Telugu Cinema ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Telugu Cinema: షూటింగ్లో అలాంటి పాడు పని చేసినందుకు హీరోని చెప్పుతో కొట్టిన స్టార్ హీరోయిన్?

Telugu Cinema: తెలుగు సినీ అభిమానులకు 7/G బృందావన్ కాలనీ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీ ఒక ఎమోషనల్ కల్ట్ క్లాసిక్. ఇక ఈ చిత్రంలో రవికృష్ణ హీరోగా, సోనియా అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఊహించని ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవలే ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత ఏఎం రత్నం బయటపెట్టడంతో సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

7/G బృందావన్ కాలనీ సినిమా షూటింగ్లో ఇంత జరిగిందా?

ఈ చిత్రంలో ఒక కీలక సన్నివేశంలో రవికృష్ణ, సోనియా అగర్వాల్‌లు బస్సులో ప్రయాణిస్తూ ఉంటారు. అయితే, ఈ సీన్‌లో బస్సు డ్రైవర్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో హీరో హీరోయిన్‌పై పడిపోతాడు. అయితే, ఈ సన్నివేశం షూటింగ్ సమయంలో ఊహించని విధంగా రియల్ డ్రామాగా మారిపోయింది. బస్సు బ్రేక్ వేసిన సన్నివేశంలో రవికృష్ణ అనుకోకుండా సోనియా అగర్వాల్ మీదకి పూర్తిగా పడిపోయాడట.

Also Read: B Saroja Devi: అమ్మకి ఇచ్చిన మాట కోసం వాటికి దూరంగా ఉంది.. ఇప్పుడున్న హీరోయిన్స్ అయితే పాటించేవాళ్లే కాదు?

చేతిలోని చెప్పుతో రవికృష్ణని కొట్టిన సోనియా 

ఇక సోనియా ఒక్కసారిగా కోపంతో రగిలిపోయి, సీన్‌లో పూర్తిగా లీనమైన, రియల్ లైఫ్‌లోనూ ఆ కోపాన్ని చూపించారట . చేతిలోని చెప్పును తీసుకుని రవికృష్ణ చెంపపై గట్టిగా కొట్టిందట. ఆగండి ఆగండి అని చెబుతున్నా కూడా వినకుండా గట్టిగా కొట్టేసిందట. ఈ ఊహించని దెబ్బ రవికృష్ణకు చేదు అనుభవంగా మిగిలింది. ఆ దెబ్బ బాగా బాగా తగలడంతో రవికృష్ణ చెంప ఉబ్బి, ఆ వాపు తగ్గడానికి మూడు రోజులు సమయం పట్టిందట. దీంతో షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసి, మూడు రోజులపాటు పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది.

Also Read: Congress leaders: ఆ జిల్లాల్లో ఎక్కువ కొట్లాటలు కార్యకర్తలు లీడర్లలో సమన్వయం కొరవ

ఏఎం రత్నం మొత్తం చెప్పేశాడుగా.. 

ఏఎం రత్నం ఈ ఘటనను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంటూ, ఆ సమయంలో జరిగిన సంఘటనను నవ్వుతూ పంచుకున్నారు. అయితే, ఈ ఘటన 7/G బృందావన్ కాలనీ సినిమా షూటింగ్‌లో ఒక చిరస్థాయి జ్ఞాపకంగా మిగిలిపోయిందని చెప్పారు. సినిమా విజయం, రవికృష్ణ-సోనియా జోడీ కెమిస్ట్రీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నప్పటికీ, ఈ బస్సు సీన్ ఘటన సినీ లవర్స్ కు ఒక ఆసక్తికరమైన, హాస్యాస్పదమైన గుర్తుగా నిలిచిపోతుంది.

Also Read:  Kota Srinivas Rao Death: కోట శ్రీనివాసరావు మృతికి వాళ్లే కారణమా? అవకాశాలు అడిగినా ఇవ్వలేదా?

Just In

01

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్