Fire Crime (imagecredit:swetcha)
క్రైమ్

Fire Crime: నారాయణపేట జిల్లాలో దారుణం.. మంటల్లో చిక్కుకున్న బాలిక చివరికి!

Fire Crime: ప్రమాదవశాత్తు ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్‌తో అంద బాలిక సజీవ దహనమైన ఘోర సంఘటన మక్తల్ పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. నారాయణపేట జిల్లా(Narayanpet District) మఖ్తల్ పట్టణ కేంద్రంలోని నందిని నగర్ కాలనీకి చెందిన కిష్టప్ప అనే వ్యక్తి ఇంట్లో ప్రమాదవశాత్తు వంట గదిలో హీటర్ ద్వారా షార్ట్ సర్క్యూట్ కావడంతో ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం అంటుకొని పెద్ద ఎత్తున మంటలతో పాటు దట్టమైన పొగ వ్యాపించడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న కళ్ళు కనిపించని, మతిస్థిమితం లేని అందురాలైన 13 సంవత్సరాల భానుప్రియ(Banupriya) అనే బాలిక మంటల్లో చిక్కుకొని సజీవ దహనమైంది.

ప్రమాదాన్ని గుర్తించలేకపోవడంతో
అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో మృతురాలు భానుప్రియతో పాటు అదే ఇంట్లో తన చెల్లెలు భవ్య శ్రీ, తమ్ముడు భాను ప్రసాద్,తన మేనత్త కొడుకు కూడా ఉన్నారు. కానీ ఇంట్లో ప్రమాదం జరిగిందని గుర్తించి ఇంట్లో నుంచి వారు బయటకు వచ్చి పక్కనే రూమ్‌లో ఉన్న మృతురాలు నానమ్మకు ఇంట్లో మంటలు పొగలు వస్తున్నాయని తెలియజేశారు. అయితే మృతురాలు భానుప్రియ అందురాలు కావడంతో ఇంట్లో జరిగిన ప్రమాదాన్ని గుర్తించలేకపోవడంతో మంటల్లో చిక్కుకొని పూర్తిగా కాలిపోయిందని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది(Firefighters) మంటలను ఆర్పి సహాయక చర్యలు చేపట్టారు. మఖ్తల్ పట్టణంలోని నందిని నగర్ కాలనీకి చెందిన ఈసరి కిష్టప్ప, సుజాత దంపతులకు ఇద్దరు కూతురులు భానుప్రియ, భవ్యశ్రీ , ఒక కుమారుడు భాను ప్రసాద్ సంతానం కలదు.

Also Read: MLA Raja Singh: బీఆర్ఎస్ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వార్తలొస్తున్నాయి

వంటగదిలో షార్ట్ సర్క్యూట్
అందురాలైన భానుప్రియను చిన్న కూతురు కొడుకుతో వదిలేసి భార్యభర్త ఇద్దరు రోజువారీగా పనులకు వెళ్ళిపోయారు. వెళ్లగా మృతురాలు భానుప్రియ ఉదయం నుండి అందరితో పాటు కలిసి ఆడుకుంటూ ఉంది మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఇంట్లో ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదాన్ని పసిగట్టి చెల్లెలు తమ్ముడు తన మేనత్త కొడుకు పరుగులు తీశారు. భానుప్రియకు మతిస్థిమితం, కళ్ళు కనిపించకపోవడంతో వంటగదిలో షార్ట్ సర్క్యూట్(Short circuit) ద్వారా జరిగిన ప్రమాదాన్ని పసికట్ట లేక దట్టమైన పొగ మంటల్లో సజీవ దహనం కావడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సమాచారం తెలుసుకున్న సీఐ రాంలాల్ రాథోడ్, ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి తన పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.

Also Read: GHMC: పాత్రధారులపైనే చర్యలు.. సూత్రధారుల సంగతేంటి?

 

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?