Women Avoid These Foods (Image Source: AI)
లేటెస్ట్ న్యూస్, లైఫ్‌స్టైల్

Women Avoid These Foods: పీసీఓఎస్‌తో బాధపడున్నారా? వర్షాకాలంలో ఈ ఆహారం అస్సలు తీసుకోద్దు!

Women Avoid These Foods: మహిళలను వెంటాడే ప్రధానమైన సమస్యల్లో PCOS (పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్) ఒకటి. దీనితో బాధపడే స్త్రీలు.. వర్షాకాలంలో చాలా అప్రమత్తంగా ఉండాలని గైనకాలజిస్ట్ నిపుణులు సూచిస్తున్నారు. ఐదు రకాల ఆహార పదార్థాలను తప్పనిసరిగా దూరంపెట్టాలని సూచిస్తున్నారు. వర్షాకాలంలో శరీర రోగ నిరోధక శక్తి, జీర్ణ శక్తి బలహీనంగా ఉంటాయని.. ఆయా ఆహారాలను నివారించడం వల్ల హార్మోన్ల అసమతుల్యత, బరువు పెరగడం, జీర్ణ, చర్మ సమస్యలు వంటి PCOS లక్షణాలను నియంత్రించవచ్చని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ ఐదు ఆహారాలు ఏంటి? అవి తీసుకుంటే కలిగే నష్టాలు? తీసుకోవాల్సిన ఆహారం? నిపుణులు ఇస్తున్న సలహాలు? గురించి ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు
వైట్ రైస్, బ్రెడ్, పాస్తా, కేకులు, బిస్కెట్లు వంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు (Refined Carbohydrates) ఇన్సులిన్ (Insulin) నిరోధకతను పెంచుతాయి. ఇది PCOS (Polycystic ovary syndrome) లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచడంతో పాటు హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తాయి. వీటికి బదులుగా ఓట్స్, బ్రౌన్ రైస్ లేదా మిల్లెట్ల వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను ఎంచుకోవాలి.

సాచురేటెడ్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్
జున్ను, రెడ్ మీట్, ఫుల్-ఫ్యాట్ డైరీ ఉత్పత్తులు, ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో సాచురేటెట్, ట్రాన్స్ ఫ్యాట్స్ (Saturated fat) అధికంగా ఉంటాయి. PCOS ఉన్న మహిళలలో ఇన్సులిన్ నిరోధకత, శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను పెంచుతాయి. వీటికి బదులుగా శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వును అందించే ఆలివ్ ఆయిల్, సీసమీ ఆయిల్ లేదా ఫ్లాక్స్ సీడ్స్ వంటి పదార్థాలను ఎంచుకోవాలి.

కూల్ డ్రింక్స్
సోడా, ఎనర్జీ డ్రింక్స్, అధిక షుగర్ ఉన్న టీ, హై-క్యాలరీ స్మూతీస్ వంటి షుగరీ డ్రింక్స్ రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. ఇది ఇన్సులిన్ పనితీరును దెబ్బతీస్తుంది. తద్వారా బరువు పెరగడానికి, హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి. వీటికి బదులు హెర్బల్ టీ, నిమ్మరసం లేదా ఫిల్టర్ చేసిన నీటిని తాగితే మంచిది.

కెఫీన్ అధికంగా ఉండే ఆహారాలు
కాఫీతో పాటు కెఫీన్ (Caffeine) అధికంగా ఉండే డ్రింక్స్ ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచుతాయి. ఇది PCOS ఉన్న మహిళలలో హార్మోన్ల అసమతుల్యతను మరింత దిగజార్చవచ్చు. కాబట్టి కెఫీన్ తీసుకోవడం తగ్గించి గ్రీన్ టీ లేదా హెర్బల్ టీలను ఎంచుకోవాలి. ఇవి ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

ఆకుకూరలు (కొన్ని సందర్భాల్లో)
వర్షాకాలంలో ఆకుకూరలు (స్పినాచ్, క్యాబేజీ, బ్రోకలీ) బ్యాక్టీరియా, క్రిములతో కలుషితమయ్యే అవకాశం ఉంది. ఇవి జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. PCOS ఉన్న మహిళలు ఈ ఆహారాలను పూర్తిగా ఉడికించి తినాలి. పచ్చి ఆకుకూరలతో చేసే సలాడ్‌లను నివారించాలి.

Also Read: Gold Rate Today: అయ్య బాబోయ్.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. ఇవాళ ఎంతంటే?

నిపుణుల సలహాలు
PCOS బాధపడే స్త్రీలు.. వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏమేమి చేయాలో నిపుణులు సలహాలు ఇస్తున్నారు. వారి సూచనల ప్రకారం ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు (ఓట్స్, బ్రౌన్ రైస్, లెగ్యూమ్స్), యాంటీ-ఇన్ఫ్లమేటరీ స్పైసెస్ (పసుపు, అల్లం, జీలకర్ర), ప్రోబయోటిక్స్ (పెరుగు, బటర్‌మిల్క్) PCOS లక్షణాలను నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే యోగా, ధ్యానం, రోజువారీ వ్యాయామం.. హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తాయి. వర్షాకాలంలో స్వచ్ఛమైన నీటిని తాగడం, ఆహారాన్ని శుభ్రంగా ఉడికించడం చాలా ముఖ్యం. PCOS లక్షణాలు తీవ్రంగా ఉంటే గైనకాలజిస్ట్ లేదా డైటీషియన్‌ను సంప్రదించడం మంచిది.

Also Read This: Urfi Javed: అందం కోసం వెళ్తే.. నటికి వాచిపోయింది.. ప్రయోగాలు అవసరమా?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?