Bandi Sanjay (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

Bandi Sanjay: టీటీడీ ఏమైనా సత్రమా.. అన్యమతస్తులను తొలగించరా.. ఏపీ సర్కార్‌పై బండి ఫైర్!

Bandi Sanjay: తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ దర్శించుకున్నారు. నేడు ఆయన పుట్టిన రోజు నేపథ్యంలో స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. దర్శనం అనంతరం బయటకు వచ్చిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్యమతస్తులు టీటీడీలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతున్న వేళ.. ఇదేమైనా సత్రమా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

తిరుమల.. హిందువుల ఆస్థి
శక్తి వంతమైన భారత దేశ నిర్మాణం కోసం.. ప్రధాని మోదీ కోసం తాను శ్రీవారిని ప్రార్థించినట్లు బండి సంజయ్ తెలిపారు. దూపదీప నైవాద్యాలకు‌ నోచుకోని ఆలయాల కోసం టీటీడీ సాయమందించాలని కోరారు. కరీంనగర్ పార్లమెంట్ పరిదిలో దేవాలయాల అభివృద్ది కోసము టీటీడీ తోడ్పాటును ఆయన కోరారు. తిరుమల దేవస్థానం హిందువుల ఆస్థి అన్న బండి.. టీటీడీలో వెయ్యి మందికి పైగా అన్యమతస్థులు ఉన్నారని ఆరోపించారు. వారిని ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదని అన్నారు.

ఎన్ని రోజులు ఊపేక్షించాలి
ఇతర మతాలకు చెందిన వారు టీటీడీలో ఉండటము వల్ల.. దేవాలయాల పనితీరుపై ప్రతికూల ప్రభావము పడుతుందని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. ఎన్ని రోజులు ఇంకా ఉపేక్షించాలని ప్రశ్నించారు. దీనిపై టిటిడి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మసీదు, చర్చికి హిందువులను అసలు రానిస్తారా అంటూ ప్రశ్నించారు. టీటీడీ ఎమైనా సత్రమా నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వము, టీటీడీ పాలక మండలి వెంటనే అన్యమతస్తులను తొలగించాలని బండి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Also Read: Young Hero: ఆ సమస్య ఉంది పడుకోలేను.. నరకం అనుభవిస్తున్నా.. తెలుగు హీరో షాకింగ్ కామెంట్స్

అన్యమతస్తులపై బదిలీ వేటు
బండి సంజయ్ తాజా వ్యాఖ్యలతో తిరుమల తిరుపతి దేవస్థానం అన్యమతస్తుల మధ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సాధారణంగా టీటీడీలో హిందూ మతానికి చెందిన వారు మాత్రమే పనిచేయాలి. కానీ కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం టీటీడీ బోర్డ్ సహా ఉద్యోగాల్లో అన్యమతస్తులను చేర్చారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో టీటీడీలో దాదాపు 300 మంది అన్యమతస్తులను పాలకమండలి గుర్తించినట్లు వార్తలు వచ్చాయి. వారిలో కొందరిపై ఇప్పటికే బదిలీ వేటు వేసింది. ఇంకా కొందరు అన్యమతస్తులు ఉన్నారని బండి సంజయ్ ఆరోపణలను బట్టి తెలుస్తోంది.

Also Read This: Rajinikanth: ఇండస్ట్రీలోనే తొలిసారి.. రిస్క్‌ చేయబోతున్న రజినీకాంత్ తేడా వస్తే.. కోలుకోలేని దెబ్బే

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు