Pushpa Movie Editor Anthoni S Ruben Left
Cinema

Pushpa: ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న పుష్ప ఎడిటర్‌

Pushpa Movie Editor Anthoni S Ruben Left: టాలీవుడ్ సర్కిల్స్‌లో ఏ వార్త అయినా సరే యమ హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. ఇక ఇదిలా ఉంటే కోట్లాదిమంది ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అంటూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న మూవీ పుష్ప 2 ది రూల్. గతంలో సుకుమార్ బన్నీ కాంబోలో తెరకెక్కిన ఈ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఆల్‌మోస్ట్ మూవీకి సంబంధించిన షూటింగ్ అంతా కంప్లీట్ చేసేసారు సుకుమార్.

అడపాదడపా..అక్కడక్కడ కొన్ని సీన్స్ తప్పా, మిగతా షెడ్యూల్ అంతా కంప్లీట్ అయింది. ఈ మూవీ ప్రమోషన్స్‌ని కూడా వేరే లెవెల్‌లో చేయాలంటూ సుకుమార్ కమిట్ అయ్యాడు. దానికోసం అంతే విధంగా కష్టపడుతున్నారు. రీసెంట్‌గా పుష్ప2 నుంచి ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లీక్ అయి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. పుష్ప2 మూవీ నుంచి ఎడిటర్ ఆంటోనీ రూపేన్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. అసలు ట్విస్ట్ ఏంటంటే పుష్పకి అతనే ఎడిటర్‌గా వర్క్ చేసాడు. అయితే పుష్ప2 విషయంలో మాత్రం కొన్ని మనస్పర్ధలు రావడంతో ఆంటోని తప్పుకున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

Also Read:అతనిలో అవన్నీ ఉన్నాయి

ఆంటోనీ రూబెన్‌కి బదులుగా నవీన్ పుష్ప 2కి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారట. ఈ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది. నవీన్ నులి విషయానికి వస్తే సుకుమార్ డైరెక్షన్‌లో గతంలో తెరకెక్కిన నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలకు కూడా ఎడిటర్‌గా వర్క్ చేశారు. ఏదేమైనా ప్రస్తుతం ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్‌లో బాగా ట్రెండ్ అవుతుంది. చూడాలి మరి ఇంక ముందు ముందు ఇంకెన్నీ సీన్‌లు చూడాల్సి వస్తుందో అంటూ ఈ వార్త విన్న నెటిజన్స్‌ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?