- తెలంగాణ జానపదానికి పట్టం
- మన గాయకులకు స్వేచ్ఛ – బిగ్ టీవీ పాటాభిషేకం
- ఆగస్ట్‌లో ‘‘ది బిగ్ ఫోక్ నైట్ 2025’’ పేరుతో మెగా ఈవెంట్
- నోవాటెల్‌లో అట్టహాసంగా ప్రోమో లాంచ్
- హాజరైన జానపద రచయితలు, గాయకులు, సంగీత దర్శకులు
Big Folk Night 2025: ఉదయం లేచింది మొదలు ప్రతి పనితో పాట ముడిపడి ఉంటుంది. మనిషి మనుగడతో పాటు పాట కూడా అభివృద్ధి చెందుతూ వస్తున్నది. ప్రపంచానికి తెలియని ఎన్నో అత్యద్భుతమైన జానపదాలు వందలు, వేలు బయటికి వస్తున్నా, ఇంకా లక్షణంగా ఉండే లక్షల పాటలు మట్టిలోనే ఉండిపోయాయి. ఆ లక్షల పాటలను వెలికితీసి భావి తరాలకు అందిస్తున్న తెలంగాణ జానపద గాయకులకు పబ్బతిగట్టి ప్రింట్ మీడియా పార్టనర్‌గా ‘స్వేచ్ఛ’, ఎలక్ట్రానిక్ మీడియా పార్టనర్‌గా బిగ్ టీవీ పాటాభిషేకం చేస్తున్నాయి. పాటకు బతునివ్వడానికి బతుకుకు పాటనివ్వడానికి స్వేచ్ఛ – బిగ్ టీవీ సగర్వంగా సమర్పిస్తున్న కార్యక్రమం ది బిగ్ ఫోక్ నైట్ 2025.
ది బిగ్ ఫోక్ నైట్ 2025 లైవ్ ఫోక్ మ్యూజికల్ కాన్సెర్ట్ పోస్టర్, ప్రోమో లాంచ్ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మాదాపూర్‌లోని నోవాటెల్ హోటల్‌లో అట్టహాసంగా జరిగింది. 60 మంది తెలంగాణ జానపద రచయితలు, గాయకులు, సంగీత దర్శకులు పాల్గొని కార్యక్రమాన్ని వినోదభరితం చేశారు. ఇప్పటివరకూ జరగని ఈ కార్యక్రమానికి స్వేచ్ఛ – బిగ్ టీవీ ఒక కొత్త పంథాకు శ్రీకారం చుట్టాయి. ఎలిమెంటల్ మీడియా ద్వారా, ఎంట్రీవాలా టికెటింగ్ పార్ట్‌నర్లుగా ది బిగ్ ఫోక్ నైట్ కార్యక్రమం భారీ ఎత్తున జరగనున్నది.
ఇది మా అదృష్టం
బిగ్ టీవీ సీఈఓ అజయ్ రెడ్డి కొండా మాట్లాడుతూ, తెలంగాణ జానపదంలో ఇంకా మట్టి పరిమళం మిగిలి ఉన్నదన్నారు. తరతరాల వారసత్వం నుంచి వస్తున్న జానపదానికి తమవంతుగా ఏదైనా చెయ్యాలని తలపెట్టిన కార్యక్రమమే ది బిగ్ ఫోక్ నైట్ 2025 అని చప్పారు. ఆగస్ట్ 23న శనివారం నాడు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ కార్యక్రమ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 60 మంది తెలంగాణ జానపద కళాకారులు కలిసి ఒకే వేదికను పంచుకోవడం ఇదే మొదటిసారి అని, అలాంటి అవకాశం ఇలా తమ సంస్థ రూపంలో రావడం తమ అదృష్టమని పేర్కొన్నారు.
Read Also- Pawan Kalyan: ‘ఓజీ’ నుంచి క్రేజీ అప్డేట్… ఇక ఫ్యాన్సుకు పూనకాలే!
ఇది మాటల్లో చెప్పలేనిది..
ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ, ఒక మైకెల్ జాక్సన్, ఒక బుపెన్ హెజారికా, ఒక నూరాన్ సిస్టర్స్, ఒక రేష్మ, ఒక గద్దర్ ఒకే వేదికపై కనిపించే భాగ్యం ఈ తరం నోచుకోలేదు. కానీ, వాళ్లకు ధీటుగా, సాటిగా, మేటిగా తెలంగాణ జానపద కళాకారులు అక్షర నక్షత్రాల గాత్రులై ఒక మహా వేదికపైన ఒకే సారి కనిపిస్తే ఎలా ఉంటుందో మాటల్లో వ్యక్తీకరించలేం, తప్పకుండా చూసి తీరాల్సిందే అని చెప్పారు.
ది బిగ్ ఫోక్ నైట్ గొప్ప ప్రయత్నం
సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్ మాట్లాడుతూ, చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో తెలంగాణ జానపద గాయకులందరినీ ఒకే వేదికపై చూసే అదృష్టం చాలా అరుదుగా వస్తుదని అన్నారు. అలాంటి అరుదైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన స్వేచ్ఛ – బిగ్ టీవీకి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తనను భాగస్వామిగా చేసినందుకు ఆనందంగా ఉందన్నారు. ‘‘బిగ్ ఫోక్ నైట్ ఒక గొప్ప ప్రయత్నం. నాకు ఇందులో భాగస్వామ్యం కావడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అదృష్టంగా భావిస్తున్నా. ఎంతోమంది జానపద ఆణిముత్యాలు. మన జానపదాన్ని శిఖరాలకు చేర్చారు. ఒకప్పుడు ప్రైవేట్ ఆల్బమ్ అంటే అర్థం కాలేదు. ఇప్పుడు ఇంత పవర్ ఉందా అనిపిస్తుంది. ఈ ఈవెంట్ ఎంతోమందికి ఆలోచన కలిగిస్తుంది. ఇదొక ప్రళయంలా అన్ని భాషలను చేరుకుంటుంది’’ అని తెలిపారు. ఇక, వేదికపై మధుప్రియ, రాము రాథోడ్, కనకవ్వ ఇతరులు చేసిన జానపద పాటల, నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నది. ఊర్రుతలూగించింది.
Read Also- Baby Planning: 30 ఏళ్లు దాటాక.. పిల్లలు కష్టమే.. నిపుణుల సలహాలివే!