Cow Calf: “రెండు కాళ్లతో నడుస్తున్న ఆవు దూడ” అనగానే అందరూ షాక్ అయ్యరా? అయితే, ఇదే నిజమే అండి. దీని గురించి రెండు కోణాల్లో తెలుసుకుందాం..
1) బ్రహ్మం గారి కాలజ్ఞానంలో రాసింది ఇప్పుడు జరిగిందా?
2) శాస్త్రీయంగా చెప్పొచ్చు
Also Read: Bandi Sanjay: టీటీడీ ఏమైనా సత్రమా.. అన్యమతస్తులను తొలగించరా.. ఏపీ సర్కార్‌పై బండి ఫైర్!
బ్రహ్మం గారి కాలజ్ఞానంలో రాసింది ఇప్పుడు జరిగిందా?
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో 17వ శతాబ్దంలో జీవించిన ఒక గొప్ప యోగి, జ్యోతిష్యుడు. ఆయన రచించిన “కాలజ్ఞానం” భవిష్యత్తు సంఘటనలను తెలియజేస్తుంది. ఇప్పటికీ కూడా మన పెద్ద వాళ్ళు బ్రహ్మం గారు చెప్పినట్టే జరుగుతుందని అంటారు. ఈ కాలజ్ఞానం తెలుగు ప్రజలలో ఎంతో ప్రాచుర్యం పొందింది.
“మూడు కాళ్ల గుర్రం”, “ఆకాశంలో రెండు సూర్యులు”, “రెండు కాళ్లతో నడిచే ఆవు దూడ” వంటివి భవిష్యత్ సంఘటనలను సూచించే సంకేతాలుగా ఆయన చెప్పారు. ఎందుకంటే, ఆయన చెప్పిన వాటిలో చాలా వరకు జరిగాయి. ఇది ఒక అసాధారణ సంఘటన కానీ, బ్రహ్మం దీని గురించి ముందే చెప్పడంతో ప్రజలు కూడా భయపడుతున్నారు. జరగకూడనవి మన ముందే జరుగుతుంటే.. కోవిడ్ ను మించిన ముప్పు రాబోతుందని కొందరు అంటున్నారు. ఇంకొందరు ఇలాంటి మూఢ నమ్మకాలు నమ్మకండి. దీని గురించి శాస్త్రీయంగా కూడా చెప్పారని చెబుతున్నారు.
Also Read: Ponguleti Srinivas Reddy: మాట నిలబెట్టుకున్న రేవంత్ సర్కార్.. లోకల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అమలు
శాస్త్రీయంగా నిపుణులు ఏం చెప్పారంటే?
రెండు కాళ్లతో నడిచే ఆవు దూడ అనేది ఒక అరుదైన జన్మ వైకల్యం లేదా జన్యు సంబంధిత అసాధారణత కారణంగా సంభవించవచ్చు. జంతువులలో అసాధారణ శారీరక లక్షణాలతో జన్మించడం అరుదైనప్పటికీ, ఇటువంటి ఘటనలు శాస్త్రీయంగా నిపుణులు వీటి గురించి వివరించారు.
మనం అంతక ముందు రెండు తలలు, ఆరు కాళ్లు, లేదా ఎనిమిది కాళ్లతో జన్మించిన ఆవు దూడల గురించి ఎన్నో వార్తలు చూశాము . అయితే, రెండు కాళ్లతో నడిచే ఆవు దూడ గురించి ఎప్పుడూ వినలేదు. ఇటువంటి సంఘటనలు జన్యు మ్యూటేషన్స్ లేదా గర్భావస్థలో అసాధారణ అభివృద్ధి వల్ల సంభవించవచ్చని నిపుణులు వెల్లడించారు.
Also Read: Tummala NageswaraRao: తెలంగాణకు యూరియా సరఫరా.. కేంద్రంతో సంప్రదింపులు.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఆవు దూడ సాధారణంగా నాలుగు కాళ్లతో నడుస్తుంది, కానీ రెండు కాళ్లతో నడవడం అసాధారణం. ఇది సమాజంలో అసాధారణ మార్పులు, సాంకేతిక పురోగతి, లేదా జన్యు సంబంధిత మార్పులను సూచించవచ్చు. రెండు కాళ్లతో నడవడం అనేది మానవ లక్షణాన్ని పోలి ఉంటుంది, కాబట్టి ఇది సమాజంలో మానవులు వలే ప్రవర్తిస్తుందా ? అనే సందేహాలు వస్తున్నాయి.