Singareni Warning ( image credit: twitter)
నార్త్ తెలంగాణ

Singareni Warning: దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు..హెచ్చరించిన సింగరేణి యాజమాన్యం

Singareni Warning: తెలంగాణ ప్రగతికి వెన్నెముకగా నిలుస్తున్న సింగరేణి సంస్థపై కొందరు (Journalist) జర్నలిస్టు ముసుగులో దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సింగరేణి (Singareni) యాజమాన్యం తీవ్రంగా హెచ్చరించింది. సిద్దిపేటకు చెందిన ఎస్కే మహమ్మద్ జునైద్ మునావర్ పాషా అనే (Journalist) జర్నలిస్టుపై సంస్థ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

87534 43959 నంబర్ నుంచి సింగరేణి (Singareni) సంస్థపై వచ్చిన అసభ్యకర, జుగుప్సాకర సందేశాన్ని యాజమాన్యం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. జర్నలిస్టుగా చెప్పుకొంటూ సింగరేణి (Singareni) పరువు ప్రతిష్టకు భంగం కలిగించి తప్పుడు ప్రచారానికి పూనుకున్న ఎస్కే మహమ్మద్ జునైద్ మునావర్ పాషాపై న్యాయపరంగా, చట్టపరంగా క్రిమినల్ కేసులు పెట్టనున్నట్లు హెచ్చరించింది. ఒకవేళ సదరు వ్యక్తి పేరును ఇతరులు వాడుకుంటున్నట్లయితే ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకురావాలని కోరింది.

 Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. కదిలిన ఫారెస్ట్ యంత్రాగం.. అటవీ భూమి ఆక్రమణలకు చెక్!

నిజమైన జర్నలిస్టులకు గౌరవం..
సింగరేణి (Singareni) సంస్థ విస్తరించిన 12 ఏరియాల్లో సుమారు 300 మందికి పైగా జర్నలిస్టులు ఉన్నారని, ప్రతినిత్యం 200కు పైగా వార్తలు కంపెనీపై రాస్తున్నారని యాజమాన్యం పేర్కొంది. తెలంగాణ ప్రాంత బిడ్డలుగా సంస్థ ప్రగతికి దోహదం చేస్తూ వార్తా కథనాలు ఇస్తున్న ఆ జర్నలిస్టులందరిపై సంస్థకు గౌరవం ఉందని వెల్లడించింది. అయితే, సిద్దిపేట ప్రాంతానికి చెందిన జర్నలిస్టు ఎస్కే మహమ్మద్ జునైద్ మునావర్ పాషా అనే పేరుతో జరుగుతున్న జుగుప్సాకర, అసత్యపూరిత, అభ్యంతరకర ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని సింగరేణి యాజమాన్యం స్పష్టం చేసింది. వీటి రూపకర్తలపైన, ప్రచారంలో పెట్టిన వారిపైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించింది. ఇలాంటి బూటకపు వ్యక్తుల గురించిన సమాచారం ఉంటే యాజమాన్యం దృష్టికి తీసుకురావాలని కోరింది.

Also Read: Liquor Scam Case: లిక్కర్ కేసులో వైఎస్ జగన్ అరెస్ట్‌కు బ్రేక్ పడిందా?

Just In

01

Manoj Manchu: ‘మిరాయ్’ ఈవెంట్‌లో మనోజ్ మంచు ‘ఓజీ’ ప్రమోషన్.. ఇది వేరే లెవల్ అంతే!

Chanakya Niti: మీ బంధువులకు ఈ విషయాలు అస్సలు చెప్పకూడదని తెలుసా..

Pawan Kalyan: అల్లు అరవింద్ మదర్ పవన్ కళ్యాణ్‌ని ఏమని పిలిచే వారో తెలుసా?

Vimal Krishna: ‘డీజే టిల్లు’ దర్శకుడి తర్వాత చిత్రం, హీరో.. డిటైల్స్ ఇవే!

Hyderabad Collector: ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన.. జిల్లా కలెక్టర్ హరిచందన