Rahul Sipligunj: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన హామీని నిలబెట్టుకున్నారు. పాతబస్తీ కుర్రాడిగా సామాన్యమైన ప్రస్థానం మొదలెట్టి, ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో ‘నాటు నాటు’ పాటతో ఆస్కార్ వరకు వెళ్ళినా గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌కు బోనాల పండగ సందర్భంగా ప్రభుత్వం కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రకటించింది.
రాహుల్ తన కృషితో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించి, తెలంగాణ యువతకు స్ఫూర్తిగా నిలిచాడని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. గత ఎన్నికల ముందు, అప్పటి పీసీసీ చీఫ్‌గా రేవంత్, రాహుల్‌కు 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కోటి రూపాయలు ఇస్తామని మాట ఇచ్చారు. ఇటీవల గద్దర్ అవార్డుల వేదికపైనా రాహుల్‌ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, త్వరలోనే ప్రభుత్వం గౌరవిస్తుందని సీఎం సంకేతం ఇచ్చారు. ఆ మాట ప్రకారం, ఈ బోనాల పండగ సమయంలో రాహుల్‌కు కోటి రూపాయల నజరానా ప్రకటించారు. దీంతో రేవంత్ మరోసారి తన నీతికి నిదర్శనమైన నాయకుడిగా నిలిచారని ప్రజలు కూడా ప్రశంసిస్తున్నారు.
Also Read: Star Hero: మాజీ లవర్ పై మోజు పడుతున్న హీరో .. పెళ్ళైనా పర్లేదు నీ భార్య నాకు కావాలంటూ..?