Samantha: హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత.. ఈ ఇద్దరూ ఇప్పుడు తమ జీవితాల్లో బిజీగా గడుపుతున్నారు. ఇక నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను పెళ్లి చేసుకుని తన వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉన్నాడు. సమంత దర్శకుడు రాజ్‌తో ప్రేమలో ఉందంటూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, వీరిద్దరూ తమ జీవితాల్లో ముందుకు సాగుతున్నప్పటికీ, వీరికి సంబంధించిన పాత వార్తలు, వీడియోలు ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి.
నాగ చైతన్య చేసింది తప్పు?
ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, సమంత గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇంస్టాగ్రామ్‌లో వీడియోలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలో ఓ ఇంటర్వ్యూయర్ నాగచైతన్యను, “ఒక అమ్మాయికి బెస్ట్‌గా ప్రపోజ్ చేయడం ఎలా?” అని అడిగారు. దానికి చైతన్య సమాధానంగా, “బెస్ట్ అనేది ఏమీ లేదు, ఎలా ప్రపోజ్ చేసినా ఆమె ఒప్పుకోకపోవచ్చు” అని కాస్త తేలిగ్గా సమాధానం ఇచ్చారు. అప్పుడు పక్కనే ఉన్న సమంత వెంటనే జోక్యం చేసుకుని, “అది తప్పు” అని ఖండిస్తూ ‘నో’ అంటూ, “ప్రేమలో నిజాయితీ చాలా ముఖ్యం. ఎలాంటి పరిస్థితిలోనైనా నీ హార్ట్ లోని నిజమైన భావాలను ఓపెన్‌గా చెప్పాలి. నీవు నిజాయితీగా ఉంటే, ఆ అమ్మాయి ఖచ్చితంగా నీ ప్రేమను అర్థం చేసుకుంటుంది. అదే అమ్మాయికి బెస్ట్‌గా ప్రపోజ్ చేసే మార్గం” అలాగే భార్య దగ్గర కూడా నిజాయితీగా ఉండాలని చెప్పింది.
Also Read: Warangal MGM hospital: ఎంజీఎం హస్పిటల్‌లో దారుణం.. బతికి ఉన్న వక్తి చనిపోయాడని తెలిపిన సిబ్బంది
నెటిజన్ల రియాక్షన్ ఇదే
ఈ పాత వీడియో ఇప్పుడు సమంత అభిమానుల ఇంస్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతోంది. అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తూ, “ ఇప్పటికైనా అర్ధమైందా వీరి విడాకులు విషయంలో తప్పు ఎవరు చేశారో? సమంత, చైతన్యల మధ్య ఉన్న తేడా ఇదే ” అంటూ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ, వీరిద్దరి వ్యక్తిత్వాలపై మరోసారి చర్చకు తెరలేపింది.
Also Read: Cow Calf: రెండు కాళ్లతో నడుస్తున్న ఆవు దూడ.. కోవిడ్‌ను మించిన ముప్పు రాబోతుందా.. దేనికి సంకేతం?