Janvi Kapoor latest updates(Bollywood celebrity news):
టాలీవుడ్ అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయం కలబోసిన కలువ. ప్రతి ఒక్కరూ ఆమె అందానికి ఫిదా అయిపోవాల్సిందే మరి. తన మత్తు కళ్లతో కుర్రకారు మనసులు దోచుకుంటోంది. త్వరలో టాలీవుడ్ తొలి ఎంట్రీ మూవీ దేవర తో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. అలాగే రామ్ చరణ్ సినిమాలోనూ గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుని వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. అయితే కాబోయే జీవిత భాగస్వామి గురించి చెబుతూ ఇద్దరూ వేర్వేరు కుటుంబాల నుంచి వచ్చి వేర్వేరు స్వభావాలతో ఉంటారు. వ్యక్తిగత జీవితంలో అలా ఉండాలి, ఇలా ఉండాలంటూ ఎక్స్ పెక్టేషన్స్ తో ఉంటారు. అయితే తన అభిరుచులకు తగిన వాడు దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటామని చెబుతుంటారు కథానాయికలు. తాజాగా జాన్వీ కపూర్ కూడా తన కాబోయేవాడి గురించి ఎలా ఉండాలో చెబుతోంది. తన కలలని అతగాడి కలలుగా భావించాలట. ఎప్పటికీ సంతోషాన్ని పంచేవాడుగా ఉండాలి. తనని నవ్వించేవాడు కావాలి. ఎప్పుడూ మూడీగా ఉండకూడదంటోంది జాన్వీ. ఆ లక్షణాలు ఉన్న అబ్బాయినే తాను పెళ్లిచేసుకుంటానంటోంది జాన్వీ.
బాయ్ ఫ్రెండ్ తో పీకల్లోతు ప్రేమలో..
అలాగే తను భాధలో ఉన్నప్పడు దైర్యం చెప్పగలగాలి అంటోంది.ప్రతీ విషయంలో అండగా నిలవాలి. ఇవన్నీ జీవిత భాగస్వామి విషయంలో తప్పనసరిగా చేసినట్లు చెప్పుకొచ్చింది. ఇంతవరకూ బాగానే ఉంది. మరి జాన్వీ బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాలో ఇవన్నీ ఉన్నాయా? అన్నది చెక్ చేయాలి సుమీ అంటున్నారు సినీ అభిమానులు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు అయిన శిఖర్ పహారియాతో ఈ బ్యూటీ పీకల్లోతు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. జాన్వీ కొంత కాలంగా అతగాడి ప్రేమలో ఉన్నట్లు కథనాలు వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ టాక్ షోలో సైతం పహారియా ఫోన్ నెంబర్ కి ఉన్న ప్రయార్టీ గురించి ఓపెన్ అయింది. ఇక ముంబై లో చూసినా…ఇతర రాష్ట్రాల్లో చూసినా వీరిద్దరే కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఇద్దరు గుళ్లు, గోపురాలు చుట్టేస్తోన్న వైనం కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. జాన్వీకి ఖాళీ దొరికితే చాలు ప్రియుడిని వెంటేసుకుని దేవాలయాలన్నింటిని చుట్టేస్తోంది. మరి ఇవన్ని దేనికి ఇండికేషన్? జాన్వీ కోరుకున్న లక్షణాలన్ని శిఖర్ పహారియాలో ఉన్నాయా? లేక కొన్నాళ్ల పాటు కొనసాగే రిలేషన్ షిప్ మాత్రమేనా? అన్నది తేలాల్సిన విషయం.