pandya jasmin
Viral, లేటెస్ట్ న్యూస్

Hardik Pandya: హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితంలో మరో కీలక పరిణామం?

Hardik Pandya: టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఆల్‌రౌండ్ స్పెషలిస్ట్. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ సమానంగా రాణించగల సత్తా ఉన్న ప్లేయర్. టీ20, వన్డే మ్యాచ్‌ల్లో తన పవర్ హిట్టింగ్‌తో, బౌలింగ్ విషయానికి వస్తే డెత్ ఓవర్లలో వికెట్లు తీయగల సామర్థ్యం అతడి సొంతం. అందుకే, క్రికెట్‌ ప్రతిభతో పాండ్యా వార్తల్లో నిలవడం చాలా సాధారణ విషయం. అయితే, కొన్నిసార్లు వ్యక్తిగత జీవితం విషయంలో కూడా పాండ్యా వార్తల్లో నిలుస్తుంటుంది. భార్య నటాషా స్టాంకోవిచ్‌ నుంచి విడిపోయిన తర్వాత బ్రిటీష్-ఇండియన్ సింగర్ జాస్మిన్ వాలియాతో పాండ్యా డేటింగ్ చేస్తున్నట్టుగా చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే, ఆ జంట బ్రేకప్ అయ్యిందంటూ తాజాగా ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ విషయంపై ఇద్దరి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ, వారి వెకేషన్ విషయమై అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Read Also- Viral News: విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ విండో తెరవబోయిన ప్యాసింజర్

నిజంగానే విడిపోయారా?
హార్ధిక్ పాండ్యా, జాస్మిన్ వాలియా ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో కావడం లేదని ఫ్యాన్స్ గుర్తించారు. దీంతో, బ్రేకప్ వార్తలకు ఆజ్యం పోసినట్టు అయింది. అన్-ఫాలోయింగ్ నిజమా? కాదా? అని పరిశీలించగా, నిజంగానే హార్దిక్- జాస్మిన్ ఒకరినొకరు ఫాలో చేయడం లేదు. గతంలో ఒకరినొకరు ఫాలో చేయగా ఇప్పుడు అన్‌ఫాలో కొట్టేశారు. దీంతో, వాళ్ల బంధం ముగిసిపోయినట్టేనని చెప్పడానికి ఇదే స్పష్టమైన సంకేతమని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఐపీఎల్ సమయంలో జాస్మిన్ ముంబయి ఇండియన్స్‌ ఆడిన అన్ని మ్యాచ్‌లకు స్టేడియానికి వెళ్లి స్టాండ్స్‌లో నుంచి మంచి జోష్‌తో పాండ్యాను ఉత్తేజ పరుస్తుండేదని, కానీ ఇప్పుడు కలిసి ఉన్నట్టు దాఖలాలు లేవని అనుమానిస్తున్నారు. అయితే, ఇందులో ఎంత నిజం ఉందనేది మాత్రం ఎవరికీ తెలియదు.

Read Also- Tax Free: ఈ దేశాల్లో పన్నులు ఉండవు.. సంపాదనంతా వాడుకోవచ్చు

గతేడాది నటాషాతో విడాకులు

హార్దిక్ పాండ్యా గతేడాది జులై నెలలోనే తన భార్య నటాషా స్టాంకోవిచ్‌తో వివాహ బంధానికి ముగింపు పలికాడు. పాండ్యా-నటాషా దంపతులకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఇద్దరూ (కో-పేరెంటింగ్‌) కుమారుడిని పెంచుతున్నారు. నటాషా సెర్బియాకు చెందిన ఒక డ్యాన్సర్, మోడల్, నటి కూడా. ‘సత్యాగ్రహ’ అనే సినిమా ద్వారా బాలీవుడ్‌లో ఆమె కెరీర్ ప్రారంభమైంది. ఆ మూవీలో ‘ఐయో జీ’ అనే పాటలో ఆమె మెప్పించింది. ఆ తర్వాత, ఆక్షన్ జాక్సన్, లుప్త్, యారాం, ది బాడీ వంటి సినిమాల్లో కూడా నటించింది. సినిమాలతో పాటు ‘ఫ్లెష్’ అనే వెబ్ సిరీస్‌లో ఎన్ఐఏ ఏజెంట్ ‘పాల్ మేడమ్’ పాత్రలో నటించింది. డీజే వాలే బాబు, ‘నై షాద్ దా’ అనే రెండు మ్యూజిక్ వీడియోలలో కూడా నటించింది.

Read Also- Pawan Kalyan: పవన్ ఇచ్చిన మాట తప్పారా? వైద్యానికి కావాల్సిన 50 లక్షలు ఇవ్వలేదా? ఫిష్ వెంకట్ వీడియో వైరల్

 

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్