Birthday: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్ని పనులు చేయకూడదు. అయిన కూడా కొందరు ఇవేమి పట్టించుకోకుండా వారి పనులు వారు చేసుకుని వెళ్తుంటారు. మనిషి జీవితంలో పుట్టిన రోజు చాలా ప్రత్యేకం. కొందరు ఈ రోజును పెద్ద వేడుక లాగా జరుపుకుంటారు. అయితే, ఈ బర్త్ డే రోజు తప్పులు అస్సలు చేయకూయడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Cow Calf: రెండు కాళ్లతో నడుస్తున్న ఆవు దూడ.. కోవిడ్‌ను మించిన ముప్పు రాబోతుందా.. దేనికి సంకేతం?
పంచభూతాలలో అగ్ని అత్యంత శక్తివంతమైనది, పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అగ్ని శక్తి, కాంతి, కొత్త ప్రారంభాలకు చిహ్నంగా నిలుస్తుంది. అందుకే, పూజలు, శుభకార్యాలు లేదా ఏదైనా మంగళకరమైన సందర్భంలో మొదటగా దీపారాధన చేయడం సాంప్రదాయం. దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తులు వస్తాయని, ఆ సమయంలో మొదలు పెట్టిన పనులు విజయవంతమవుతాయని నమ్మకం.
కొవ్వొత్తి ఊదకూడదా?
అయితే, దీపం లేదా మంటలను ఆర్పడం జీవితంలో ఆనందం, సానుకూల శక్తిని నాశనం చేయడమని మన గ్రంథాలు చెబుతున్నాయి. ముఖ్యంగా, పుట్టినరోజు నాడు కొవ్వొత్తిని ఊదడం అశుభకరమని చెబుతున్నారు. కాబట్టి, కేకు పక్కన ఉండే కొవ్వొత్తిని వెలిగించి దేవుడి మందిరంలో లేదా ఇంట్లోని పవిత్ర స్థలంలో ఉంచడం శ్రేయస్కరమని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Also Read: Tummala NageswaraRao: తెలంగాణకు యూరియా సరఫరా.. కేంద్రంతో సంప్రదింపులు.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
బర్త్ డే రోజు కేకును కట్ చేయకుడదా?
అలాగే, కేకును కత్తితో కట్ చేయకూడదని, అలా చేస్తే కలిసి రాదని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. దానికి బదులుగా, చెంచా లేదా ఇతర సురక్షితమైన వస్తువుతో కేకును కోసి, అందరికీ పంచి ఇవ్వాలి. ఇలా చేయడం ద్వారా సానుకూల శక్తులు ఇంట్లోకి వస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: Dating app Scam: వృద్ధుడిపై కన్నేసిన యువకులు.. ఇలా ఉన్నారేంట్రా.. ఇంకెవరూ దొరకలేదా?