Kota Srinivas Rao Death ( Image Source : Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Kota Srinivasa Rao: ఆ శాపం వేటాడిందా.. అందుకే కోట శ్రీనువాసరావు జీవితంలో అలా జరిగిందా ?

 Kota Srinivasa Rao: సినీ పరిశ్రమలో మరో దిగ్గజం కన్నుమూశారు. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణం ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచెత్తింది. ఆయన భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. అయితే, ఈ విషాద సమయంలో కోట జీవితంలోని ఒక ఆసక్తికరమైన, కానీ బాధాకరమైన విషయం బయటపడింది. అదే ఆయన కుటుంబాన్ని వెంటాడిన ‘శాపం’ గురించిన చర్చ.కోట శ్రీనివాసరావుకి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు.

Also Read: Kota Srinivasa Rao: ఆ శాపం వేటాడిందా.. అందుకే కోట శ్రీనువాసరావు జీవితంలో అలా జరిగిందా ?

కొన్నేళ్ల క్రితం, ఆయన కూతురు ఒకరు రిక్షా ఎక్కాలనే కోరికతో విజయవాడలో రిక్షాలో ప్రయాణించారు. అయితే, దురదృష్టవశాత్తూ, బ్రేకులు ఫెయిలైన లారీ ఆ రిక్షాని ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. అదృష్టవశాత్తూ, కోట కూతురు ప్రాణాలతో బయటపడినప్పటికీ, ఆమె కాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన ఆ కుటుంబాన్ని కమ్మిన బాధ నీడలా మిగిలిపోయింది.

Also Read: Tollywood: ఇండస్ట్రీకే కాదు.. ఇండియన్ సినిమాకు తీరని లోటు.. కోట మరణంపై తెలుగు సెలబ్రిటీల సంతాపం

అయితే, ఈ దుఃఖం నుంచి కోట కుటుంబం ఇంకా కోలుకోకముందే మరో విషాదం వారిని వెంటాడింది. కొద్ది సంవత్సరాల తర్వాత, కోట కొడుకు కూడా ఓ రోడ్డు ప్రమాదంలోనే తుదిశ్వాస విడిచారు. వరుసగా కూతురు, కొడుకు రోడ్డు ప్రమాదాల బారిన పడటంతో, కోట శ్రీనివాసరావు కుటుంబాన్ని ఏదో ‘శాపం’ వెంటాడుతోందనే చర్చ జనంలో మొదలైంది. ఈ విషాద సంఘటనలు ఆయన జీవితంలోని బాధాకరమైన అధ్యాయాలుగా మిగిలిపోయాయి. ఈ ‘శాపం’ గురించిన నిజానిజాలు ఎప్పుడు బయటపడతాయో తెలియదు, కానీ కోట శ్రీనివాసరావు సినీ రంగానికి అందించిన కృషి, ఆయన నటనా పాటవం ఎప్పటికీ  గుర్తుండిపోతుంది.

Also Read:  Indian Origin Couple: అమెరికా నుంచి వచ్చేస్తామన్న భారత జంట.. నెటిజన్ల షాకింగ్ రియాక్షన్!

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?