాటు సఫాయి కార్మికులకు అప్పగిస్తూ, నెలకు జీహెచ్ఎంసీ ఛార్జీలను చెల్లించినా, ఆశించిన స్థాయిలో పని చేయలేదు.

నామమాత్రం ఛార్జీలు చెల్లిస్తే
చివరకు ఈ టాయిలెట్లన్నీ కూడా షాపులుగా, పాన్ షాపులుగా మారిపోవటంతో వివిధ పనులపై బయటకొచ్చే నగర పౌరులకు మూత్రశాలలు అందుబాటులో లేకుండా పోయాయి. ఇపుడు తాజాగా తెరపైకి వచ్చిన పే అండ్ యూజ్ టాయిలెట్ల(Pay and use toilets) నిర్వాహకులు, వినియోగదారులు కూడా జవాబుదారి అయ్యేలా వీటిని ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. వినియోగించుకున్నందుకు నామమాత్రం ఛార్జీలు చెల్లిస్తే, ఆ నిధులతో నిర్వాహకులు మరింత మెరుగుగా నిర్వహించే అవకాశముందని, వీటిని ఏర్పాటు చేసే సంస్థలు, వ్యక్తులు, సఫాయి కర్మచారిలు వీటి నిర్వహణ, విదేశాల మాదిరిగా నిర్వహణకు చేపట్టేందుకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు వీటిపై అడ్వర్ టైజ్ మెంట్లను అనుమతినిచ్చి, కొంత సంపాదించుకునే వెసులు బాటును కూడా జీహెచ్ఎంసీ కల్పించనుంది.

 Also Read;  Rangam Bhavishyavani: భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత..

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!