Tax Free Countries
Viral, లేటెస్ట్ న్యూస్

Tax Free: ఈ దేశాల్లో పన్నులు ఉండవు.. సంపాదనంతా వాడుకోవచ్చు

Tax Free: సంపాదించిన సొమ్ము నుంచి ఆదాయ పన్ను చెల్లించేటప్పుడు కలిగే బాధ వర్ణణాతీతమని చెప్పవచ్చు. శాలరీ అందిన ప్రతిసారి ట్యాక్స్ చెల్లించేటప్పుడు చాలా భారంగా అనిపిస్తుంటుంది. మన దేశంలో ప్రొగ్రెసివ్ ట్యాక్స్ స్లాబ్స్ (శ్లాబుల వారీగా) ప్రకారం, గరిష్ఠ స్థాయి స్లాబు ఆదాయంపై 39 శాతం వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సెస్‌ కూడా కలిపితే ‘పన్ను పోటు’ పొడుస్తున్నట్టు నొప్పిగా అనిపిస్తుంది. భారత్ మాదిరిగానే మరికొన్ని దేశాల్లో కూడా పన్నులు గట్టిగానే చెల్లించాల్సి ఉంటుంది. కానీ, కొన్ని దేశాల్లో పరిస్థితి ఇందుకు పూర్తి విభిన్నంగా ఉంటుంది. వ్యక్తిగత ఆదాయంపై ఎలాంటి పన్ను (Tax Free) ఉండదు. వ్యక్తిగతంగా ఎంత డబ్బు సంపాదించినా ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఎంచక్కా సంపాదించినదంతా దాచుకోవచ్చు. ఆ దేశాలను ‘ట్యాక్స్ ఫ్రీ’ దేశాలు అని అంటుంటారు. ఈ దేశాలలో ఆర్థిక విధానాలు చాలా విభిన్నంగా ఉంటాయి.

గల్ఫ్ దేశాలు స్వర్గధామాలే
ఆదాయ పన్ను లేని విధానాలు అమలు చేసే దేశాల జాబితాలో గల్ఫ్ దేశాలు ముందుంటాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), సౌదీ అరేబియా, ఖతర్, బహ్రెయిన్, ఒమన్, కువైట్ లాంటి దేశాల్లో వ్యక్తిగత శాలరీలు లేదా ఆదాయంపై ఎలాంటి ప్రత్యక్ష పన్నులు విధించరు. చమురు, గ్యాస్ వనరుల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం, పర్యాటక రంగం, వ్యాట్ (VAT) వంటి పరోక్ష పన్నులపై అక్కడి ప్రభుత్వాలు ఆధారపడతాయి. ప్రత్యేకమైన ఈ ఆర్థిక విధానాల కారణంగా ఆయా దేశాల్లో ప్రజలు పన్నులు రహిత జీవితాన్ని అనుభవిస్తుంటారు. ఈ విధానాలు అక్కడి జనాల చేతిలో డబ్బు మిగిలేందుకు దోహదపడుతుంటాయి.

Read Also- Jasprit Bumrah: బుమ్రా స్థానంలో ఎవరు?.. తెరపైకి డెబ్యూట్ ప్లేయర్!

యూఏఈ.. ఉద్యోగులకు ఆకర్షణీయం
వ్యక్తిగత ఆదాయ పన్ను విధించని గల్ఫ్ దేశాలలో యూఏఈ చాలా ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. చమురు ఉత్పత్తి, వేగంగా అభివృద్ధి చెందుతున్న పర్యాటక రంగాలే ఈ దేశానికి ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నాయి. అందుకే, వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు విషయంలో యూఏఈ ఆదర్శంగా నిలుస్తోంది. అక్కడ నివసించే వారిపై ఎలాంటి ఆదాయ పన్ను భారం ఉండదు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది నిపుణులను యూఏఈ ఆకర్షించడానికి ఈ అంశాలే దోహదపడుతున్నాయి. ప్రొఫెషనల్స్ మంచి వేతనాలు పొందడమే కాకుండా, ట్యాక్స్‌లు కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా లైఫ్ అనుభవిస్తున్నారు.

Read Also- Asia Cup: ఆసియా కప్ బాయ్‌కాట్ చేస్తాం.. పాక్‌కు బీసీసీఐ వార్నింగ్!

గల్ఫ్ వెలుపలి దేశాలు ఇవే..
జీరో ఇన్‌కమ్ ట్యాక్స్ (ఆదాయపన్ను లేకపోవడం) విధానం కేవలం గల్ఫ్ దేశాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఆసియా, యూరప్‌లోని కొన్ని సంపన్న దేశాలు కూడా పన్ను మినహాయింపు ఇస్తున్నాయి. ఈ జాబితాలో బ్రూనై, మొనాకో, నౌరూ, బహామాస్ లాంటి దేశాలు ఉన్నాయి. బ్రూనైకు చమురు, సహజవాయు ఆదాయం దృఢంగా ఉంది. నౌరూ, బహామాస్‌లకు పర్యాటక రంగ ఆదాయం గట్టిగా వస్తోంది. ఈ ఆదాయాల ద్వారా అక్కడి ప్రభుత్వాలకు చక్కటి రాబడి వస్తోంది. అందుకే, అక్కడ వ్యక్తిగత ఆదాయంపై పన్నులు విధించాల్సిన అవసరం ఉండడం లేదు.

పన్నులు లేకుండా ప్రభుత్వాలు నడిచేదెలా?
ప్రత్యక్ష పన్నులు విధించకుండా ఆర్థిక వ్యవస్థను నిర్వహించడం అంత సులభం కాదనే భావన కలగవచ్చు. అయితే, ఈ దేశాల ఆర్థిక దృఢత్వానికి చమురు వంటి సహజ వనరులు, పర్యాటక రంగం చాలా వరకు సాయపడతున్నాయి. ప్రత్యక్ష ఆదాయ పన్ను విధించకపోయినప్పటికీ, ప్రభుత్వ వ్యయాలకు అవసరమైన డబ్బు కోసం వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (VAT) వంటి పరోక్ష పన్నులు, ఇతర ఛార్జీలు విధిస్తుంటారు.

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు