Warangal Crime: ఘోరం.. పక్కా ప్లాన్‌తో భర్తను లేపేసిన భార్య!
Warangal Crime (Image Source: AI)
క్రైమ్

Warangal Crime: రాష్ట్రంలో ఘోరం.. పక్కా ప్లాన్‌తో భర్తను లేపేసిన భార్య.. ఎలాగంటే?

Warangal Crime: వివాహ బంధాలు నానాటికి బలహీన పడుతున్నాయి. ఎంతో అన్యోన్యంగా ఉండాల్సిన భార్య భర్తలు.. ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్తున్నారు. తద్వారా ఎంతో పవిత్రమైన పెళ్లి అనే బంధానికి తూట్లు పొడుస్తున్నారు. భర్తను భార్య, భార్యను భర్త హత్య చేసుకుంటున్న ఘటనలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి. తాజాగా రాష్ట్రంలోనూ ఈ తరహా దారుణం చోటుచేసుకుంది. ఓ భార్య తన భర్తను పక్కా ప్లాన్ తో హత్య చేసింది.

వివరాల్లోకి వెళ్తే..
తెలంగాణ (Telangana)లోని వరంగల్ జిల్లా వర్ధన్నపేట (Wardhannapet)లో దారుణం జరిగింది. ఓ భార్య తన భర్తకు మరణ శాసనం రాసింది. కూల్ డ్రింక్ లో గడ్డి మందు కలిపి భర్తను హత్య చేసింది. భవానికుంట తండాకు చెందిన బాలాజీ (40), కాంతి (Kanthi) భార్య భర్తలు. ఈ నెల 8వ తేదీన దాటుడు పండగ సందర్బంగా భర్త (Balaji)ను హత్య చేయాలని కాంతి కుట్ర పన్నింది. ఇందులో భాగంగా మద్యంలో కూల్ డ్రింక్ కలుపుకొని తాగాలని భర్తకు చెప్పింది.

Also Read: Ravi Teja: రవితేజ ఇంట్లో తీవ్ర విషాదం.. ఆ ఇద్దర్ని ఒకేసారి కోల్పోయిన హీరో?

పరారీలో భార్య
భార్య మాటలు నమ్మిన బాలాజీ.. ఆమె ఇచ్చిన కూల్ డ్రింక్ (Cool Drink) ను మద్యంలో కలుపుకొని తాగాడు. కొద్దిసేపటి తర్వాత గొంతులో మంట రావడంతో అరుపులు, కేకలు వేశాడు. భర్త చనిపోతాడని భావించిన కాంతి.. తన బావ ఇంటికి వెళ్లిపోయింది. అయితే బాలాజీ అరుపులు విన్న స్థానికులు.. అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం బాలాజీ కన్నుమూశారు. మృతుని తండ్రి హరిచంద్ (Hari Chand)ఫిర్యాదు మేరకు వర్ధన్నపేట పోలీసులు (Wardhannapet Police)కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న కాంతం, ఆమె బావ దశరుల కోసం గాలిస్తున్నారు.

Also Read This: MP Chamal Kiran Reddy: లక్కులో గెలిచిన నువ్వు కాంగ్రెస్‌ను ఓడిస్తావా?

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..