Bandi Vs Bhumana
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Tirumala: టీటీడీపై బండి సంజ‌య్ వ్యాఖ్యల్లో నిజమెంత.. రగులుతున్న తెలుగు రాష్ట్రాలు!

Tirumala: అవును.. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమే సృష్టిస్తున్నాయి. ఇప్పుడీ కామెంట్స్‌ తీవ్ర చర్చకు దారితీశాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో వెయ్యి మంది అన్య మతస్తులు ఉన్నట్లు, వారిని వెంటనే తొలగించాలని బండి సంజయ్ (Bandi Sanjay) హెచ్చరించిన సంగతి తెలిసిందే. జూలై 11న తన పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీటీడీలో (TTD) వెయ్యి మందికి పైగా అన్యమతస్థులు ఉద్యోగాలు చేస్తున్నారని, వారిని తక్షణమే తొలగించాలని తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై టీటీడీ మాజీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) స్పందించారు. బండి చేసిన వ్యాఖ్యల్లో నిజ‌మెంతో టీటీడీ అధికారులు స్పష్టం చేయాల‌ని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రిగా ఉండి ఇలా ప్రకటన చేశారంటే వారి వద్ద నివేదిక ఉందా? అని ప్రశ్నించారు.

Read Also- Tesla in lndia: భారత్‌లోకి టెస్లా ఎంట్రీ షురూ.. ప్లేసు, ముహూర్తం ఫిక్స్.. మీరు సిద్ధమేనా?

ఇంత పెద్ద నిందా?
బండి సంజ‌య్ పక్కనే టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్ (Bhanu Prakash Reddy) కూడా ఉన్నారు. కేంద్రమంత్రి బండి సంజ‌య్ మాట‌ల్ని నేను ఆక్షేపిస్తున్నాను. ఇది శ్రీవారి ఆలయంపై బండి సంజాయ్ దాడిగా ఆలోచిస్తున్నాం. టీటీడీ బోర్డు 22 మంది అన్య మతస్తులు ఉన్నారని, వారిని బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది. టీటీడీ ఈఓ, ఛైర్మన్‌లు కూడా దీనిపై ప్రకటన చేశారు. మరి బండి సంజయ్ వెయ్యి మంది అన్య మతస్తులు ఉన్నట్లు చెప్పడం భక్తుల మనోభావాలను దెబ్బతీయ‌డమే. తిరుమలపై ఇంత పెద్ద నింద‌ ఎలా వేస్తారు? సంజ‌య్ ప్రకటన ప్రకారం టీటీడీలో 20 శాతం పైగా అన్య మతస్తులే ఉన్నట్టే అర్థం. తిరుమలను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పారు. 24 గంటల అయినా ఈ ప్రకటనపై కూటమి ప్రభుత్వం, సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), టీటీడీ ఖండిస్తూ ఒక్కటంటే ఒక్క ప్రకటన కూడా ఇవ్వలేదు. అంటే బండి సంజ‌య్ చెప్పింది నిజమా? టీటీడీ 22 మంది ఉన్నార‌ని మాత్రమే ఎలా ప్రకటించింది? దీనిపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం, టీటీడీపై ఉంది. టీటీడీని, టీటీడీ ఉద్యోగస్తులను అవమానించడమే. సంజ‌య్ ప్రకటన వల్ల తిరుపతి ప్రజలు బాధపడుతున్నారు అని భూమన ఆవేదన వ్యక్తం చేశారు.

TTD

బండి ఇంకా ఏమన్నారు?
టీటీడీలో హిందూ సనాతన ధర్మంపై (Sanathana Dharma) విశ్వాసం లేని అన్యమత ఉద్యోగులు ఉండటం సరికాదని, వారిని వెంటనే ఉద్యోగాల నుండి తొలగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. గతంలో ఒక ఉద్యోగిని తొలగించినంత మాత్రాన సరిపోదని, మొత్తం అన్యమత ఉద్యోగులను గుర్తించి తొలగించాలని ప్రభుత్వం, టీటీడీని కోరారు. ‘ తిరుమల (Tirumala) దేవస్థానం హిందువుల ఆస్తి. ఇక్కడ నిజమైన భక్తి, నిబద్ధతతో పనిచేసేవారికే అవకాశం కల్పించాలి. మసీదులు, చర్చిలలో హిందువులకు ఉద్యోగాలు ఇస్తారా? టీటీడీని మాత్రం సత్రంగా భావించకూడదు. అన్యమతస్థులు టీటీడీలో పనిచేయడం వల్ల ఆచార వ్యవహారాల్లో తేడాలు వస్తున్నాయి. స్వామిపై నమ్మకం లేని వారికి జీతాలు ఎందుకు ఇస్తున్నారు? ఈ విషయంపై టీటీడీ పాలకమండలి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సమగ్ర దర్యాప్తు చేయాలి.. తక్షణ చర్యలు తీసుకోవాలి. తెలంగాణలోని కొండగట్టు, వేములవాడ, ఇల్లెందు రామాలయం వంటి ఆలయాల అభివృద్ధికి టీటీడీ సహకారం అందించాలి’ అని బండి విజ్ఞప్తి చేశారు.

Read Also- Gurugram Case: కూతుర్ని అందుకే చంపేశా.. సంచలన నిజాలు చెప్పిన రాధిక తండ్రి

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు