Dharamana Prasad
ఆంధ్రప్రదేశ్

YSRCP: ‘స్వేచ్ఛ’ ఎఫెక్ట్.. వైసీపీని వీడటంపై ధర్మాన ఫుల్ క్లారిటీ.. మనసులో మాట బయటికొచ్చిందే!

YSRCP: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నాటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YSR) నుంచి నేటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) వరకూ వైఎస్ ఫ్యామిలీతోనే ధర్మాన ఉన్నారు. ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ కూడా ఇంచుమించు అంతే. అయితే.. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో, కనీసం కార్యకర్తలతో మాట్లాడటానికి ఎందుకో ధర్మాన సాహసించలేదు. అంతేకాదు పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారని.. వైసీపీని వీడి జనసేన (Janasena) తీర్థం పుచ్చుకుంటారని జోరుగానే ప్రచారం జరిగింది. అయితే ఇందులో నిజానిజాలెంత..? ఒకవేళ పార్టీ మారితే ఎందుకు మారాల్సి వస్తోంది..? ఏ విషయంలో ధర్మాన అసంతృప్తిగా ఉన్నారు? తనను తండ్రిగా భావిస్తున్న అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఎందుకు హ్యాండిచ్చేయాలని భావిస్తున్నారు? ఇలా అన్ని విషయాలను ఎంతో విశ్లేషాణత్మకంగా.. ‘వైసీపీకి ‘పెద్ద తలకాయ’ గుడ్ బై.. జగన్ ముఖచిత్రమేంటో? అని సంచలన కథనాన్ని రాసింది. ఈ కథనం శ్రీకాకుళం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనమే సృష్టించింది. ఆ నోటా ఈ నోటాపడి చివరాఖరికి ధర్మాన చెవిన పడింది. దీంతో ‘స్వేచ్ఛ’ కథనంపై ధర్మాన స్పందిస్తూ పార్టీ మార్పుపై ఫుల్ క్లారిటీ ఇచ్చుకున్నారు.

Read Also- YSRCP: వైసీపీకి ‘పెద్ద తలకాయ’ గుడ్ బై.. జగన్ ముఖచిత్రమేంటో?

Dharmana Prasada Rao

మాజీ మంత్రి ఆవేదన..
శ్రీకాకుళంలోని స్థానిక వైసీపీ కార్యాలయంలో శనివారం విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మాన బ్రదర్స్, ప్రసాదరావు కుమారుడు రామ్ మనోహర్ నాయుడుతో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొన్న ధర్మాన ప్రసాదరావు సుదీర్ఘ ప్రసంగం చేశారు. పనిలో పనిగా వైసీపీకి గుడ్ బై చెబుతున్నట్లుగా వస్తున్న వార్తలపైన, తన మనసులోని మాటలన్నింటినీ బయటపెట్టేశారు. ‘ నేను ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయను.. విధాన సంబంధం అయిన విమర్శలు మాత్రమే చేస్తాను. పార్టీ ఆదేశిస్తే నేను శ్రీకాకుళం పార్లమెంట్‌కు పోటీ చేస్తాను. లేదా నా బదులు మరొకరికి నాయకత్వం ఇస్తే వారికి మద్దతు ఇస్తూ ప్రోత్సహిస్తూ పనిచేస్తాను. నేను పార్టీ మారుతానని ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ నిజం కావు. నా సైన్యాన్ని వదిలి వాళ్లతో మాట్లాడకుండా రాజకీయ రంగంలో యుద్ధం ఎలా చేయగలను. మీరంతా ఒక్కసారి ఆలోచించాలి. మీరు ప్రభుత్వానికి బాకాలు ఊదే పత్రికలను చదవొద్దు. నిరాధార క‌థ‌నాలు అస్సలు న‌మ్మవ‌ద్దు. వాటి కారణంగా నిజానిజాలు తెలియవు. ఇవాళ ఒక్కో పత్రిక వెనుక ఒక్కో యాజమాన్యం ఉంది. వాళ్ల ఆలోచనలకు అనుగుణంగానే అవి నడుస్తున్నాయి. ఆవిధంగా కాకుండా నిజానిజాలు తెలుసుకుని, నిర్థారించుకుని ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చేందుకు కృషి చేయండి’ అని ప్రజలు, పార్టీ శ్రేణులకు ధర్మాన పిలుపునిచ్చారు.

Swetcha Effect Dharmana

నేనొస్తా.. పవన్ నోరు విప్పరేం?
నేను రాలేదు.. నేను రాలేదు అని అనడం కాదు. నేను తప్పకుండా వస్తాను. మీరు క్షేత్ర స్థాయిలో పనిచేయడం అన్నది ఎంతో ముఖ్యం. ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో వెయ్యి మందిని భాగం చేస్తే, ఎన్నికల నాటికి లక్ష మంది అవుతారు. ఆ రోజు సచివాలయ వ్యవస్థలో నిష్పక్షపాతంగా పోస్టింగులు ఇచ్చాం. కానీ, ఇవాళ బదిలీల పేరిట ముడుపులు చెల్లిస్తే కానీ పని కావడం లేదు. ఆ రోజు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సచివాలయంలో ఉద్యోగ అవకాశం ఇచ్చాం. రాజకీయ అవినీతికి తావులేకుండా ఆ రోజు పనిచేశాం. కానీ, ఇప్పుడు డబ్బులు చెల్లిస్తే కానీ బదిలీలు కావడం లేదు. డబ్బులు చెల్లించి పోస్టులు వేయించుకుంటున్న వైనం వెలుగు చూస్తోంది. ఎన్నికల ముందే చెప్పం వలంటీర్లు ఎవ్వరైనా టీడీపీకి ఓటు వేస్తే బోడి గుండు మిగులుతుంది అని ఇవాళ అదే జరిగింది. ప్రజలను నిలువునా మోసం చేసిన ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. అత్యంత వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాను టీడీపీ ఎప్పటికప్పుడు మోసం చేస్తూనే ఉంది. ఈ ప్రాంత అభివృద్ధిపై అస్సలు దృష్టి సారించిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. కనీసం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గొంతు విప్పి మాట్లాడలేకపోతున్నారు. బీజేపీ అయితే ఎన్నికలకు ముందే చంద్రబాబు (Chandrababu) ప్రకటించిన మేనిఫెస్టోతో మాకేంటి సంబంధం అని సభాముఖంగానే వాళ్ల నాయకులు సైడ్ అయిపోయారు. అంటే ఇది టీడీపీ ప్రభుత్వం అని ధర్మాన దుయ్యబట్టారు. చూశారుగా.. ‘స్వేచ్ఛ’ కథనంతో ధర్మాన రియాక్ట్ కావడంతో పాటు ఫుల్ క్లారిటీ ఇచ్చుకున్నారు. అంతేకాదు.. తాను ఎంపీగా పోటీచేయాలని అనుకుంటున్నట్లుగా మనసులోని మాటను కూడా బయటపెట్టారు.. ఇప్పుడిక జగన్ ముఖ చిత్రమేంటో ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి మరి.

Read Also- Viral News: సెల్ఫీ దిగుదామని భర్తను నదిలోకి తోసేసిన భార్య.. సీన్ కట్ చేస్తే..!

Just In

01

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!