Ravi Teja : గత నాలుగు రోజుల నుంచి సినీ ఇండస్ట్రీలో వరుస విషాధకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కోట శ్రీనువాసరావు, సరోజా దేవి మరణం మరువక ముందే తాజాగా హీరో రవితేజ తండ్రి భూపతి రాజు రాజగోపాల్ రాజు (90) నిన్న రాత్రి హైదరాబాద్‌లోని నివాసంలో కన్నుమూశారు. ఆయన మాజీ ఫార్మసిస్ట్‌గా పనిచేశారు. రవితేజతో సహా ముగ్గురు కుమారులను ఉన్నారు. ఈ విషాద సమయంలో రవితేజ కుటుంబానికి సినీ పరిశ్రమ నుండి సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
Also Read: Uttam Kumar Reddy: కృష్ణా గోదావరి బేసిన్లో సమస్యలపై చొరవచూపాలి.. పాటిల్‌కు మంత్రి లేఖ
రీల్ ఫాదర్.. రియల్ ఫాదర్ ను ఒకేసారి కోల్పోయిన హీరో రవితేజ
రవితేజ ఇటీవలే తన రీల్ ఫాదర్‌గా పిలవబడే సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు మరణంతో విచారంలో ఉన్నారు, ఇప్పుడు తన నిజ తండ్రి కూడా కన్నుమూయడంతో ఈ దుఃఖం మరింత ఎక్కువయ్యింది. రాజగోపాల్ రాజు మరణానికి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.
Also Read: Samantha: నాగచైతన్యదే తప్పు.. భార్య దగ్గర నిజాయితీగా ఉండాలంటూ.. సమంత సంచలన కామెంట్స్
రవితేజ కుటుంబం హైదరాబాద్‌లో నివసిస్తుంది. ఆయన భార్య కళ్యాణి, కుమార్తె మోక్షద, కుమారుడు మహధన్ భూపతిరాజుతో కలిసి ఉంటున్నారు. ఈ విషాధకర సమయంలో సినీ అభిమానులు, సన్నిహితులు రవితేజకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. నిలుస్తున్నారు.
Also Read: Telugu Cinema: షూటింగ్లో అలాంటి పాడు పని చేసినందుకు హీరోని చెప్పుతో కొట్టిన స్టార్ హీరోయిన్?