Plants Care: మొక్కలను అమితంగా ఇష్టపడడం చాలా మంచి విషయం. మొక్కల పరిరక్షణ చక్కటి అలవాటు కూడా. కాకపోతే, కొందరు మొక్కల పట్ల అతి జాగ్రత్త చూపిస్తుంటారు. తద్వారా తెలియకుండానే వాటికి హాని తలపెడుతుంటారు. ఎక్కువగా నీళ్లు పోయడం, అవసరానికి మించిన ఎరువులు, తరచూ రసాయనాలు పిచికారి వంటివి అతిగా చేస్తుంటారు. ఇలాంటి పనులు మొక్కలను కాపాడడానికి బదులు చనిపోయేందుకు కారణమవుతుంటాయి. అందుకే, మొక్కల పెంపకం విషయంలో ఓ హద్దు వరకే కట్టుబడి ఉండాలి. హద్దు దాటేశామనే అభిప్రాయం ఎవరికైనా ఉంటే ముఖ్యమైన ఈ సాధారణ తప్పులు తెలుసుకుంటే మొక్కలు చాలా చక్కగా పెరుగుతాయి.
మొక్కల పెంపకంలో చేయకూడని తప్పులివే
1. నీళ్లు ఎక్కువ పోయొద్దు
మొక్కలకు అధికంగా నీళ్లు పోయడం చాలా మంది చేసే తప్పు. అతిగా నీళ్లు పోస్తే మొక్క నీళ్లు పాడైపోతాయి. ఫంగస్ వంటివి సోకే అవకాశం ఉంటుంది. తద్వారా మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. అందుకే, నీరు పోయాల్సిన అవసరముందా లేదా అనేది తెలుసుకోవడానికి మట్టిలో చేతి వేలు పెట్టి తనికీ చేయాలి. మట్టి పొడిగా అనిపిస్తే అప్పుడు నీళ్లు పోయాలి.
2. నీరు తక్కువగా పోయడం
నీరు మోతాదు కంటే తక్కువగా పోసినా మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. ఎండిపోవడానికి దారితీస్తుంది. అందుకే, మట్టిని తరచూ వేలితో చెక్ చేసి తడి లేకుంటే, అవసరమైన మేరకు నీరు పోయాలి.
3. తగిన సూర్యకాంతి ఉండాలి
నిజానికి కొన్ని మొక్కలు నేరుగా పడిన సూర్యకాంతినైనా తట్టుకోగలవు. అయితే, కొన్ని మొక్కలు తట్టుకోలేవు. ఎండిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి మొక్కలు పరోక్ష కాంతిలో చక్కగా పెరుగుతాయి. కాబట్టి, మొక్కకు తగిన సూర్యకాంతి ఏదో తెలుసుకొని అది అందే చోట పెట్టాలి.
Read Also- PACL Scam: రూ.49 వేల కోట్ల స్కామ్.. కీలక వ్యక్తి అరెస్ట్
4. ఉష్ణోగ్రత సరిపడాలి
ఇంట్లో పెంచుకునే మొక్కలకు సాధారణంగా 18–24 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత సరిపోతుంది. అంతకుమించి చల్లగా లేదా వేడిగా ఉండే ప్రదేశాల్లో మొక్కలు పెట్టకూడదు. ఏసీ, హీటర్ వంటి ఉష్ణాన్ని విడుదల చేసే పరికరాలకు దగ్గరగా పెట్టకూడదు.
5. తేమ సరిపడా ఉంటే చాలు
మొక్కలకు 40–60 శాతం వరకు తేమ సరిపోతుంది. మొక్కలకు ఇది మెరుగైన తేమశాతం. మొక్కలు పొడిబారిపొతున్నాయనిపిస్తే నీళ్లు, గులకరాళ్లతో నింపిన ట్రే (Tray) లలో పెట్టాలి. లేదా, హ్యూమిడిఫైయర్‌ను కూడా వాడవచ్చు.
6. చక్కగా గాలి తగలాలి
మొక్కల మధ్య కొంత స్థలం ఉండాలి. మొక్కలకు చక్కగా గాలి తగలడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది. అవసరమైతే ఫ్యాన్‌ను కూడా వాడుకోవచ్చు.
7. ఎరువులు మితిమీరొద్దు
మొక్కలు మంచిగా పెరిగే కాలంలో ఎరువులు అతిగా వేస్తుంటారు. అది మంచి పద్ధతి కాదు. ఎరువుల వినియోగం సమతుల్యంగా ఉండాలి. డోస్ మించితే మొక్కల వేళ్లు మాడిపోతాయి. తద్వారా మొక్క చనిపోతుంది.
8. ఆకులు ఏరివేయాలి(ప్రూనింగ్)
మొక్క ఆకారం సరిగ్గా ఉండాలన్నా, చక్కగా ఎదగాలన్నా ఎండిపోయి రాలిపోయే ఆకులు, కొమ్మలను ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాలి.
Read Also- Viral News: ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందనే మాట నిజమైందోచ్!!
9. కీటకాలు, రోగాలు గమనించాలి
మనుషులకు మాదిరిగానే మొక్కలకు కూడా రోగాలు వస్తుంటాయి. అందుకే, తరచూ మొక్కలను పరిశీలిస్తుండాలి. చీమలు, ఆకుతినే వంటి కీటకాలు ఉంటే నీమ్ ఆయిల్ లేదా ఇన్‌సెక్సిడైడ్ సోప్‌ను వాడాలి.
10. వేళ్లు పెరుగుతుంటే మళ్లీ నాటాలి
వేర్లు చాలా పెద్దగా మారిన తర్వాత కూడా మొక్కల కంటైనర్లను మార్చరు. అలా కాకుండా, ప్రతి 1-3 ఏళ్లకు ఒకసారిగా మొక్కలను తిరిగి నాటుతుండాలి. మొక్కను కంటెయినర్ నుంచి తొలగించే సమయంలో సున్నితంగా వ్యవహరించాలి. చేతులతో జాగ్రత్తగా బయటకు తీయాలి. వేర్లు దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి.