Patny Drainage Expansion (MAGE credit: swetcha reportwer)
హైదరాబాద్

Patny Drainage Expansion: నాలా విస్త‌ర‌ణ‌తో ప‌లు కాల‌నీల‌కు త‌ప్పిన వ‌ర‌ద ముప్పు

Patny Drainage Expansion: ప్యాట్నీ నాలా విస్తరణ ప‌నుల‌తో ఎగువ ప్రాంతాల్లోని పదుల సంఖ్యలో ఉన్న కాల‌నీల‌కు ఈసారి వ‌ర‌ద ముప్పు తప్పిందని అక్కడి నివాసితులు చెబుతున్నారు. గత శుక్రవారం 11 నుంచి 14 సెంటీమీట‌ర్ల వ‌ర్షపాతం నమోదైనా తమ ప్రాంతాల్లో ఎక్కడా నీరు నిల‌వ‌లేదని వారు పేర్కొన్నారు. అయితే, ప్యాట్నీ పరిసరాలు నీట మున‌గ‌డానికి అక్కడి ఆక్రమ‌ణ‌దారులే కార‌ణమని, నాలా విస్తరణ పనులను అడ్డుకోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. హ‌స్మత్‌పేట నాలా, పికెట్ నాలాలు ఎంత ప్రమాదకరంగా ప్రవహిస్తాయో నగరవాసులందరికీ తెలుసని, ఈ రెండు నాలాలు ప్యాట్నీ దగ్గర కలుస్తాయని స్థానికులు చెబుతున్నారు.

రెండు నాలాలు కలిసిన చోట ఉన్న నాలా వెడల్పు (26 మీట‌ర్లు) ప్యాట్నీ దగ్గరకు వచ్చేసరికి కేవలం 5 నుంచి 7 మీట‌ర్లకు కుంచించుకుపోవడం వల్ల ప్రతీ ఏటా వరద కాలనీలను ముంచెత్తేదని వివరించారు. ఈసారి హైడ్రా, కంటోన్మెంట్ సంయుక్తాధ్వర్యంలో విస్తరణ పనులు చేపట్టడంతో ఆ ముప్పు తప్పిందని పాయిగా కాల‌నీ, విమాన్‌న‌గ‌ర్, బీహెచ్ ఈఎల్ కాల‌నీ, మార్గద‌ర్శి కాల‌నీ, ల‌క్ష్మిగుంటి కాల‌నీ, ఇందిరాన‌గ‌ర్ బస్తీలతో పాటు పలు కాల‌నీలు నీట మునిగేవని అంటున్నారు. ఇక్కడున్న నివాస ప్రాంతాల్లో పేద, మధ్యతరగతికి చెందినవారే ఎక్కువని, హైడ్రాకు ఫిర్యాదు చేసిన వెంటనే తమకు రక్షణగా నిలిచిందని పేర్కొన్నారు.

 Also Read: ULI: సిబిల్ స్కోర్‌కు చెల్లుచీటీ.. కొత్త విధానం వచ్చేస్తోంది!

నాలా విస్తరణ జరగకుంటే..
కేవలం 5 సెంటీమీట‌ర్ల వ‌ర్షపాతానికే చాలా నివాస ప్రాంతాలు నీట మునిగేవి. అలాంటిది 10 సెంటీమీట‌ర్ల వర్షం నమోదైతే హ‌స్మత్‌పేట నాలా, పికెట్ నాలా పరీవాహక ప్రాంతాలు.. వందలాది నివాస ప్రాంతాలు నీట మునిగేవి. లక్షలాది కుటుంబాలు ఇబ్బందులు పడేవి. ప్రతీ ఏటా వాహనాలు, ఇంట్లో సామన్లు, నిత్యావసరాలు నీట మునిగిపోయేవి. కష్టపడి సంపాదించినదంతా ఒక్క వర్షానికే కొట్టుకుపోయేవి. దీంతో భయంగా వర్షాకాలం గడిపేవాళ్లం అని బాధితులు తమ గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

ప్యాట్నీ నాలా విస్తరణతో ఏం జరిగింది?
గత శుక్రవారం మల్కాజిగిరి ప్రాంతంలో 14 సెంటీమీట‌ర్ల వ‌ర్షపాతం నమోదైంది. భారీ మొత్తంలో వరద వచ్చింది. ప్యాట్నీ దగ్గర నాలాను వెడల్పు చేయడంతో ఈసారి తమ ప్రాంతాలు సురక్షితంగా ఉన్నాయని స్థానికులు తెలిపారు. దశాబ్దాలుగా కంటోన్మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేశామని, జూన్ నెలారంభంలో హైడ్రాను కూడా ఆశ్రయించామన్నారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వెంటనే హైడ్రా స్పందించి, అదే నెల 6వ తేదీన ప్యాట్నీ నాలా వద్ద ఆక్రమణలను తొలగించిందని, దీంతో ఈ ఏడాది వరద ముప్పు తప్పిందని చెప్పారు. హ‌స్మత్‌పేట నాలా దాదాపు 12 కిలోమీట‌ర్లు, పికెట్ నాలా 5 కిలోమీట‌ర్ల మేర ప్రవహించి ప్యాట్నీ వద్ద కలుస్తాయి. నాలా విస్తరణ పనులు పూర్తయితే లక్షలాది కుటుంబాలు సురక్షితంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు.

ప్యాట్నీ నాలా అసలు విస్తీర్ణం ఎంత?
హ‌స్మత్‌పేట నాలా – పికెట్ నాలా ప్యాట్నీ వద్ద కలుస్తాయి. ఈ రెండు నాలాలు చెరి 13 మీట‌ర్ల వెడ‌ల్పుతో సాగుతున్నాయి. ఈ రెండు నాలాలు కలిసిన చోట 26 మీట‌ర్ల వెడ‌ల్పు ఉండాలని, ఇలా కొనసాగితే ఇబ్బందులు ఉండేవి కాదని స్థానికులు వివరించారు. ర‌సూల్‌పురా వద్ద సికింద్రాబాద్ ప్రధాన దారిలో నిర్మించిన వంతెన‌ను పరిశీలించినా ఇది రుజువు అవుతుందన్నారు. కానీ ప్యాట్నీ ప్రాంతంలో అక్రమ కట్టడాలు రావడంతో, అక్కడ కేవలం 5 నుంచి 7 మీట‌ర్లకే పరిమితమైందని తెలిపారు. ర‌సూల్‌పురా వంతెన వద్ద కంటోన్మెంట్ ప్రాంతం వైపు 17 మీట‌ర్లున్నా.. అదే వంతెన వద్ద జీహెచ్ఎంసీ వైపు 26 మీట‌ర్లుందని, ప్యాట్నీ ప్రాంతంలో ఆక్రమ‌ణ‌ల‌తో కేవలం 7 మీట‌ర్లకే పరిమితమైందని స్పష్టం చేశారు.

ప్యాట్నీ ప్రాంతం మునగడానికి కారకులెవరు?
ప్యాట్నీ నాలా విస్తరణ పనులను కంటోన్మెంట్ బోర్డుతో కలిసి హైడ్రా జూన్ నెల 6వ తేదీన చేపట్టింది. ప్యాట్నీ వద్ద ఆక్రమణలను తొలగించి, నాలాను 17 మీట‌ర్ల మేర విస్తరించింది. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి కూడా సిద్ధమైన వేళ.. అక్కడి ఆక్రమణదారులు కోర్టుకు వెళ్లి పనులను ఆపేశారని స్థానికులు ఆరోపించారు. ఆ పనులు ఆగిపోవడంతో పై నుంచి వచ్చిన వరద ప్యాట్నీ ప్రాంతాన్ని ముంచెత్తిందని, ఇప్పుడు వారే ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. అక్కడ పూర్తి స్థాయి విస్తరణ పనులు, రిటైనింగ్ వాల్ నిర్మాణం జరిగిపోతే ఇబ్బంది ఉండేది కాదని, చకచకా సాగిపోతున్న పనులను అడ్డుకున్నందువల్లే వరద ముంచెత్తిందని తెలిపారు.

మీడియాను ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారు?
ప్యాట్నీ ప్రాంతంలో నాలాను క‌బ్జా చేసి షెడ్లు, వాణిజ్య సముదాయాలు నిర్మించిన వారే మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. హైడ్రా తొలగించిన ఏ నిర్మాణానికి అనుమతులు లేవని స్పష్టం చేశారు. పైన ఉన్న నివాస ప్రాంతాలు ఏమైపోయినా ఫర్వాలేదని భావించిన వారు కొంతమంది మీడియా ప్రతినిధులను తప్పుదోవ పట్టిస్తున్నారని, తప్పుడు సమాచారం ఇస్తున్నారని పేర్కొన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని అడ్డుకున్న విషయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు మీడియా ముందు లబోదిబోమంటున్నారని మండిపడ్డారు.

ప్యాట్నీ వద్ద తాత్కాలిక రిటైనింగ్ వాల్..
ప్యాట్నీ పరిసరాలను వరద ముంచెత్తకుండా.. నాలాకు తాత్కాలిక రిటైనింగ్ వాల్‌ను కంటోన్మెంట్ బోర్డు ఏర్పాటు చేసింది. శాశ్వతంగా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టేందుకు ఉన్న ఆటంకాలను కూడా తొలగించేందుకు హైడ్రా కృషి చేస్తుంది. అప్పటి వరకూ వరద ప్యాట్నీ ప్రాంతాలను ముంచెత్తకుండా.. ఇసుక బస్తాలతో కంటోన్మెంట్ బోర్డు అడ్డుకట్ట వేసింది. వారం, పది రోజుల్లో రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేసేందుకు కంటోన్మెంట్ బోర్డు కసరత్తు చేస్తుంది.

 Also Read: Samantha: వెన్నెల కిషోర్‌ ఏంటి తేడాగా చేస్తున్నాడు.. పక్కన సమంత నవ్వు ఆపుకోలేకపోతుంది!

Just In

01

Hyderabad SHE Teams: గణేష్ ఉత్సవాలు.. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన.. 1612 మంది పోకిరీల అరెస్ట్

Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్లపై గుడ్ న్యూస్.. ఒక్క ఫోన్‌తో మీ సమస్యలకు చెక్!

Tunnel movie: డేట్ మారిన లావణ్య త్రిపాఠి ‘టన్నెల్’.. వచ్చేది ఎప్పుడంటే?

Kaantha: ‘కాంత’ విడుదల వాయిదా.. టీమ్ ఏం చెప్పిందంటే?

Nano Banana: గూగుల్ జెమినీలో 3డీ ఇమేజెస్‌ ఆప్షన్.. క్రియేట్ చేయడం చాలా ఈజీ!