Saina Nehwal ( Image Source: Twitter)
Viral, ఎంటర్‌టైన్మెంట్

Saina Nehwal Divorce: షాకింగ్.. వివాహ బంధానికి గుడ్ బై చెప్పిన సైనా నెహ్వాల్.. పోస్ట్ వైరల్

Saina Nehwal Divorce: ఇండియాలో సెలబ్రిటీల విడాకులు ఇప్పుడు సర్వసాధారణంగా మారాయి. చిన్న చిన్న కారణాలతోనే సినీ, క్రీడా రంగాల్లోని ప్రముఖులు విడిపోతున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో క్రీడాకారుల విడాకుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా, భారత బ్యాడ్మింటన్ స్టార్ జంట సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌లు తమ విడాకులను అధికారికంగా ప్రకటించారు, ఇది అందరినీ షాక్‌కు గురిచేసింది.

Also Read: Kota Srinivasa Rao: ఆ శాపం వేటాడిందా.. అందుకే కోట శ్రీనువాసరావు జీవితంలో అలా జరిగిందా ?

సైనా నెహ్వాల్ కూడా విడాకులు తీసుకుంటుందా ? ఇది అస్సలు నమ్మలేకపోతున్నాం అంటూ పోస్ట్ చూసే వరకు నమ్మడం లేదు. సోషల్ మీడియా వేదికగా ఈ నిర్ణయాన్ని వెల్లడిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. “జీవితం అద్భుతమైనది, కానీ కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. చాలా ఆలోచనలు, చర్చల తర్వాత నేను, కశ్యప్‌లు విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాము. శాంతి, వృద్ధి, ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాము. గత జ్ఞాపకాలకు కృతజ్ఞతలు, భవిష్యత్తులో ఇద్దరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా,” అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.

Also Read: Kota And Naga Babu: ఎప్పుడు ఉంటాడో.. ఎప్పుడు ఊడిపోతాడో తెలియదు దారుణంగా అవమానించిన నాగ బాబు

2018లో ప్రేమ వివాహం చేసుకున్న సైనా, కశ్యప్‌లు హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో కలిసి శిక్షణ పొందారు. వారి ఏడేళ్ల వైవాహిక జీవితం ఇప్పుడు ముగిసింది, ఇది క్రీడా ప్రపంచంలో సంచలనం సృష్టించింది. సైనా ఒలింపిక్ కాంస్య పతక విజేతగా, ప్రపంచ నంబర్ 1 ర్యాంక్ సాధించిన ఏకైక భారత మహిళా షట్లర్‌గా చరిత్ర సృష్టించగా, కశ్యప్ 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించారు.

Also Read:  YSRCP: ‘స్వేచ్ఛ’ ఎఫెక్ట్.. వైసీపీని వీడటంపై ధర్మాన ఫుల్ క్లారిటీ.. మనసులో మాట బయటికొచ్చిందే!

విడాకుల గురించి కశ్యప్ ఇంకా ఎలాంటి పోస్ట్ పెట్టలేదు అలాగే  స్పందించలేదు. అయితే, ఈ జంట విడిపోవడం అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ విషాదకర నిర్ణయం వెనుక ఉన్న కారణాలు ఇంకా స్పష్టంగా బయటకు రాలేదు, కానీ వారి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది.

Just In

01

Wine Shop Lottery: నేడే మద్యం షాపులకు లక్కీ డ్రా.. ఆశావహుల్లో ఉత్కంఠ

Gold Price Today: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు?

DSP Bribery Case: ఏసీబీలో కలకలం రేపుతున్న డీఎస్పీ వసూళ్ల వ్యవహారం

Mahabubabad District: మహబూబాబాద్‌లో కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు

Maoist Ashanna: మావోయిస్టు ఆశన్న సంచలన వీడియో.. ఏమన్నారంటే..?