Saroja Devi ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

B Saroja Devi: అమ్మకి ఇచ్చిన మాట కోసం వాటికి దూరంగా ఉంది.. ఇప్పుడున్న హీరోయిన్స్ అయితే పాటించేవాళ్లే కాదు?

B Saroja Devi: తెలుగు సినీ పరిశ్రమలో మరో దిగ్గజం కన్నుమూశారు. ప్రముఖ నటి బి. సరోజా దేవి మరణం ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచెత్తింది. తెలుగు, కన్నడ, తమిళ సినీ పరిశ్రమల్లో ‘అభినయ సరస్వతి’గా పేరొందిన ప్రముఖ నటి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత బి. సరోజా దేవి (87) బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె నుంచి ఇపుడున్న హీరోయిన్స్ చాలా నేర్చుకోవాలి. అమ్మకి ఇచ్చిన మాట కోసం బి. సరోజా దేవి  ఏం చేసిందో  ఇక్కడ తెలుసుకుందాం..

Also Read: Tirumala: టీటీడీపై బండి సంజ‌య్ వ్యాఖ్యల్లో నిజమెంత.. రగులుతున్న తెలుగు రాష్ట్రాలు!

సీనియర్ హీరోస్ తో బి. సరోజా దేవి

దక్షిణ భారత సినీ పరిశ్రమలో ‘అభినయ సరస్వతి’గా, ధైర్యానికి ప్రతీకగా నిలిచిన బి. సరోజా దేవి ఒక అసాధారణ వ్యక్తిత్వం. తన కెరీర్‌లో సహజమైన నటనతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. సీన్‌కి తగ్గట్టు తనను తాను మలుచుకుని, సెట్‌లో అందరితో సరదాగా, ఆత్మీయంగా మెలిగే సరోజా దేవి స్నేహశీలియైన నటిగా పేరు తెచ్చుకున్నారు.  శివాజీ గణేశన్,ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్ లాంటి దిగ్గజ నటులతో నటిస్తున్నప్పటికీ, ఆమెలో ఏమాత్రం గర్వం లేకుండా అందరితో సమానంగా మెలిగేవారు.

Also Read:  Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ కి ఏమైంది.. ఆందోళనలో ఫ్యాన్స్.. తారక్ ఆరోగ్యంపై నెటిజన్ల ప్రశ్నల వర్షం

డైలాగులు కూడా సొంతగా ఆమె చెప్పేది 

సరోజా దేవి ఏ భాషలో నటించినా, ముందుగా ఆ భాషను పూర్తిగా నేర్చుకుని, డైలాగులు కూడా సొంతగా చెప్పడం ఆమె ప్రత్యేకత. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లోఇలా 200కు పైగా చిత్రాల్లో నటించిన ఆమె, ప్రతి సినిమాలో తనదైన ముద్ర వేశారు. ఆమె నటనా పాటవం కేవలం సామాజిక చిత్రాలకే పరిమితం కాకుండా, చారిత్రక, పౌరాణిక చిత్రాల్లోనూ సమానంగా ఆకట్టుకుంది. సరోజా దేవి సినిమా రంగంలోకి అడుగుపెట్టినప్పుడు తన తల్లి పెట్టిన షరతులకు కట్టుబడి, గ్లామర్ రహిత శైలితోనే ఫ్యాషన్ ఐకాన్‌గా నిలిచారు.

Also Read:  Kota Srinivasa Rao: లెజండరీ నటుడు కోట శ్రీనివాసరావు గురించి మీకేం తెలుసు.. ఇంట్రెస్టింగ్ విషయాలివే!

అమ్మకి ఇచ్చిన మాట కోసం ఆమె స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లు వేసుకోలేదు..

“స్విమ్‌సూట్‌లో కనిపించకూడదు, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లు ధరించకూడదు” అన్న తల్లి మాటలను జీవితాంతం పాటించారు. అమ్మకి ఇచ్చిన మాట కోసం ఎలాంటి లో దుస్తులు వేసుకోకుండా ఉందంటే .. ఇక్కడే తెలుస్తుంది కదా ఆమె వ్యక్తిత్వవం. ఆమె అందం, హావభావాలు, ఆకర్షణీయమైన దుస్తులతో ఫ్యాన్స్ ను మెప్పించారు. “ప్రేక్షకులు ఎప్పుడూ నటీమణులను అందంగా చూడాలనుకుంటారు, కాబట్టి మేకప్ లేకుండా బయటకు రావడం నాకు ఇష్టం లేదు” అని ఆమె ఓ సందర్భంలో చెప్పారు.

 

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ