Samantha: స్టార్ హీరోయిన్ సమంత తన నగురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తన సినీ కెరీర్ ను మొదలు పెట్టింది. 2010లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రం ఏ మాయ చేసావే చిత్రంతో ప్రారంభించింది. ఈ చిత్రం తమిళంలో ” విన్నైతాండి వరువాయా ” గా తెరకెక్కింది. ఈ సినిమాలో జెస్సీ పాత్రలో ఆమె నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతే కాదు, ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి డెబ్యూ అవార్డు (సౌత్), నంది అవార్డును కూడా గెలుచుకుంది. అయితే, ప్రస్తుతం సమంతకి సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది.
సమంత అభిమానులకు పండగే.. ఈ వీడియో చూస్తే మీరు కూడా సంతోషపడతారు. చాలా రోజుల తర్వాత సమంత హ్యాపీగా ఉన్నట్లు కనిపిస్తుంది. సామ్, కామెడీ కింగ్ వెన్నెల కిషోర్ కలిసి ది గర్ల్ ఫ్రెండ్ లోని #Nadhive ని మళ్లీ రీ క్రియోట్ చేసి సాంగ్ లోని సీన్ ను అదరగొట్టారు. డైరెక్టర్ కమ్ హీరో అయిన రాహుల్ రవీంద్రన్ ఈ వీడియోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. ఈ ఫన్నీ రీ-క్రియేషన్‌లో కిషోర్ ఎమోషన్స్‌తో అలరించాడు, కానీ సమంత “ఇంకా ఎక్కువ ఎమోషన్స్‌తో మరో టేక్ కావాలి కిషోర్” అని ఫన్నీగా ఆట పట్టిస్తోంది.
Also Read: Rahul Sipligunj: మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. రాహుల్ సిప్లిగంజ్ కు కోటి రూపాయల నజరానా
ప్రస్తుతం, సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ ట్వీట్ ను చూసిన సమంత, వెన్నెల కిషోర్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. #Nadhive రీ-క్రియేషన్ వీడియో సోషల్ మీడియాలో చాలా బావుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ జోడీ మళ్లీ ఇంకో సినిమాతో అలరించడం ఖాయమని అభిమానులు అంటున్నారు.
Also Read: Viral Videos: వామ్మో.. ఏఐతో ఇలాంటి వీడియోలు కూడా చేయొచ్చా.. పొట్ట పగిలిపోతోంది భయ్యా!
Here’s @Samanthaprabhu2 and @vennelakishore recreating #Nadhive😂😂♥️ I want one more take with more emoshuns Kishore! @iamRashmika @Dheekshiths @GeethaArts @DheeMogilineni #TheGirlfriend pic.twitter.com/ddM078FPkG
— Rahul Ravindran (@23_rahulr) July 20, 2025