Baby Planning: ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని పెద్దలు అంటారు. ఒకప్పుడంటే ఉమ్మడి కుటుంబాలదే రాజ్యం. కానీ, ఈ ఆధునిక యుగంలో ఉమ్మడి కుటుంబాల సంఖ్య తగ్గిపోతున్నది. భార్యాభర్తలు మాత్రమే ఉంటున్నారు. తల్లిదండ్రులను దూరంగా ఉంచుతున్న వారు ఎందరో. కొందరైతే పిల్లలు కూడా వద్దనుకుని కెరీర్ అంటూ పరుగులు పెడుతున్నారు. ఆర్థికంగా బలోపేతం అవ్వడం కోసమే ముందు ప్రయారిటీ ఇస్తున్నారు. ఆ తర్వాతే పిల్లల గురించి ఆలోచిస్తున్నారు. మరికొందరైతే అసలు పెళ్లి జోలికే వెళ్లడం లేదు. ఇదే కొందరికి శాపంగా మారుతున్నది. వారు అనుకున్న సమయానికి పిల్లల కోసం ప్లాన్ చేస్తుంటే గర్భధారణ విషయంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ఆడవారికి 30 ఏళ్లు దాటగానే..
సాధారణంగా మగవాళ్ల కంటే మహిళలకు ఓసైట్స్(ఐవీఎం) తక్కువగా ఉంటాయి. ఆడవాళ్లకు పుట్టిన సమయంలో ఒకటి నుంచి రెండు మిలియన్ ఓసైట్స్ ఉంటాయి. యుక్త వయసుకు వచ్చేసరికి మూడు నుంచి 5 లక్షలకు పడిపోతాయి. 35 సంవత్సరాలు దాటగానే మరింత క్షీణించి 25వేలకు, 50 ఏళ్లకు వెయ్యికి చేరుకుంటాయి. ఐవీఎం పునరుత్పత్తి 21 నుంచి 30 సంవత్సరాల వయసులో చక్కగా ఉంటుంది. 35 ఏళ్ల తర్వాత అండాల నాణ్యత తగ్గుతుంది. అదే 40 ఏళ్లు దాటితే కష్టతరమే. మహిళల వయసు పెరిగే కొద్దీ అండాల సంఖ్య కూడా తగ్గుతూ ఉంటుంది. ప్రతి రుతు చక్రంలో దాదాపు వెయ్యి అండాలు పోతాయని, పరిమాణం తగ్గడమే కాకుండా అండాల నాణ్యత కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
మగవారికి ఎప్పుడంటే..
మగవాళ్లకు పునరుత్పత్తి అవకాశాలు 40 ఏళ్లు దాటగానే తగ్గడం ప్రారంభిస్తాయి. వీర్యం నాణ్యత క్రమంగా సామర్థ్యాన్ని కోల్పోతుంది. మహిళల్లో నాణ్యత గల అండం గర్భధారణకు చాలా ముఖ్యం. ఇదే బిడ్డ ఎదుగుదలకు కీలకం. లేకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
నిపుణుల సూచనలు
సంతానోత్పత్తి తగ్గడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. వయసు పెరిగే కొద్దీ, అండాశయ పరిమాణం, నాణ్యత తగ్గుతుండడం అసలు సమస్యకు కారణం అవుతున్నది. అలాగే, జీవనశైలిలో మార్పులు, నిద్రలేమి, ఒత్తిడి, కల్తీ ఆహారం, పర్యావరణం ఇలా అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఐవీఎఫ్ చికిత్స ద్వారా పిల్లలను కనాలని అనుకునే వారికి సైతం షాకిచ్చే విషయాలను వెల్లడిస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ ఐవీఎఫ్ కూడా విజయవంతం అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. 35 ఏళ్లకు పైన ఉండే మహిళలకు నాణ్యత గల పిండాల ఎదుగుదలకు ఎక్కువ సమయం పడుతుంది. తద్వారా పుట్టే పిల్లలకు అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Also- Birthday: ఇది తెలిస్తే బర్త్ డే రోజు కొవ్వొత్తి ఊదరు? షాకింగ్ నిజాలు చెప్పిన జ్యోతిష్యులు
జీవనశైలిలో మార్పులు జరగాల్సిందే..
ఆహారం-
విటమిన్ ఏ, సీ ప్రొటీన్ అందే ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలతో కూడిన ఆహారం శరీరానికి అందించాలి. అలాగే, డ్రై ఫ్రూట్స్, విటమిన్ డీ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి సప్లిమెంట్స్ కూడా అవసరమే.
వ్యాయామం-
రోజులో కనీసం 45 నిమిషాలపాటు క్రమం తప్పకుండా శారీరక శ్రమ అవసరం. ఇలా చేయడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. బరువును నియంత్రించడంలో దోహదపడుతుంది. ధ్యానం, యోగా వంటివి చేయడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది.
బరువు-
అధిక బరువు ఐవీఎఫ్‌కు ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన పిండం ఎదుగుదలకు తక్కువ బరువుగా ఉంటే మంచిది.
మద్యం, ధూమపానం-
మీకు ఆరోగ్యవంతమైన పిల్లలు కావాలంటే ధూమపాటం, మద్యం మానేస్తే మంచిది. ఎందుకంటే సంతానోత్పత్తి, ఐవీఎఫ్ విజయానికి ఇవి ప్రతికూలంగా ప్రభావం చేసే అవకాశం ఉన్నది.
నిద్ర-
ప్రతి రోజూ 7 నుంచి 9 గంటల నాణ్యమైన నిద్ర ముఖ్యం. ఎందుకంటే ఆరోగ్యం, హార్మోన్ల సమతుల్యతకు ఇది చాలా అవసరం.
గమనిక: పలు అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.
Read Also- Gurugram Case: కూతుర్ని అందుకే చంపేశా.. సంచలన నిజాలు చెప్పిన రాధిక తండ్రి