Tollywood ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Tollywood: ఇండస్ట్రీకే కాదు.. ఇండియన్ సినిమాకు తీరని లోటు.. కోట మరణంపై తెలుగు సెలబ్రిటీల సంతాపం

Tollywood: తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనా ప్రతిభతో వందలాది చిత్రాల్లో మెరిసిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఆదివారం ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో కన్నుమూశారు. ఈ క్రమంలోనే తెలుగు సెలెబ్రిటీలు అతని మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.

ఇండస్ట్రీకి మాత్రమే కాదు ఇండియన్ సినిమాకు తీరని లోటు.. సాయి ధరమ్ తేజ్ 

విలక్షణ నటుడు, శ్రీ కోట శ్రీనివాసరావు గారి మరణం తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే కాదు ఇండియన్ సినిమాకు తీరని లోటు. ఎన్నో సినిమాలలో ఆయన నటన అద్భుతం. స్క్రీన్ మీద కొన్నిసార్లు భయపెట్టి.. ఇంకొన్నిసార్లు చిరాకు తెప్పించి.. మరికొన్నిసార్లు కడుపులు చెక్కలయ్యేలా నవ్వించి.. చివరికి ఇలా మనకు బాధ మిగిల్చి వెళ్లిపోయారు కోట. ఆయన గురించి చెప్పేంత అనుభవం నాకు లేదు కానీ.. అలాంటి నటుడు మళ్లీ తెలుగు ఇండస్ట్రీకి దొరకరు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.

తెలుగు సినీ రంగం ఒక మహానటుడిని కోల్పోయిందినందమూరి కళ్యాణ్

నందమూరి కళ్యాణ్ రామ్ ” తెలుగు సినీ రంగం ఒక మహానటుడిని కోల్పోయింది. కోట శ్రీనివాస రావు గారు చూపిన నటన, విభిన్నమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను ” అంటూ తన ట్విట్టర్ లో రాసుకొచ్చాడు.

ఆయనతో నటించిన, పంచుకున్న క్షణాలు ఎప్పటికీ చిరస్మరణీయం.. జూనియర్ ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ ” కోట శ్రీనివాసరావు గారు… ఆ పేరే చాలు. ఎనలేని నటనా చాతుర్యం.ప్రతి పాత్రలో తనదైన శైలిలో ప్రాణం పోసిన మహానటుడు. నా సినీ ప్రయాణంలో ఆయనతో నటించిన, పంచుకున్న క్షణాలు ఎప్పటికీ చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను “అంటూ తన ట్విట్టర్ లో రాసుకొచ్చాడు.

ప్రియమైన కోట, మిమ్మల్ని ఇకపై చాలా మిస్ అవుతాము.. పద్మశ్రీ డా. ఎం. మోహన్ బాబు

ఈ మేరకు డా. ఎం. మోహన్ బాబు..  ” ప్రియమైన కోట, మిమ్మల్ని ఇకపై చాలా మిస్ అవుతాము. మీ ప్రతిభ, మీ ఉనికి, మీ మంచి మనసుని ఎప్పటికీ మరిచిపోలేము. మాటల్లో చెప్పలేని దు:ఖం కలుగుతోంది.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి శక్తిని ప్రసాదించాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి ” అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!