Ice Discovered in Space (Image Source: Twitter)
అంతర్జాతీయం, లేటెస్ట్ న్యూస్

Ice Discovered in Space: అంతరిక్షంలో మంచుపై షాకింగ్ అధ్యయనం.. అందులో ఏం తేలిందో తెలిస్తే షాకే!

Ice Discovered in Space: అంతరిక్షంలో మంచు (Space Ice) ఆకృతి ఎలా ఉంటుందన్న దానిపై గత కొన్నేళ్లుగా ఖగోళ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. అతి శీతలమైన పరిస్థితుల కారణంగా భూమిపైన ఉన్న మంచు పర్వతాల తరహాలో అవి ఒక అందమైన ఆకృతిలో ఉండే అవకాశం లేదని గతంలో పలువురు అభిప్రాయపడ్డారు. అయితే తాజాగా యూనివర్సిటీ కాలేజ్ లండన్ (University College London), కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు (Cambridge scientists).. ఈ అభిప్రాయాలు తప్పని నిరూపించారు. అంతరిక్షంలోని మంచు పూర్తిగా అస్తవ్యస్తమైన (Amorphous) నిర్మాణం కాదని.. అందులో సుమారు 20-25% చిన్న క్రిస్టలైన్ నిర్మాణాలు ఉన్నాయని తేల్చారు.

క్రిస్టలైన్ అంటే ఏంటీ?
భూమిపైన ఉన్న మంచు సాధారణంగా క్రమబద్ధమైన క్రిస్టలైన్ (Crystalline) నిర్మాణంలో (ఉదాహరణకు స్నోఫ్లేక్‌ల వంటి నమూనాలు) ఏర్పడింది. కానీ అంతరిక్షంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు (-200°C వరకు) కారణంగా మంచు పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంటుందని శాస్త్రవేత్తలు భావించారు. అయితే యూనివర్సిటీ కాలేజ్ లండన్ (UCL), కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో అంతరిక్ష మంచులో 3 నానోమీటర్ల పరిమాణంలో చిన్న క్రిస్టలైన్ గ్రాన్యూల్స్ గా ఉన్నట్లు గుర్తించారు. దీంతో గ్రహాల ఏర్పాటు, జీవం మూలాలు, గెలాక్సీ చలనం వంటి అనేక కాస్మిక్ ప్రక్రియలపై ఈ అధ్యయనం కొత్త ప్రశ్నలను లేవనెత్తింది.

పరిశోధన ఎలా చేశారంటే?
శాస్త్రవేత్తలు కంప్యూటర్ సిమ్యులేషన్లు, ప్రయోగశాలలో ప్రయోగాలను (Laboratory experiments) ఉపయోగించి అంతరిక్ష మంచు అణు స్థాయి నిర్మాణాన్ని అధ్యయనం చేశారు. నీటి ఆవిరిని -120°C వద్ద వివిధ దశల్లో గడ్డకట్టించే ప్రయత్నం చేశారు. ఈ అధ్యయనంలో 20-25% క్రిస్టలైన్ నిర్మాణం, 80-75% అమోర్ఫస్ నిర్మాణం కలిగిన మంచు ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ఫలితాలు X-రే వివర్తన అధ్యయనాలతో సరిపోలాయని స్పష్టం చేశారు.

పాన్‌స్పెర్మియా సిద్ధాంతం
పాన్‌స్పెర్మియా సిద్ధాంతం ప్రకారం.. జీవం మూలాలైన అమైనో ఆమ్లాలు, ఇతర సేంద్రీయ అణువులు అంతరిక్ష మంచు ద్వారా భూమికి చేరాయని శాస్త్రవేత్తలు భావిస్తారు. కానీ, క్రిస్టలైన్ నిర్మాణం కలిగిన మంచులో ఈ అణువులను ఉంచడానికి తక్కువ స్థలం ఉన్నట్లు తాజా పరిశోధనల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. కాబట్టి జీవం మూలాలను రవాణా చేయడానికి మంచు.. అంత అనుకూలమైన రవాణా మాద్యమం కాదని వెల్లడైంది.

Also Read: Warangal Crime: రాష్ట్రంలో ఘోరం.. పక్కా ప్లాన్‌తో భర్తను లేపేసిన భార్య.. ఎలాగంటే?

ఆవిష్కరణ ప్రాముఖ్యత
యూనివర్సిటీ కాలేజ్ లండన్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చేసిన తాజా అధ్యయనం.. అంతరిక్ష పరిశోధనలను కీలక మలుపు తీప్పే అవకాశముందని ఖగోళ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతరిక్ష మంచు నిర్మాణం.. గ్రహాలు, ఉపగ్రహాల ఏర్పాటును ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడానికి ఈ ఆవిష్కరణ సహాయపడుతుందని అంచనా వేస్తున్నారు. జీవం యొక్క రసాయన మూలాలు భూమికి ఎలా చేరాయనే దానిపై కొత్త చర్చను ప్రారంభిస్తుందని పేర్కొన్నారు. అంతరిక్ష యాత్రలలో రేడియేషన్ షీల్డ్‌లు లేదా ఇంధన వనరులను అభివృద్ధి చేయడంలో ఈ అధ్యయనం ఉపయోగపడవచ్చని చెబుతున్నారు. కాగా ఈ అధ్యయనం డాక్టర్ మైఖేల్ బెనెడిక్ట్ డేవిస్ నేతృత్వంలో జరిగింది.. ఫిజికల్ రివ్యూ బి జర్నల్‌లో ప్రచురితమైంది.

Also Read This: Ravi Teja: రవితేజ ఇంట్లో తీవ్ర విషాదం.. ఆ ఇద్దర్ని ఒకేసారి కోల్పోయిన హీరో?

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?