Young Hero: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యువ హీరోలు చాలా మంది ఉన్నారు. కానీ వారిలో కొందరు మాత్రమే స్టార్ గుర్తింపు పొందారు. కొందరు ఒక్క హిట్‌తో నాలుగు ఫ్లాప్‌లు పడినా కూడా పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. అలాంటి నటుల్లో సందీప్ కిషన్ కూడా ఒకరు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 10 ఏళ్ళు దాటినా, స్టార్ హీరోగా గుర్తింపు సాధించడంలో అతను ఇంకా వెనుకబడి ఉన్నాడు. అయినప్పటికీ, వెనక్కి తగ్గకుండా సినిమాలు చేస్తూ, తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.
సందీప్ కిషన్ కు అలాంటి సమస్య ఉందా?
అయితే, ఈ యంగ్ హీరో తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన ఆరోగ్య సమస్య గురించి బయటపెట్టాడు. అతను సైనస్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపాడు. ఈ సమస్య వల్ల నిద్రపోవడం అతనికి ఒక పెద్ద సవాలుగా మారిందని చెప్పాడు. షూటింగ్ సమయంలో విరామం దొరికినప్పుడు కారవాన్‌లోనే నిద్రపోవాల్సి వస్తోందని, అలాంటి సమయంలో ముక్కు నుంచి లోపలి భాగం వరకు బ్లాక్ అవుతుందని, ఇది తనకు రోజూ ఒక రకమైన యాతనగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సమస్య మరెవరికీ రాకూడదని కూడా అతను కోరుకున్నాడు.
నెటిజన్ల రియాక్షన్ ఇదే..
సందీప్ కిషన్ తన ఆరోగ్య సమస్య గురించి బయట పెట్టడంతో, సోషల్ మీడియాలో అతని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ, తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. అతను పూర్తిగా కోలుకోవాలని, మళ్లీ ఉత్సాహంతో సినిమాల్లో రాణించాలని ఆశిస్తున్నారు.