YSRCP: ఓ వైపు టీడీపీ నుంచి నేతలు వచ్చి వైసీపీలో చేరుతున్నారో ఆనందపడాలో.. ఇక్కడున్న రైట్, లెఫ్ట్ హ్యాండ్లు.. అంతకుమించి ముఖ్యనేతలు జంప్ అవుతున్నారని బాధపడాలో తెలియని పరిస్థితిలో ఫ్యాన్ పార్టీ క్యాడర్ ఉన్నది. తెలుగుదేశం (TDP) కీలక నేత, నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఫ్యామిలీ నుంచి సుగవాసి సుబ్రమణ్యం సైకిల్ దిగి.. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ చేరిక జరిగిన 24 గంటలు కూడా గడవక మునుపే షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) జనసేన (Janasena) వైపు చూస్తున్నారన్నదే ఆ వార్త సారాంశం. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి వైసీపీ ఘోర పరాజయం పాలైన తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య జగన్ ఉత్తరాంధ్ర పర్యటనలో ఒకే ఒక్కసారి కనిపించారు. ఇక యాక్టివ్ అవుతారని అందరూ భావించారు కానీ, ఎందుకో ఆయన ఇంకా మౌనంగానే ఉన్నారు.
ఎందుకనీ..?
వైఎస్ జగన్ మెచ్చిన అతికొద్ది నేతల్లో ధర్మాన ఒకరు. వైఎస్ హయాం నుంచి జగన్ వరకూ ఆయన ఆ కుటుంబానికి ఎంతో ఆప్తుడు. నాడు వైఎస్సార్ (YSR) ఎంత ప్రాధాన్యత ఇచ్చారో.. వైసీపీ హయాంలో జగన్ కూడా అంతకుమించే గౌరవం ఇచ్చారు. మరీ ముఖ్యంగా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన.. రావాలనుకుంటున్న వారు ధర్మానను ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఆయన అసెంబ్లీలో మాట్లాడినా.. ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొన్నా ప్రసంగం కోసం ఎక్కడెక్కడ నుంచో వచ్చి వినేవాళ్లు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. వైఎస్ జగన్ కూడా అసెంబ్లీలో ధర్మానకు ఎక్కువ కేటాయించడం, ఆయన ఎలా మాట్లాడుతారా? అని తథేకంగా చూడసాగిన సందర్భాలు కోకొల్లలు. ముఖ్యంగా ఉద్దానం గురించి ధర్మాన మాట్లాడిన మాటలు ఎవర్‌గ్రీన్ అంతే. ఎందుకంటే ఆయనుకున్న సబ్జక్ట్, విషయ పరిజ్ఞానం.. అనుభవంతో మాట్లాడే మాటలు అలాంటివి. యూత్‌కు ఎక్కువగా నచ్చే.. వాళ్ల మనసు దోచిన ధర్మానకు జగన్ కేబినెట్‌లో కీలకమైన రెవెన్యూ శాఖ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఎందుకో వైసీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. అయితే ఆయన.. జనసేన వైపు చూస్తున్నారన్న వార్తలు కేవలం ఊహాగానాలే అని తీసిపడేయడానికి లేదు. వాటికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also- Congress: జూబ్లీహిల్స్‌పై ఏఐసీసీ సర్వే.. ఎవరి మైలేజ్ ఎంత?
కొడుకు కోసమే..?
ధర్మాన తన రాజకీయ వారసత్వాన్ని కుమారుడు రామ్ మనోహర్ నాయుడికి అప్పగించాలని చూస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఆయన స్వయంగా పోటీ చేసి ఓడిపోవడం, ఇప్పుడు వయసు 66 ఉండటం.. పెరిగే కొద్దీ రాజకీయాల్లో చురుకుగా ఉండలేకపోవడం వంటి కారణాలతో కుమారుడికి సురక్షితమైన రాజకీయ వేదికను కల్పించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి తోడు వైసీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని.. బలోపేతం అయ్యే పరిస్థితి ఏ మాత్రం కనిపించట్లేదని ఆయన భావించినట్లుగా సమాచారం. టీడీపీలో (TDP) కింజరపు కుటుంబం బలంగా ఉండటంతో అక్కడ తన కుమారుడికి తగిన ప్రాధాన్యత దక్కదని, జనసేన అయితేనే సాధ్యమవుతుందని ధర్మాన భావిస్తున్నారని తెలుస్తోంది. ఎందుకంటే.. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ధర్మాన కుటుంబానికి బలమైన పట్టు ఉంది. గతంలో అనేకసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ధర్మాన ప్రసాదరావు విజయం సాధించిన అనుభవం ఉంది. అందుకే.. జనసేనలోకి వెళ్తే, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నాయకత్వంలో తన కుమారుడు జిల్లాలో పార్టీని పటిష్టం చేయవచ్చని, తద్వారా తమ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించవచ్చని ధర్మాన భావిస్తున్నట్లు సమాచారం.
Read Also- Chiranjeevi: ప్లీజ్.. చిరంజీవి ఇజ్జత్ తీయకండ్రా!
వింటారా.. ఉంటారా?
ఇదిలా ఉంటే.. ధర్మాన సోదరుడు కృష్ణదాస్ వైసీపీలోనే కొనసాగుతున్నారు. ఈ మధ్యనే యాక్టివ్ అవుతున్నారు కూడా. అయితే, అన్నదమ్ముల మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయని, ఇది కూడా ప్రసాదరావు వైసీసీ నుంచి వైదొలగడానికి ఒక కారణం కావచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే.. వైసీపీ అధిష్టానం మాత్రం ధర్మానను వదులుకోవడానికి సిద్ధంగా లేదని.. సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, కృష్ణదాస్‌తో ఇతరుల ద్వారా మంతనాలు జరుపుతోందని సమాచారం. ధర్మాన త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ధర్మాన అనుచరులు, కార్యకర్తలు కూడా ఆయన మనసులో ఏముందో తెలియక అయోమయంలో ఉన్నారు. ఈ మౌనానికి బలమైన కారణం తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసమే అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా.. ధర్మాన ప్రసాదరావు తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని పక్కనపెట్టి, తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసమే వైసీపీ గుడ్ బై చెప్పే నిర్ణయం తీసుకోవచ్చని ఊహాగానాలు బలంగా ఉన్నాయి. వైసీపీ రాయబారం, మంతనాలు ఏ మాత్రం పనిచేస్తాయో..? ధర్మాన అసలు ఉంటారో.. ఈ మాటలు వింటారో చూడాలి మరి.
Read Also- Kayadu Lohar: ‘పిక్కలు చూశావా.. భయ్యా’.. డైలాగ్ చెప్పకుండా ఉండగలరేమో ట్రై చేయండి!